MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahanati-savitri-29e3fac7-a3f0-41a9-9e4c-76d933f0b5b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahanati-savitri-29e3fac7-a3f0-41a9-9e4c-76d933f0b5b7-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో ఒక్కపుడు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ లో చిత్రీకరించేవారు. ఇక ఇప్పుడంటే గ్రాఫిక్స్ ని వాడుతున్నారు కానీ.. అప్పట్లో ట్రిక్ ఉపయోగించి ప్రేక్షకులను మెప్పించేవారు. అయితే ముఖ్యంగా విఠలాచార్య సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఆయన సినిమాలో కొన్ని సీన్స్ ఇప్పటికీ ఆశ్చర్యని కలిగిస్తాయి.Mahanati Savitri {#}savitri;Graphics;Girl;Heroine;Traffic police;Mahanati;Savithri;Loveమహానటి సావిత్రి తెలివి తేటలు మాములుగా లేవుగా..!!మహానటి సావిత్రి తెలివి తేటలు మాములుగా లేవుగా..!!Mahanati Savitri {#}savitri;Graphics;Girl;Heroine;Traffic police;Mahanati;Savithri;LoveFri, 18 Jun 2021 10:14:20 GMTఇండస్ట్రీలో ఒక్కపుడు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ లో చిత్రీకరించేవారు. ఇక ఇప్పుడంటే గ్రాఫిక్స్ ని వాడుతున్నారు కానీ.. అప్పట్లో ట్రిక్ ఉపయోగించి ప్రేక్షకులను మెప్పించేవారు. అయితే ముఖ్యంగా విఠలాచార్య సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఆయన సినిమాలో కొన్ని సీన్స్ ఇప్పటికీ ఆశ్చర్యని కలిగిస్తాయి.

అయితే సాధారణంగా ‘కాలాతీత వ్య‌క్తులు’ ప్రేర‌ణ‌తో 1963లో వచ్చిన చ‌దువుకున్న అమ్మాయిలు సినిమాలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అయితే మహానటి సావిత్రి, కృష్ణ‌కుమారి, స‌రోజ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వ‌ర‌రావును సావిత్రి, కృష్ణ‌కుమారి లవ్ చేసుకుంటారు. ఇక అక్కినేని మ‌న‌సులో కృష్ణ‌కుమారి ఉంటుంది.

అలాగే పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ రోల్ చేసిన శోభ‌న్‌బాబుకి సావిత్రి భార్యగా నటిస్తుంది. ఇక సావిత్రి కంటే కృష్ణ‌కుమారి,స‌రోజ కాస్త పొడ‌వుగా ఉంటారు. ఈ చిత్రంలో ఆ ముగ్గురు హీరోయిన్స్ కాంబినేష‌న్ సీన్ల‌లో త‌ను పొట్టిగా కనపడకుండా ఉండేలా సావిత్రి ఓ ట్రిక్ ప్లే చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇక సావిత్రి తోడుగా దాక్షాయ‌ణి అనే అమ్మాయి ఉంటూ సావిత్రి మేక‌ప్ వంటివన్నీ శ్ర‌ద్ధ‌గా చూసుకునేది. అయితే ఆమె  ఏ స‌న్నివేశంలో ఏ న‌గ‌లు పెట్టుకుందో.. ఏ చీర క‌ట్టుకుందో కేశాలంక‌ర‌ణ వివ‌రాలతో పాటు స‌న్నివేశం త‌ర్వాత వ‌చ్చే స‌న్నివేశం వివ‌రాలు అన్నీ ఓ పుస్త‌కంలో రాసుకుంటూ ఉండేది.

ఇక సొంత న‌గ‌లు వాడితే స‌హాయ ద‌ర్శ‌కుడికి ఆ వివ‌రాలు తెలియజేసేది. అంతేకాదు.. ఎప్పుడు మ‌ళ్లీ అవ‌స‌రం వ‌చ్చినా, స‌న్నివేశం చెబితే ఆ న‌గ‌ల‌న్నీ ఆ అమ్మాయి తీసుకొచ్చేది. అలాగే ఈ సినిమాలో సావిత్రి, కృష్ణ‌కుమారి, స‌రోజ క‌లిసి వుండే సీన్స్ లో వాళ్లిద్ద‌రి కంటే త‌ను పొట్టి కాబ‌ట్టి, సింగ‌పూర్ నుంచి ప్రత్యేకించి తేప్పించుకున్న హైహీల్స్ సావిత్రి వేసుకుంటుంది. ఇక సెట్స్ మీద ఎప్ప‌టిక‌ప్పుడు సావిత్రికి సంబంధించిన షాట్స్ గ‌మ‌నించే దాక్షాయ‌ణి, ఆ ముగ్గురి షాట్స్ ఎప్పుడు తీస్తున్నా, సైలెంట్ గా సావిత్రి కాళ్ల ద‌గ్గ‌ర‌కు ఆ చెప్పులు తెచ్చి, అక్కా! ఆ చెప్పులు తెచ్చానని చెవిలో చెప్పి వెళ్తుండేది. ఆలా సావిత్రి ఎక్కడా పొట్టిగా కన్పించకుండా సావిత్రి జాగ్రత్త పడుతుండేది.



ప్రజల కోసమే సేవ చేయడానికి వచ్చిన సీఎం.. మహేష్.

జాన్వి కపూర్ తో అజ్ఞాత వ్యక్తి పై ఆశక్తికర చర్చలు !

వీడు మామూలోడు కాదు.. ఒకేసారి ఇద్దరితో..

ఇది నటసింహ గర్జన లెజెండ్.. ఈ సినిమా విశేషాలు ఏంటో తెలుసా ?

అఫీషియల్ : ధనుష్ తో శేఖర్ కమ్ముల ట్రైలింగ్యువల్ సినిమా

గ్యాంగ్ లీడర్ తర్వాత ఆ సీనియర్ నటి ఏమైంది ?

ఉపాసన,చరణ్ మొదటి పరిచయం ఎక్కడ జరిగిందో తెలుసా..?

ఆదితో ప్రియమణి.. పూర్ణతో సుధీర్.. ఢీ షోలో హంగామా..!

ఆరోజు షారుక్ ఖాన్ రూ.లు 300 చేతిలో పెట్టాడు : ప్రియమణి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>