MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hyderabad4f3c3565-3f38-4422-8ac3-38e55e738633-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hyderabad4f3c3565-3f38-4422-8ac3-38e55e738633-415x250-IndiaHerald.jpgక‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం మెల్లి మెల్లిగా త‌గ్గుముకం ప‌డుతోంది. ఇదివ‌ర‌కు దేశంలో కేసుల సంఖ్య రోజుకు ల‌క్ష‌కుపైగా న‌మోదుకాగా ప్ర‌స్తుతం వేల‌ల్లో న‌మోద‌వుతుంది. అంతే కాకుండా మ‌ర‌ణాల సంఖ్య కూడా కాస్త త‌గ్గింది. ఇక కరోనా కేసులు వేగంగా పెర‌గ‌టంతో దేశ వ్యాప్తంగా అన్ని ఇండ‌స్ట్రీల‌తో పాటు టాలీవుడ్ లోనూ సినిమాల షూటింగ్ లు నిలిపివేశారు. ఇప్పుడు క‌రోనా త‌గ్గుముకం ప‌ట్ట‌డంతో అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ సినిమా షూటింగ్ లు తిరిగి మొద‌లు పెడుతున్నారు. ఇక మ‌న‌వాళ్లు కూడా షూటింగ్ లు మొద‌లు పెట్టేస్తున్నారు. చిన్న సhyderabad{#}Nani;Vikram Kumar;Rajamouli;shyam;Hyderabad;Rajahmundry;Chiranjeevi;Coronavirus;naga;Tollywood;sukumar;Hero;Cinemaహైద‌రాబాద్ లో షూటింగ్ లు షురూ..ఏ సినిమా ఎక్క‌డ‌.. !హైద‌రాబాద్ లో షూటింగ్ లు షురూ..ఏ సినిమా ఎక్క‌డ‌.. !hyderabad{#}Nani;Vikram Kumar;Rajamouli;shyam;Hyderabad;Rajahmundry;Chiranjeevi;Coronavirus;naga;Tollywood;sukumar;Hero;CinemaFri, 18 Jun 2021 18:02:54 GMTక‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం మెల్లి మెల్లిగా త‌గ్గుముకం ప‌డుతోంది. ఇదివ‌ర‌కు దేశంలో కేసుల సంఖ్య రోజుకు ల‌క్ష‌కుపైగా న‌మోదుకాగా ప్ర‌స్తుతం వేల‌ల్లో న‌మోద‌వుతుంది. అంతే కాకుండా మ‌ర‌ణాల సంఖ్య కూడా కాస్త త‌గ్గింది. ఇక కరోనా కేసులు వేగంగా పెర‌గ‌టంతో దేశ వ్యాప్తంగా అన్ని ఇండ‌స్ట్రీల‌తో పాటు టాలీవుడ్ లోనూ సినిమాల షూటింగ్ లు నిలిపివేశారు. ఇప్పుడు క‌రోనా త‌గ్గుముకం ప‌ట్ట‌డంతో అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ సినిమా షూటింగ్ లు తిరిగి మొద‌లు పెడుతున్నారు. ఇక మ‌న‌వాళ్లు కూడా షూటింగ్ లు మొద‌లు పెట్టేస్తున్నారు. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వ‌ర‌కూ త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ షూటింగ్ ల‌కు వెళుతున్నారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ చాలా సినిమాల షూటింగ్ లు షురూ అయ్యాయి. మ‌రి కొన్ని సినిమాలు షూటింగ్ ల‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 

ఇక ప్ర‌స్తుతం ఏ సినిమా షూటింగ్ ఎక్క‌డ జ‌రుతోంది...? ఏ సినిమా షూటింగ్ కు సిద్ద‌మ‌వుతోంది..? అనే వివ‌రాలు ఇప్పుడు చూద్దాం. ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తెర‌కెక్కిస్తున్న‌ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ గండిపేట లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. క‌రోనా విజృంభ‌ణ లేన‌ట్ల‌యితే ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌య్యేది. ఇక మెగాస్టార్ కొర‌టాల కాంబినేష‌న్లో తెరకెక్కుతున్న‌ ఆచార్య సినిమా షూటింగ్ కోకాపేటలో ఈరొజు ప్రారంభం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ కూడా ఎండింగ్ ద‌శ‌లోనే ఉంది. అంతే కాకుండా నాని హీరోగా న‌టిస్తున్న‌ శ్యామ్ సింగారాయ్ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లోని సీబీఐటీ కాలేజ్ పరిసర ప్రాంతంలో వేసిన సెట్ లో జరుగుతోంది.

ఇక నాగ చైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేష‌న్ లో థాంక్యూ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం సికింద్రాబాద్ లో జరుగుతుంది. మ‌రోవైపు యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న‌ మాస్ట్రో సినిమా షూటింగ్ ఎర్రమంజిల్ ప్రాంతంలో జరుగుతుంది. అంతే కాకుండా సుకుమార్ బ‌న్నీ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న‌ పుష్ప షూటింగ్ ..ఈనెల 28 నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగనుంది. ఇక బాల‌య్య హీరోగా న‌టిస్తున్న‌ అఖండ సినిమా షూటింగ్ జూలై 1 నుంచి గండిపేట లో 40రోజులపాటు జరుగనుంది. మహేష్ సర్కార్ వారి పాట జూలై 5 నుండి హైదరాబాద్ లో జరుగనుంది.



సౌత్ లో రజినికాంత్ ని బీట్ చేసిన విజయ్

బ్రేకింగ్ : రాచకొండలో 53 మంది పోకిరీలు అరెస్ట్..!

మోడీ క్రేజ్ మ‌స‌క‌బారుతోంది... ప‌డుతోన్న గ్రాఫ్ ?

సామాన్యుడే "సీఎం" అయితే... జోగేంద్రలా ఉంటాడు ?

'విశాల్' కంటికి గాయాలు.. షూటింగ్ కి బ్రేక్..?

హైద‌రాబాద్ చాలా సినిమాల షూటింగ్ లు షురూ అయ్యాయి. మ‌రి కొన్ని సినిమాలు షూటింగ్ ల‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

బెల్లం బాబుకి షాక్ ఇచ్చిన పెన్ స్టూడియోస్

నాని మీట్ క్యూట్ బ్యూటీ లు ఎవరంటే?

ఒకే హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న ఆర్ఆర్ఆర్ హీరోలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>