Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-trivikram8efb22cc-ab99-4fef-9440-5bb13a67c908-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-trivikram8efb22cc-ab99-4fef-9440-5bb13a67c908-415x250-IndiaHerald.jpgసర్కారు వారి పాట తర్వాత మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతుందని తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెకక్కనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. మహేష్, త్రివిక్రం కాంబినేషన్ Mahesh-Trivikram{#}trivikram srinivas;ala venkatapuram lo;Ala Vaikunthapurramloo;Khaleja;Athadu;RRR Movie;Rajamouli;Heroine;Kanna Lakshminarayana;Pooja Hegde;Cinemaమహేష్ తో అల వైకుంఠపురం.. త్రివిక్రం ఏం ఆలోచిస్తున్నాడంటే..!మహేష్ తో అల వైకుంఠపురం.. త్రివిక్రం ఏం ఆలోచిస్తున్నాడంటే..!Mahesh-Trivikram{#}trivikram srinivas;ala venkatapuram lo;Ala Vaikunthapurramloo;Khaleja;Athadu;RRR Movie;Rajamouli;Heroine;Kanna Lakshminarayana;Pooja Hegde;CinemaWed, 16 Jun 2021 23:00:00 GMTసర్కారు వారి పాట తర్వాత మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతుందని తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెకక్కనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. మహేష్, త్రివిక్రం కాంబినేషన్ లో అతడు సినిమా క్లాసిక్ హిట్ అందుకోగా ఖలేజా కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచింది.

అతడు సినిమా హిట్ అవగా.. ఖలేజా మాత్రం ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. త్రివిక్రం ఈసారి మహేష్ కోసం మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథనే ఎంచుకున్నాడని అంటున్నారు. మహేష్ తో అల వైకుంఠపురములో లాంటి ఎమోషనల్ మూవీ ఒకటి ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రం. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం వీరి కాంబోలో మళ్లీ ఖలేజా లాంటి ఎంటర్టైనర్ సినిమానే ఆశిస్తున్నారు.

అతడు, ఖలేజా సినిమాల కలయికగా ఈ హ్యాట్రిక్ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. తప్పకుండా ముందు రెండు సినిమాల కన్నా ఈ హ్యాట్రిక్ సినిమా అంతకుమించి హిట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నరట. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు టాక్. పరశురాం డైరక్షన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఏమాత్రం లేట్ చేయకుండా త్రివిక్రం సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు మహేష్.

సినిమా తర్వాత రాజమౌళితో భారీ సినిమా ప్లాన్ చేశాడు మహేష్. కె.ఎల్ నారాయణన్ నిర్మిస్తున్న ఈ సినిమా బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలను మించి ఉండేలా ఉండాలని కోరుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమా కథ ఇదే అంటూ కొన్ని కథలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే రాజమౌళి మాత్రం మహేష్ తో అదిరిపోయే కథ సిద్ధం చేస్తాడని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ పూర్తి కాగానే ఏమాత్రం లేట్ చేయకుండా మహేష్ తో సినిమా చేస్తాడట రాజమౌళి.





మెగా సెన్సేషన్ మగధీర గురించి ఎంత చెప్పినా తక్కువే .... ??

మహేష్ తో అల వైకుంఠపురం.. త్రివిక్రం ఏం ఆలోచిస్తున్నాడంటే..!

హీరో విశాల్ కి గాయం .... వైరల్ అవుతున్న వీడియో .... !!

ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న భారతీయుడు..!

ఈ డైరక్టర్ ను తక్కువ అంచనా వేయలేం.. హనుమాన్ గురి పెద్దదే..!

'లవ్ స్టోరీ' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!!

అతడితో సహజీవనం చేస్తోన్న జాక్వలిన్ .... ??

ప్రభాస్ నిర్మాతలను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా... ?

"రాధేశ్యామ్" పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసిన కమెడియన్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>