MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush174ecc6f-4e71-4a2c-9dee-b1b96588fce5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush174ecc6f-4e71-4a2c-9dee-b1b96588fce5-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో తన జోరు చూపిస్తున్నాడు. దాదాపు నాలుగు సినిమాలు ఆయన ఒకే సమయంలో చేస్తూ ఇతర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. వీటిలో తొలుత రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ అనే సినిమా విడుదల అవుతోంది. జూలై 30న విడుదల కాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సాహో లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. adipurush{#}Saif Ali Khan;kriti sanon;prashanth neel;raj;Prasanth Neel;AdiNarayanaReddy;krishna;Saaho;Pooja Hegde;Darsakudu;Prabhas;India;Director;Cinema;bollywoodఆదిపురుష్ చేయకుంటే బాగుండేది.. బంగారం లాంటి ఛాన్స్ మిస్!!ఆదిపురుష్ చేయకుంటే బాగుండేది.. బంగారం లాంటి ఛాన్స్ మిస్!!adipurush{#}Saif Ali Khan;kriti sanon;prashanth neel;raj;Prasanth Neel;AdiNarayanaReddy;krishna;Saaho;Pooja Hegde;Darsakudu;Prabhas;India;Director;Cinema;bollywoodThu, 17 Jun 2021 11:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో తన జోరు చూపిస్తున్నాడు. దాదాపు నాలుగు సినిమాలు ఆయన ఒకే సమయంలో చేస్తూ ఇతర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. వీటిలో తొలుత రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ అనే సినిమా విడుదల అవుతోంది. జూలై 30న విడుదల కాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సాహో లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక పాన్ ఇండియా చిత్రాల దర్శకుడు కే జి ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇద్దరూ పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు కావడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. దేశం మొత్తం ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఆది పురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి బాలీవుడ్ చిత్రంగా తెరకెక్కుతోంది. 

కృతి సనన్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కబోతోందని అంటున్నారు. ఈ సినిమా చేయడం ఎంతో గర్వకారణంగా ఫీలయ్యారు ఫ్యాన్స్ అయితే ఈ సినిమా చేయడం వల్ల ప్రభాస్ మరో భారీ ఆఫర్ చేజార్చుకున్నారు అన్నది బాలీవుడ్ సినీ విశ్లేషకుల మాట. యశ్ రాజ్ ప్రొడక్షన్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సిరీస్ ధూమ్. ఇప్పటికే మూడు భాగాలు సూపర్ హిట్ గా నిలువగా నాలుగో భాగం కూడా ప్రస్తుతం తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ని నటింప చేయాలనుకున్నారు కానీ ఆదిపురుష్ లాంటి పౌరాణిక సినిమా చేస్తున్న ప్రభాస్ ఈ యాక్షన్ సినిమా చేయడం కరెక్ట్ కాదని వారు భావించి ప్రభాస్ తప్పించారట. ఆది పురుష్ కారణం గా ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమా ని కోల్పోవాల్సి వచ్చింది. 



స్నేహం కోసం గెస్ట్ గా విజయ్ దేవరకొండ.. చిన్న సినిమా లో మెరిసి..!!

ఆ సినిమాలో గెస్ట్ ఈస్ బెస్ట్ అనిపించుకున్న స్టార్ హీరోలు..

ఆ సినిమాలో చిరు ఎంట్రీ వేరే లెవెల్..

నాగబాబు సినిమాలో స్పెషల్ గెస్ట్‌గా వరుణ్ తేజ్..?

క‌రోనాకు కొత్త మందు.. ఎలా పనిచేస్తుందంటే..?

జగపతి బాబు కెరీర్ ని మలుపు తిప్పిన సంవత్సరం ఇదే..!!

విజయ్ దేవరకొండ షాకింగ్ లుక్ కు అంతర్మధనంలో యంగ్ హీరోలు !

స్టార్ హీరోయిన్ కటౌట్.. కేవలం బుల్లితెర చాలనుకుంటుంది..!

ఈ బాలీవుడ్ హీరోయిన్లు అప్పుడలా.. ఇప్పుడిలా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>