PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tage42a5a07-a1de-4d1a-b636-0c99b2d542e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tage42a5a07-a1de-4d1a-b636-0c99b2d542e1-415x250-IndiaHerald.jpg తెలంగాణ‌లో ఉప ఎన్నిక వ‌స్తే ముఖ్య‌మంత్రి కేసీఆర్ అక్క‌డ ఎటువంటి వ‌రాలు ప్ర‌క‌టిస్తారో, అభివృద్ధికి ఎన్ని నిధులు విడుద‌ల చేస్తారో గ‌డిచిన చ‌రిత్రే చెబుతోంది. తాజాగా హుజూరాబాద్ కు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఇక్క‌డినుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న ఈటెల రాజేంద‌ర్ భార‌తీయ జ‌న‌తాపార్టీ తీర్థం పుచ్చుకోవ‌డంతో కేసీఆర్ హుజూరాబాద్‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారు. నాగార్జున‌సాగ‌ర్‌, దుబ్బాక‌, హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు వంద‌ల కోట్ల‌రూపాయ‌ల అభివృద్ధి ప‌నుల‌కు నిధులు మంజూరు చేయ‌డ‌tag{#}Huzur Nagar;KCR;Bharatiya Janata Party;Telangana;Minister;Partyఈటెల‌పై సానుభూతి పెంచుతున్న‌కేసీఆర్‌?ఈటెల‌పై సానుభూతి పెంచుతున్న‌కేసీఆర్‌?tag{#}Huzur Nagar;KCR;Bharatiya Janata Party;Telangana;Minister;PartyThu, 17 Jun 2021 12:27:20 GMT
తెలంగాణ‌లో ఉప ఎన్నిక వ‌స్తే ముఖ్య‌మంత్రి కేసీఆర్ అక్క‌డ ఎటువంటి వ‌రాలు ప్ర‌క‌టిస్తారో, అభివృద్ధికి ఎన్ని నిధులు విడుద‌ల చేస్తారో గ‌డిచిన చ‌రిత్రే చెబుతోంది. తాజాగా హుజూరాబాద్ కు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఇక్క‌డినుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న ఈటెల రాజేంద‌ర్ భార‌తీయ జ‌న‌తాపార్టీ తీర్థం పుచ్చుకోవ‌డంతో కేసీఆర్ హుజూరాబాద్‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారు. నాగార్జున‌సాగ‌ర్‌, దుబ్బాక‌, హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు వంద‌ల కోట్ల‌రూపాయ‌ల అభివృద్ధి ప‌నుల‌కు నిధులు మంజూరు చేయ‌డ‌మే కాకుండా వాటిగురించి ప్ర‌చారం కూడా హోరెత్తించారు. ఇప్పుడు అదే సూత్రాన్ని హుజూరాబాద్‌లో అమ‌లు చేయ‌బోతున్నారు.

ఈటెల‌పై పోటీచేసేది ఎవ‌రో?
హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈటెల రాజేంద‌ర్ బ‌ల‌మైన నేత‌గా ఉన్నారు. అక్ర‌మంగా భూమిని ఆక్ర‌మించుకున్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న్ని మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించారు. పార్టీలో ఇమిడే ప‌రిస్థితి కూడా లేద‌ని స్ప‌ష్ట‌మ‌వ‌డంతో ఈటెల క‌మ‌లం కండువా క‌ప్పుకున్నారు. ఆయ‌న‌తోపాట మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఇత‌ర నేత‌లు కూడా బీజేపీ గూటికి చేరారు. ఈటెల స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీచేస్తే ఆయ‌న‌కు సానుకూల ప‌వ‌నాలు ఉండేవ‌ని, ఇప్పుడు బీజేపీలో చేర‌డంవ‌ల్ల అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు ద‌గ్గ‌ర‌య్యే అవ‌కాశం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అధికార పార్టీకి ఉండే అవ‌కాశాన్ని అనుకూలంగా మార్చుకొని ఇక్క‌డ టీ ఆర్ ఎస్‌నే గెలిపించాల‌నే ప‌ట్టుద‌ల‌తో కేసీఆర్ ఉన్నారు. అందుకు అనుగుణంగా ఆయ‌న పావులు క‌దుపుతున్నారు. ఈటెల‌పై ఎవ‌రిని పోటీకి దింపుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. వినోద్‌కుమార్‌ను నిల‌బ‌డెతారంటూ జోరుగా ఊహాగానాలు వ‌స్తున్న‌ప్ప‌టికీ త్వ‌ర‌లోనే అది కూడా ఖ‌రార‌వుతుంది.
 
దీర్ఘ‌కాలిక అభివృద్ధి ఏది?
హుజురాబాద్ అభివృద్ధి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం రూ. 35 కోట్లు మంజూరు చేసింది. వీటిల్లో రూ.10 కోట్లు తాగునీటి కోసం, రూ.25 కోట్లు వార్డుల‌వారీ అభివృద్ధి కోసం ఖ‌ర్చుచేయ‌నున్నారు. తాను ఇక్క‌డే మ‌కాంవేసి 45 రోజుల్లో అభివృద్ధి ప‌నుల‌న్నీ పూర్తిచేయిస్తాన‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఎక్క‌డ ఉప ఎన్నిక జ‌రిగినా ఎన్నిక ముగిసేవ‌ర‌కు అధికార పార్టీ హ‌డావిడి చేయ‌డం స‌హ‌జంగా మారిపోయింద‌ని, అప్ప‌టిక‌ప్పుడు తూతూమంత్రంగా కొన్ని ప‌నులు చేయిస్తున్న‌ప్ప‌టికీ దీర్ఘ‌కాలిక అభివృద్ధి మాత్రం క‌న‌ప‌డ‌ద‌ని ప్ర‌జ‌ల అభిప్రాయంగా ఉంది. అధికార పార్టీ త‌ర‌ఫున క‌నిపిస్తున్న హ‌డావిడి ఒక‌ర‌కంగా ప్ర‌జ‌ల్లో ఈటెల రాజేంద‌ర్‌పై సానుభూతి పెంచేలా ఉందంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి కేసీఆర్ వ్యూహం ఎలా ఉండ‌బోతుందో తెలుసుకోవాలంటే కొద్దికాలం వేచిచూడ‌క త‌ప్ప‌దు..!






పంతం నెగ్గించుకున్న విడదల ర‌జిని...?

తెలంగాణ‌లో ఉప ఎన్నిక వ‌స్తే ముఖ్య‌మంత్రి కేసీఆర్ అక్క‌డ ఎటువంటి వ‌రాలు ప్ర‌క‌టిస్తారో, అభివృద్ధికి ఎన్ని నిధులు విడుద‌ల చేస్తారో గ‌డిచిన చ‌రిత్రే చెబుతోంది. తాజాగా హుజూరాబాద్ కు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఇక్క‌డినుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న ఈటెల రాజేంద‌ర్ భార‌తీయ జ‌న‌తాపార్టీ తీర్థం పుచ్చుకోవ‌డంతో కేసీఆర్ హుజూరాబాద్‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారు.

అశోక్‌ని వదిలేలా లేరుగా...సీటు నుంచి దించేస్తారా?

ఒక మంచిమాట పలకడం వల్ల మనిషికి వేయి ఏనుగుల బలం వస్తుంది. చెడుమాట పలకడం వల్ల మనిషి మనసు నీరసించిపోతుంది. చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు కూడా చక్కని సంగీతానికి, మధుర స్తుతులకు, బుజ్జగించే మాటలకు తలలూపుతూ అనుకూలంగా వ్యవహరిస్తాయని మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెబుతారు.

స‌ర్వోన్న‌త‌మైన వ్య‌క్తిత్వానికి ద‌ర్ప‌ణం.. ప్రియ‌భాష‌ణం!

వాళ్ళని జగన్ నరికించాడా లోకేశూ...?

గంటా రాజీనామా ఏమైంది? పోరాటం కూడా లేదే?

కన్నీరు తెప్పిస్తున్న జిహెచ్ఎంసి వాటర్ బిల్?

మనీ : రైతులకు శుభవార్త తెలిపిన కేంద్రం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>