PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp2860d9cb-28a4-4562-9d42-7a2f662c7392-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp2860d9cb-28a4-4562-9d42-7a2f662c7392-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజికవర్గం నేతల హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధికారంలో ఉన్నపుడు బాగా సందడి చేసిన కమ్మ నేతలు, అధికారం కోల్పోయాక కాస్త సైలెంట్ అయ్యారు. అలాగే పార్టీని బలోపేతం చేయడంలో వెనుకబడి ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కీలకంగా ఉన్న నరసారావుపేట పార్లమెంట్ పరిధిలో టీడీపీ కమ్మ నేతలది అదే పరిస్తితి.tdp{#}Kamma;Guntur;Parliment;Cycle;TDP;YCP;Sattenapalle;Prathipati Pullarao;Chilakaluripeta;Rayapati Sambasivarao;Narasaraopetaఅక్కడ కమ్మ నేతలు సైకిల్‌ని నిలబెట్టలేకపోతున్నారే!అక్కడ కమ్మ నేతలు సైకిల్‌ని నిలబెట్టలేకపోతున్నారే!tdp{#}Kamma;Guntur;Parliment;Cycle;TDP;YCP;Sattenapalle;Prathipati Pullarao;Chilakaluripeta;Rayapati Sambasivarao;NarasaraopetaWed, 16 Jun 2021 12:01:00 GMTతెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజికవర్గం నేతల హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధికారంలో ఉన్నపుడు బాగా సందడి చేసిన కమ్మ నేతలు, అధికారం కోల్పోయాక కాస్త సైలెంట్ అయ్యారు. అలాగే పార్టీని బలోపేతం చేయడంలో వెనుకబడి ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కీలకంగా ఉన్న నరసారావుపేట పార్లమెంట్ పరిధిలో టీడీపీ కమ్మ నేతలది అదే పరిస్తితి.

గత ఎన్నికల్లో నరసారావుపేట పార్లమెంట్‌లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. ఈ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. సత్తెనపల్లి, వినుకొండ, పెదకూరపాడు, నరసారావుపేట, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడు చోట్ల టీడీపీ ఓడిపోయింది. అలాగే పార్లమెంట్ స్థానంలో టీడీపీ ఓటమి పాలైంది.

అయితే ఇందులో మాచర్ల, నరసారావుపేట అసెంబ్లీ స్థానాలు మినహా మిగిలిన ఐదు స్థానాల్లో కమ్మ నేతలే పోటీ చేశారు. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండలో జి‌వి ఆంజనేయులు, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్‌లు పోటీ చేసి ఓడిపోయారు. అటు పార్లమెంట్ స్థానంలో రాయపాటి సాంబశివరావు పోటీ చేసి ఓడిపోయారు.

ఇక ఇప్పుడు కూడా ఆ నియోజకవర్గాల బాధ్యతలు వారే చూసుకుంటున్నారు. కాకపోతే కోడెల మరణంతో సత్తెనపల్లి బాధ్యతలు ఆయన కుమారుడు కోడెల శివరాం చూస్తున్నారు. ఏది ఎలా చూసిన ఈ పార్లమెంట్‌లో కమ్మ నేతలే టీడీపీని నడిపిస్తున్నారు. పైగా నరసారావుపేట పార్లమెంట్ అధ్యక్షుడుగా జి‌వి ఆంజనేయులు ఉన్నారు. అయినా సరే పార్లమెంట్ పరిధిలో పూర్తిగా సైకిల్ బలం పుంజుకోలేదు.

ఇటీవల పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఈ పార్లమెంట్ పరిధిలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక్కడ పూర్తిగా అధికార వైసీపీ డామినేషన్ బాగా ఉంది. అయితే టీడీపీ కమ్మ నేతలు ఎక్కువ సమయం పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడితే, నెక్స్ట్ ఎన్నికల్లోపు సైకిల్‌ని నిలబెట్టొచ్చు. లేదంటే మళ్ళీ ఫ్యాన్ హవానే ఉంటుంది.



తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజికవర్గం నేతల హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధికారంలో ఉన్నపుడు బాగా సందడి చేసిన కమ్మ నేతలు, అధికారం కోల్పోయాక కాస్త సైలెంట్ అయ్యారు. అలాగే పార్టీని బలోపేతం చేయడంలో వెనుకబడి ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కీలకంగా ఉన్న నరసారావుపేట పార్లమెంట్ పరిధిలో టీడీపీ కమ్మ నేతలది అదే పరిస్తితి.

ఏపీలో అధికార వైసీపీ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా వైసీపీ బలపడిపోయింది. అయితే ఇంత బలంగా ఉన్న వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో కాస్త వీక్‌గా ఉందని తెలుస్తోంది. అది కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట వైసీపీ ఇంకా పుంజుకోలేకపోతుందని తెలుస్తోంది. అందులోనూ పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వైసీపీకి అసలు ఛాన్స్ ఇవ్వడం లేదట.

అక్కడ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీకి ఛాన్స్ ఇవ్వడం లేదా?

సీఎం జ‌గ‌న్ సేమ్ చంద్ర‌బాబు స్టైల్లోనే ?

అవినీతి నేతల పునరావాస కేంద్రంగా బీజేపీ..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ కేబినెట్‌లో చోటు ఖాయమైపోయిందా!

ఆ ఎంపీలకు రీప్లేస్ ఉంటుందా?

మంగ‌ళ‌గిరిలో విజ‌యానికి మూడు సూత్రాలు.. వర్కౌట్ అవ్వాలంటే?

భరత్...ఆ నలుగురు చేత కూడా రాజీనామా చేయిస్తారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>