PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/google-help-for-oxigen-plants08d8e5fe-3c69-4133-ba28-a8017573a293-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/google-help-for-oxigen-plants08d8e5fe-3c69-4133-ba28-a8017573a293-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ఆక్సిజన్ కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎంతో మంది కరోనా బాదితులు ఆక్సిజన్ అందక మరణించిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా పీరియడ్ లో ఆక్సిజన్ కొరత ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. GOOGLE HELP FOR OXIGEN PLANTS{#}Google;oxygen;Coronavirusగ్రామాల్లో ఆక్సిజన్ ప్లాంట్ ల నిర్మాణానికి గూగుల్ సాయం...గ్రామాల్లో ఆక్సిజన్ ప్లాంట్ ల నిర్మాణానికి గూగుల్ సాయం...GOOGLE HELP FOR OXIGEN PLANTS{#}Google;oxygen;CoronavirusThu, 17 Jun 2021 16:25:23 GMTప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ఆక్సిజన్ కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎంతో మంది కరోనా బాదితులు ఆక్సిజన్ అందక మరణించిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా పీరియడ్ లో ఆక్సిజన్ కొరత ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. అయితే ఓ వైపు ప్రభుత్వాలు తమ వంతు కృషి తాము చేస్తుండగా, మరో వైపు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, దాతలు, సినీ ప్రముఖులు ఆక్సిజన్ సిలిండర్లను అందించడం, ఆక్సిజన్ల ప్లాంట్ లను నెలకొల్పడం వంటివి చేసి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా గూగుల్ సంస్థ కూడా ఈ లిస్ట్ లో చేరింది.

కరోనా సమయంలో  ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేసేందుకు ఏకంగా రూ.113 కోట్ల సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పలు స్వచ్ఛంద సంస్థలతో కలసి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది గూగుల్ సంస్థ. దేశంలోని దాదాపు 80 గ్రామాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆక్సిజన్ ప్లాంట్ల వలన దేశంలో ఆక్సిజన్ కొరత చాలా వరకు తగ్గిపోతుందనే  చెప్పాలి. భారీ స్థాయిలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చిన గూగుల్ సంస్థకు దేశం నలుమూలల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ప్లానింగ్ ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరలో  పనులు మొదలుపెట్టనున్నారని సమాచారం. అంతే కాకుండా ఈ కరోనా కష్ట సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు శిక్షణ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది గూగుల్ సంస్థ. 20 వేల మంది ఆరోగ్య సిబ్బందికి అపోలో మెడి స్కిల్స్ ద్వారా కరోనా నిర్వహణకు సంబంధించిన శిక్షణను అందించేందుకు సైతం సిద్ధమైనట్లు ప్రకటించింది. మరోవైపు 15 రాష్ట్రాల్లో 1.8 లక్షలమంది ఆశా వర్కర్లకు, 40 వేల మంది  ఏఎన్ఎమ్ లకు శిక్షణ ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం.



బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే..?

లక్షణాలు ఒకేలా ఉంటాయి.. తస్మాత్ జాగ్రత్త?

ఆ టీడీపీ నేత కరెక్ట్‌గానే చెప్పారు...లోకేష్ వల్లే ఇబ్బంది..

"రామ్ చరణ్ - శంకర్" సినిమాలో కీలక పాత్రలో మలయాళ స్టార్ ?

గుడ్ న్యూస్ :పిల్లలపై ఆ రెండు టీకాలు పనిచేస్తున్నాయ్

కోవిడ్ సోకిన పిల్లలకు ఈ మందులు వాడుతున్నారా ... ?

దసరా లో ఆచార్య కన్ఫ్యూజన్ !

కన్నీరు తెప్పిస్తున్న జిహెచ్ఎంసి వాటర్ బిల్?

క‌రోనాకు కొత్త మందు.. ఎలా పనిచేస్తుందంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>