PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp1651524b-dc5e-4b6d-a8e0-0eb24cbc49a7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp1651524b-dc5e-4b6d-a8e0-0eb24cbc49a7-415x250-IndiaHerald.jpgఏపీలో వైసీపీకి 22 మంది లోక్‌సభ ఎంపీల బలం ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు 25కి 25 మంది ఎంపీలని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక జగన్ పిలుపుతో ప్రజలు వైసీపీని 22 చోట్ల గెలిపించారు. ఇక టీడీపీ కేవలం 3 సీట్లకే పరిమితమైంది. అయితే కేంద్రంలో రెండోసారి బీజేపీ మంచి మెజారిటీతో అధికారంలోకి రావడంతో మెడలు వంచడం కష్టమని జగన్ మొదట్లోనే చేతులెత్తేసిన విషయం తెలిసిందే.ysrcp{#}Loksabha;Parliment;TDP;Jagan;MP;YCP;CM;Bharatiya Janata Partyఆ ఎంపీలకు రీప్లేస్ ఉంటుందా?ఆ ఎంపీలకు రీప్లేస్ ఉంటుందా?ysrcp{#}Loksabha;Parliment;TDP;Jagan;MP;YCP;CM;Bharatiya Janata PartyWed, 16 Jun 2021 04:00:00 GMTఏపీలో వైసీపీకి 22 మంది లోక్‌సభ ఎంపీల బలం ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు 25కి 25 మంది ఎంపీలని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక జగన్ పిలుపుతో ప్రజలు వైసీపీని 22 చోట్ల గెలిపించారు. ఇక టీడీపీ కేవలం 3 సీట్లకే పరిమితమైంది.  అయితే కేంద్రంలో రెండోసారి బీజేపీ మంచి మెజారిటీతో అధికారంలోకి రావడంతో మెడలు వంచడం కష్టమని జగన్ మొదట్లోనే చేతులెత్తేసిన విషయం తెలిసిందే.


కేంద్రంతో సఖ్యతతో ఉంటేనే పనులు అవుతాయని గ్రహించి, ఆ విధంగా ముందుకెళుతున్నారు. సరే జగన్ పని జగన్ చేస్తున్నారు. మరి వైసీపీ తరుపున గెలిచిన 22 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? అంటే చెప్పడం కష్టమే. ఈ రెండేళ్లలో ఎంపీలు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో ఎవరికి తెలియదు. కనీసం పార్లమెంట్ నిధులని అయిన ఖర్చు పెడుతున్నారా? అంటే అది చెప్పడం కష్టం.


టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నా సరే, వారు బాగానే రాష్ట్రం కోసం కేంద్రంలో పోరాటం చేస్తున్నారు. కానీ వైసీపీ ఎంపీలు కనీసం నోరు కూడా ఎత్తడం లేదు. అసలు చెప్పాలంటే టీడీపీకి చెందిన ఎంపీలు రాష్ట్ర స్థాయిలో హైలైట్ అయ్యారు గానీ, వైసీపీ ఎంపీలు మాత్రం సొంత పార్లమెంట్ స్థానాల్లోనే హైలైట్ కావడం లేదని తెలుస్తోంది. 22లో చాలామంది కేవలం జగన్ ఇమేజ్‌తోనే గెలిచేశారు. సరిగ్గా ఎంపీలు పేర్లు కూడా తెలియకుండానే ప్రజలు, జగన్‌ని చూసి వైసీపీకి ఓట్లు వేశారని చెప్పొచ్చు.


అయితే ఎన్నికలై రెండేళ్ళు అయిన సరే కొందరు ఎంపీలు, సొంత పార్లమెంట్ స్థానంలో ఉన్న ప్రజలకు సరిగ్గా తెలియదు. ఇక అలాంటి ఎంపీలకు నెక్స్ట్ జగన్ టిక్కెట్ ఇవ్వడం కష్టమే అని తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో పలువురు ఎంపీలని సీఎం జగన్ రీప్లేస్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ కేబినెట్‌లో చోటు ఖాయమైపోయిందా!

మంగ‌ళ‌గిరిలో విజ‌యానికి మూడు సూత్రాలు.. వర్కౌట్ అవ్వాలంటే?

భరత్...ఆ నలుగురు చేత కూడా రాజీనామా చేయిస్తారా?

శివప్రసాద్ అల్లుడుకు చిత్తూరు ఫిక్స్ చేస్తారా?

రైతుల కోసం యుద్ధం మొదలెట్టిన కేసీఆర్.. ఫలిస్తే సూపర్..?

అయిదుగురు ఎంపీలను సస్పెండ్ చేసిన పార్టీ చీఫ్..!

జగన్ మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేయాలని చాలామంది ఎమ్మెల్యేలు చూస్తున్న విషయం తెలిసిందే. మొదటి విడతలో ఛాన్స్ దక్కనివారు, రెండో విడతలో మంత్రి హోదా దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు సైతం జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నారు.

ఏపీలో వైసీపీకి 22 మంది లోక్‌సభ ఎంపీల బలం ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు 25కి 25 మంది ఎంపీలని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక జగన్ పిలుపుతో ప్రజలు వైసీపీని 22 చోట్ల గెలిపించారు. ఇక టీడీపీ కేవలం 3 సీట్లకే పరిమితమైంది. అయితే కేంద్రంలో రెండోసారి బీజేపీ మంచి మెజారిటీతో అధికారంలోకి రావడంతో మెడలు వంచడం కష్టమని జగన్ మొదట్లోనే చేతులెత్తేసిన విషయం తెలిసిందే.

చిత్తూరు పార్లమెంట్ స్థానం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పొచ్చు. ఈ స్థానం నుంచి టీడీపీ 7 సార్లు విజయం సాధించింది. పార్లమెంట్ పరిధిలో చంద్రగిరి, నగరి, గంగాధరనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు ఉంటాయి. అయితే ఇందులో కుప్పం ఉండటం వల్ల ఎక్కువసార్లు చిత్తూరు పార్లమెంట్‌లో టీడీపీ గెలుస్తూ వచ్చింది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>