BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag8eb0d8f8-f190-4c58-9517-ef8688a82a25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag8eb0d8f8-f190-4c58-9517-ef8688a82a25-415x250-IndiaHerald.jpgకాళేశ్వ‌రం ప్రాజెక్టుతో సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం మొత్తం కోన‌సీమ‌లా మార‌బోతోందంటూ తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కెటీఆర్ అన్నారు. హైద‌రాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న‌ట్లే సిరిసిల్ల‌లో కూడా గ‌జం రూ.ల‌క్ష ప‌లుకుతోంద‌న్నారు. మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డితో క‌లిసి కేటీఆర్ సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం రాచ‌ర్ల‌బొప్పాపూర్‌లో నిర్మించిన డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను ప్రారంభించారు. ల‌బ్ధిదారులెవ‌రూ పైసా లంచం ఇచ్చే ప‌రిస్థితి లేకుండా ఒక‌టికి రెండుసార్లు పూర్తిస్థాయిలో విచారించి ఇళ్లు కేటాయించామ‌ని, కోట్ల‌రూపాయ‌ల విలువైన భూtag{#}KCR;KTR;Sircilla;Santosham;Telangana;Ministerకాళేశ్వ‌రంతో కోన‌సీమ‌లా సిరిసిల్ల‌?కాళేశ్వ‌రంతో కోన‌సీమ‌లా సిరిసిల్ల‌?tag{#}KCR;KTR;Sircilla;Santosham;Telangana;MinisterWed, 16 Jun 2021 15:20:05 GMTకాళేశ్వ‌రం ప్రాజెక్టుతో సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం మొత్తం కోన‌సీమ‌లా మార‌బోతోందంటూ తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కెటీఆర్ అన్నారు. హైద‌రాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న‌ట్లే సిరిసిల్ల‌లో కూడా గ‌జం రూ.ల‌క్ష ప‌లుకుతోంద‌న్నారు. మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డితో క‌లిసి కేటీఆర్ సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం రాచ‌ర్ల‌బొప్పాపూర్‌లో నిర్మించిన డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను ప్రారంభించారు. ల‌బ్ధిదారులెవ‌రూ పైసా లంచం ఇచ్చే ప‌రిస్థితి లేకుండా ఒక‌టికి రెండుసార్లు పూర్తిస్థాయిలో విచారించి ఇళ్లు కేటాయించామ‌ని, కోట్ల‌రూపాయ‌ల విలువైన భూముల్లో ఇళ్లు నిర్మించి ఇస్తున్న ఘ‌ట‌న ఒక్క కేసీఆర్‌దేన‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ కింద ప్ర‌తి ఇంటికి ఒక న‌ల్లాను ఏర్పాటు చేశామ‌న్నారు. త్వ‌ర‌లోనే నాలుగు ల‌క్ష‌ల‌కు పైగా రేష‌న్‌కార్డులు ఇవ్వ‌బోతున్నామ‌ని, పేద‌వారి ముఖంలో సంతోషం చూడ‌ట‌మే కేసీఆర్ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో టీఆర్ ఎస్ నేత‌లు, అధికారులు పాల్గొన్నారు.



ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొవిడ్ మ‌హ‌మ్మారి రోజురోజుకూ త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 6,617 కరోనా కేసులు నమోద‌వ‌గా, 57 మంది మృతిచెందారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,26,751కు చేరింది. అలాగే కరోనాతో మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 12,109గా ఉంది. ప్ర‌స్తుతానికి రాష్ట్రంలో 71,466 యాక్టివ్ కేసులుండ‌గా, 24 గంటల్లో 10,228 మంది మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు.

ఏపీలో క‌రోనా త‌గ్గుముఖం?

"భారతీయులకు, కుక్కలకు ఇక్కడ ప్రవేశం లేదు" అని.. చిట్టగాంగ్ పట్టణంలోని ఒక బ్రిటీష్ క్లబ్ ముందు బోర్డ్ పెట్టారు. ఎంత దుర్మార్గం.. ఎంత అహంకారం. బ్రిటీష్ వాళ్ళ ఈ దుర్మార్గాన్ని చూసి ఓ అమ్మాయి మనసు రగిలింది. ఆమె గుండెలో ఆగ్రహం మండింది. ఆమె కళ్ళలో అగ్ని జ్వాలలు రేగాయి. ఎలాగైనా ఆ బోర్డుని బద్దలుకొట్టి తెల్లవాళ్లకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంది. ఆమె పేరు ప్రీతిలత.

స్వ‌రాజ్య వీరుల వీరోచితానికి నిద‌ర్శ‌నం.. ప్రీతిల‌త‌

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అనుస‌రిస్తోన్న విధానాల‌వ‌ల్లే దేశంలో టీకాల కొర‌త ఏర్ప‌డింద‌ని కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ మండిప‌డ్డారు. కొవిడ్‌వ్యాప్తితో దెబ్బ‌తిన్న మోడీ ప్ర‌తిష్ట‌ను కాపాడ‌టానికి ప్ర‌భుత్వ వ‌ర్గాలు చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌న్నీ దేశంలో వైర‌స్ వ్యాప్తికే దోహ‌ద‌ప‌డుతున్నాయ‌ని ఆరోపించారు.

వైర‌స్ వ్యాప్తిని పెంచుతోన్న కేంద్రం?

మంత్రి చెప్ప‌డంవ‌ల్లే తాము పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌ల‌క‌లేక‌పోయామ‌ని, క్ష‌మించాల‌ని సింహాచ‌లం దేవ‌స్థానం అధికారులు కేంద్ర మాజీ మంత్రి, దేవ‌స్థ‌నం ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ అశోక్‌గ‌జ‌ప‌తిరాజుకు విన్న‌వించారు. ఈరోజు అశోక్‌గ‌జ‌ప‌తిరాజు కుటుంబ స‌మేతంగా సింహాద్రి అప్ప‌న్న‌ను ద‌ర్శించుకున్నారు.

మంత్రి చెప్పార‌ని స్వాగ‌తం ప‌ల‌క‌లేదు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో మ‌రోసారి ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. ఉంగుటూరు గ్రామానికి చెందిన మాజీ స‌ర్పంచ్ ఇటీవ‌లే అనారోగ్యానికి గురై కోలుకున్నారు. ఆయ‌న్ని ప‌రామ‌ర్శించేందుకు తెలుగుదేశం పార్టీ పెద‌కూర‌పాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీ‌ధ‌ర్ వెళ్లారు. శ్రీ‌ధ‌ర్ రాక‌ను నిర‌సిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆయ‌న కారును అడ్డుకున్నారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>