MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trend-satire-movies-30bf0226-68f1-4f50-932c-a2ad77236d71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trend-satire-movies-30bf0226-68f1-4f50-932c-a2ad77236d71-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన అత్యద్భుత చిత్ర రాజాలు బాహుబలి, బాహుబలి 2. ఆరేళ్ళ క్రితం విడుదలైన బాహుబలి మూవీ అప్పట్లో అతి పెద్ద విజయం అందుకున్న మూవీ గా గొప్ప రికార్డు ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్, అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అనే రెండు రకాల పాత్రల్లో కనిపించారు. రెండు పాత్రల్లోనూ ఎంతో ఆకట్టుకునేలా అద్భుతంగా నటించడం తోపాటు సినిమా కోసం శారీరకంగా కూడా ఎంతో కష్టపడ్డారు హీరో ప్రభాస్. tollywood-dual-role-movies{#}Prabhas;prasad devineni;rana daggubati;tamannaah bhatia;Tollywood;K K Senthil Kumar;Dangal;Bahubali;anoushka;m m keeravani;Rajamouli;Success;Audience;Hero;Cinema;Indiaబాహుబలి సృష్టించిన సంచలనాలు మరచిపోగలమా .... ??బాహుబలి సృష్టించిన సంచలనాలు మరచిపోగలమా .... ??tollywood-dual-role-movies{#}Prabhas;prasad devineni;rana daggubati;tamannaah bhatia;Tollywood;K K Senthil Kumar;Dangal;Bahubali;anoushka;m m keeravani;Rajamouli;Success;Audience;Hero;Cinema;IndiaWed, 16 Jun 2021 13:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన అత్యద్భుత చిత్ర రాజాలు బాహుబలి, బాహుబలి 2. ఆరేళ్ళ క్రితం విడుదలైన బాహుబలి మూవీ అప్పట్లో అతి పెద్ద విజయం అందుకున్న మూవీ గా గొప్ప రికార్డు ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్, అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అనే రెండు రకాల పాత్రల్లో కనిపించారు. రెండు పాత్రల కోసం శారీరకంగా ఎంతో కష్టపడ్డారు హీరో ప్రభాస్.
అనుష్క శెట్టి, తమన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించగా, కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి సమకూర్చారు. ఆర్కా మీడియా,వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాలను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. ఇక మొదటి భాగం ముగింపులో కట్టప్ప బాహుబలిని చంపడం చూపించిన రాజమౌళి, అసలు కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపవలసి వచ్చింది అనే విషయమై అమితాసక్తిని ఆడియన్స్ లో రేకెత్తించారు. దానితో విడుదల తరువాత కేవలం తెలుగులోనే కాక అన్ని భాషల్లోనూ ఈ మూవీ సీక్వెల్ బాహుబలి 2 పై అందరిలోనూ విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కాగా విడుదల తరువాత పార్ట్ 1 ని మించేలా బాహుబలి 2 మరింత గొప్ప సక్సెస్ సాధించి టాలీవుడ్ ఖ్యాతిని మరింతగా పెంచింది.
భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అత్యద్భుతమైన యాక్షన్ సీన్స్, ఆకట్టుకునే టేకింగ్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు ముఖ్యంగా రెండు పాత్రల్లో ప్రభాస్ కనబరిచిన యాక్షన్, ఫైట్స్, పలికిన డైలాగ్స్ నిజంగా అత్యద్భుతం. బాహుబలి 2 మూవీ ఏకంగా రూ.1900 కోట్లవరకు కలెక్షన్ దక్కించుకోవడం విశేషం. ఇక ఈ సినిమాలో కట్టప్పగా యాక్ట్ చేసిన సత్యరాజ్, శివగామి గా నటించిన రమ్యకృష్ణ, భల్లాలదేవుడి గా కనిపించిన రానా దగ్గుబాటి ఇలా దాదాపుగా బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాల్లో యాక్ట్ చేసిన నటీనటులందరికీ కూడా దేశవిదేశాల్లోని ఆడియన్స్ లో మంచి పేరు లభించింది. ఇక ఇప్పటికీ కూడా అనేక కేంద్రాల్లో ఈ సినిమాల రికార్డ్స్ పదిలంగా ఉండడం విశేషం. మరొక విషయం ఏమిటంటే అటు నార్త్ లో కేవలం దంగల్ తప్ప మరొక సినిమా ఏది కూడా బాహుబలి రికార్డ్స్ ని దాటలేకపోయింది. మొత్తంగా ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషించిన బాహుబలి సినిమాలు టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి అని చెప్పకతప్పదు...... !!  



మక్కల్ సెల్వన్ నిర్మాతగా ఉప్పెన హీరో మూవీ ?

ఓ పద్ధతి,ప్రణాళిక లేకపోతే టాలీవుడ్ కి భారీ నష్టమే!!

ఇండియా దూసుకుపోతుంది.. ఇప్పుడు టాప్-4 లో?

దిల్ రాజు నిర్మిస్తున్న 10 సినిమాలు ఇవే

బాహుబలి సృష్టించిన సంచలనాలు మరచిపోగలమా .... ?? పూర్తి వివరాల కోసం హెరాల్డ్ సినిమాలు చూడండి.

సింహా గా గర్జించిన బాలయ్య .... !! పూర్తి వివరాల కోసం హెరాల్డ్ సినిమాలు చూడండి.

ఉదయ్​ కిరణ్ ‘చిత్రం.. ది పిక్చర్' @ 21ఏళ్లు ..!

సింహా గా గర్జించిన బాలయ్య .... !!

ట్విట్టర్ మీద కొత్త కేసు.. వారి మీద కూడా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>