International
oi-Chandrasekhar Rao
బుడాపెస్ట్: ఫుట్‌బాల్ సూపర్ స్టార్, పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డో తెలిసి చేశాడో.. తెలియక చేశాడో గానీ..అతను చాలా క్యాజువల్‌గా చేసిన ఓ చిన్న పని.. మల్టీ బ్రాండెడ్ కోకా కోలా కంపెనీ షేర్లను అథఃపాతాళానికి తొక్కేసింది. కోకాకోలా షేర్లు ఆవిరి అయ్యాయి. తన బ్రాండ్ వేల్యూను కోల్పోయిందా సంస్థ. ఏకంగా నాలుగు బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. భారత కరెన్సీతో పోల్చుకుంటే.. దీని విలువ సుమారు 300 కోట్ల రూపాయలన్నమాట. ఈ స్థాయిలో కోకా కోలా కంపెనీ యాజమాన్యం తన షేర్లను నష్టపోయేలా రొనాల్డో ఏం చేశాడంటే..
రొనాల్డో ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న పోర్చుగల్-హంగేరీ మధ్య బుడాపెస్ట్‌లోని పుస్కర్ ఫెరెన్క్ స్టేడియంలో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సాగింది. ఈ మ్యాచ్‌ను పోర్చుగల్ 3-0తో గెలుచుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆయా జట్లకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఆటగాళ్లు.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడటం ఆనవాయితీగా వస్తోంది. క్రిస్టియానో రొనాల్డో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు అటెండ్ అయ్యాడు. అతను కుర్చీలో కూర్చునేటప్పటికే- ఎదురుగా టేబుల్ మీద రెండు కోకాకోలా బాటిల్స్ ఉన్నాయి.

ఇలాంటి సూపర్ స్టార్ల ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగే సమయంలో మల్టీ బ్రాండ్ కూల్ డ్రింక్ కంపెనీలు, ఎనర్జీ డ్రింక్ తయారీదారులు తమ ఉత్పత్తులను అక్కడ ఉంచుతుంటారు. అది సహజంగా జరిగేదే. ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం కుర్చీ మీద కూర్చున్న వెంటనే రొనాల్డో తన ఎదురుగా ఉన్న రెండు కోకాకోలా బాటిళ్లను తీసి కింద పెట్టేశాడు. వాటి స్థానంలో మంచినీళ్ల బాటిల్‌ను చేత్తో అందుకున్నాడు. అతను చేసిన పని అదొక్కటే. చాలా క్యాజువల్‌గా చేసిన ఆ పని.. కోకాకోలా భారీ నష్టాన్ని మిగిల్చింది.
తన ఎదురుగా ఉన్న మీడియా టేబుల్ మీద ఉన్న కోకాకోలా బాటిళ్లను తీసి పక్కన పెడుతోన్న వీడియో వైరల్‌గా మారింది. ఇది వెలుగులోకి రాగానే కోకాకోలా కంపెనీ షేర్లు ఢామ్మని పడిపోయాయి. ఏకంగా నాలుగు బిలియన్లు ఆవిరి అయిపోయాయి. యూరప్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఒక షేర్ విలువ 56.10 డాలర్లతో ఓపెన్ అయిన కోకాకోలా షేర్ల విలువ.. మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 55.22 వద్ద నిలిచింది.
Cristiano Ronaldo Hates Coca Cola 🤣 , he quickly removed Euro 2020 sponsor Coca-Cola bottles in front of him during his pre-Hungary v Portugal press conference saying “Drink water!” instead. pic.twitter.com/6O5y1emv2B
— ZimViral🔥 (@ZimViral) June 15, 2021
దీని మొత్తం విలువ నాలుగు బిలియన్ డాలర్లు. 242 బిలియన్ల వద్ద ఆరంభమైన కోకాకోలా షేర్ల విలువ 238 డాలర్ల వద్ద ముగిసింది. కోకాకోలాకు తాను వ్యతిరేకినంటూ రోనాల్డో ఇదివరకే ఓ సారి చెప్పుకొన్నాడు కూడా. కోకాకోలా, ఫాంటా వంటి కూల్‌డ్రింక్స్‌తో పాటు చిప్స్ వంటి జంక్ ఫుడ్‌ను తన కుమారుడు తరచూ తీసుకుంటూ ఉంటాడని, ఆ అలవాటును మానుకోవాలంటూ తరచూ చెబుతుంటానని రొనాల్డో ఇదివరకే ఓ సారి స్పష్టం చేశాడు. తాజాగా- ఆ ఉదంతాన్ని గుర్తు చేస్తోన్నారు నెటిజన్లు.
English summary
Coca Cola shares fell drastically after Ronaldo puts the bottles away in the press meet.