PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/exams-cancelled-in-india-students-39c3ca8e-d28f-4fd3-a5fe-f3a2310b55e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/exams-cancelled-in-india-students-39c3ca8e-d28f-4fd3-a5fe-f3a2310b55e0-415x250-IndiaHerald.jpg దేశ వ్యాప్తంగా అన్ని బోర్డు పరీక్షలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలయింది. అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో న్యాయవాది మమత శర్మ ఇంటర్ వెన్షన్ అప్లికేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు జులై, ఆగస్టు నెలల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాయని న్యాయవాది తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీట్‌, జెఈఈ, క్లాట్‌ వంటి పరీక్షలు భౌతికంగా హజరుకావడానికే విద్యార్ధులు భయపడుతున్నారని ఆexams{#}Assam;Lawyer;Parents;court;Andhra Pradesh;Mamta Mohandas;Applicationపరీక్షలు రద్దు : సుప్రీంలో మరో పిటిషన్!పరీక్షలు రద్దు : సుప్రీంలో మరో పిటిషన్!exams{#}Assam;Lawyer;Parents;court;Andhra Pradesh;Mamta Mohandas;ApplicationThu, 17 Jun 2021 09:41:00 GMT 

దేశ వ్యాప్తంగా అన్ని బోర్డు పరీక్షలు రద్దు చేయాలని  సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలయింది. అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో న్యాయవాది మమత శర్మ ఇంటర్ వెన్షన్ అప్లికేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు జులై, ఆగస్టు నెలల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాయని న్యాయవాది తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీట్‌, జెఈఈ, క్లాట్‌ వంటి పరీక్షలు భౌతికంగా హజరుకావడానికే విద్యార్ధులు భయపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. 


భౌతికంగా పరీక్షల నిర్వహణపై వేలాది మంది విద్యార్ధుల తల్లిదండ్రులు భయంతో వణికి పోతున్నారని న్యాయవాది మమత ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ 10 వ తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహించి తీరుతామని ప్రకటించిందని, ఇదే తరహాలో పంజాబ్‌, కర్నాటక, అస్సాం రాష్ట్రాలు తేదీలు కూడా ప్రకటించిన విషయాన్ని మమతా శర్మ కోర్టు దృష్టికి తీసుకు వచ్చాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు మినహా.. సిబిఎస్‌ఈ సహా అన్ని తమ పరిధిలో ఉన్న బోర్డు పరీక్షలు రద్దు చేశాయన్న ఆమె అన్ని బోర్డులకు ఒకే నిబంధన ఉండాల్సిన అవసరం ఉందని తన పిటిషన్లో పేర్కొన్నారు. 


అలా చేస్తేనే విద్యార్ధుల మనసుపై ప్రభావం లేకుండా ఉంటుందని న్యాయవాది పేర్కొన్నారు. ఇప్పటికే విచారణ జరుగుతున్న కేసులోనే మమతా శర్మ ఇంటర్ వెన్షన్ అప్లికేషన్ దాఖలు చేశారు. ఇక నేడు ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని.. విద్యార్ధుల ప్రాణాలు నిలబెట్టేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు న్యాయవాది. ఇక ఏపీ విషయానికి వస్తే పదో తరగతి చాలా ముఖ్యం అని అందుకే ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించి తీరతామని చెబుతున్నారు.  




టెన్త్ పరీక్షలు.. ఏపీ అధికారుల ప్లాన్ ఏంటంటే?

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. !

బలపడుతున్న బీజేపీ శత్రుశిబిరం.. వచ్చే ఏడాది పిక్చర్ క్లారిటీ..

మైనర్ బాలికతో టీచర్ ఫేస్ బుక్ ప్రేమ.. చివరికి!

అమెరికా ఫెడరల్‌ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ..?

జగన్ భారీ ప్రాజెక్ట్.. సక్సెస్‌ అయితే ఏపీని కొట్టే వాడే లేడు..!?

టీటీడీ చైర్మన్ పదవీకాలం 4 రోజులే... నెక్స్ట్ ఎవరు ?

జగన్‌కు మళ్లీ జెల్ల కొట్టేసిన లోకేశ్‌..?

బిగ్‌ షాక్‌: ఈనెల 25 వరకూ రఘురామకు జ్యుడిషియల్ రిమాండ్‌..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>