MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/angali769cf640-4477-4efc-a6b5-3f4433d51ec1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/angali769cf640-4477-4efc-a6b5-3f4433d51ec1-415x250-IndiaHerald.jpgసినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడం అంటే మాములు విషయం కాదు.మనల్ని మనం వెండితెరపై చూసుకుంటూ, మన నటనకు ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే కలిగే ఆనందం అంతా ఇంత కాదు కదా. ఇలానే ఎన్నో కలలతో మన తెలుగమ్మాయి అంజలి కూడా సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.తాను నటించే సినిమాలలో పాత్రకు ప్రాణం పోసినట్టుగా నటిస్తుంది. పాత్ర ఏదయినా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో ఒదిగిపోయేది. తెలుగు హీరోయిన్స్ ను పెద్దగా పట్టించుకోని సినీ ఇండస్ట్రీ మన అంజలికి పిలిచి మరి అవకాశం ఇచ్చారు. అంజలి కట్టు, బొట్టు మాట తీరు చుస్తే ఎవరికన్నాangali{#}anil ravipudi;anjali;jeeva;Sarrainodu;Telugammayi;East;Anandam;Film Industry;Manam;District;bhavana;Girl;Tamil;Venkatesh;Allu Arjun;kalyan;News;Telugu;Director;Tollywood;Heroine;Audience;Cinemaటాలివుడ్ లో రాజోలు పిల్ల రచ్చ మాములుగా లేదుగా....?టాలివుడ్ లో రాజోలు పిల్ల రచ్చ మాములుగా లేదుగా....?angali{#}anil ravipudi;anjali;jeeva;Sarrainodu;Telugammayi;East;Anandam;Film Industry;Manam;District;bhavana;Girl;Tamil;Venkatesh;Allu Arjun;kalyan;News;Telugu;Director;Tollywood;Heroine;Audience;CinemaWed, 16 Jun 2021 10:00:00 GMTసినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడం అంటే మాములు విషయం కాదు.మనల్ని మనం వెండితెరపై చూసుకుంటూ, మన నటనకు ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే కలిగే ఆనందం అంతా ఇంత కాదు కదా. ఇలానే ఎన్నో కలలతో మన తెలుగమ్మాయి అంజలి కూడా సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.తాను నటించే సినిమాలలో పాత్రకు ప్రాణం పోసినట్టుగా నటిస్తుంది. పాత్ర ఏదయినా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో ఒదిగిపోయేది. తెలుగు హీరోయిన్స్ ను పెద్దగా పట్టించుకోని సినీ ఇండస్ట్రీ మన అంజలికి పిలిచి మరి అవకాశం ఇచ్చారు. అంజలి కట్టు, బొట్టు మాట తీరు చుస్తే ఎవరికన్నా మన ఇంటి ఆడపిల్ల అనే భావన కలుగుతుంది. అలాంటి మన తెలుగు ముద్దుగుమ్మ అంజలి పుట్టినరోజు ఈరోజు. ఆమె పుట్టినరోజును పురస్కరించుకొని అంజలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అంజలి మన తెలుగు అమ్మాయి. పుట్టింది తూర్పు గోదావరి జిల్లా రాజోలులో. సినిమాల మీద ఉన్న ఆసక్తితో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఉండేది. ఆ తరువాత మొదటగా జీవా సరసన తమిళంలో ఒక సినిమాలో నటించింది. ఆ సినిమాని తెలుగులో  'డేర్' అనే పేరుతో రిలీజ్ చేసారు.  


 
ఆ తర్వాత 2006లో 'ఫొటో' సినిమాతో స్వప్నగా అందరికీ పరిచయమైంది.మళ్ళీ 'ప్రేమలేఖ రాశా'.. సినిమాలో సంధ్యగా కనిపించినా కూడా ఈ రెండు సినిమాలు అంజలికి తగిన గుర్తింపు తీసుకురాలేదు. కానీ ఆ తర్వాత నటించిన 'షాపింగ్‌మాల్' సినిమాలో అంజలి తన నట విశ్వరూపం చూపించింది.ఈ సినిమాలో అంజలి అందంగా కనపడకపోయిన ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.షాపింగ్ మాల్ సినిమాలో అంజలి నటన అమోఘం అనే చెప్పాలి. ఈ సినిమాలో అంజలి నటన చూసిన డైరెక్టర్ మురుగదాస్ 'జర్నీ'లో హీరోయిన్ గా చేసే అవకాశం ఇచ్చారు.



2011లో విడుదలైన 'జర్నీ' సినిమాలో అంజలి పాత్రకు 100% మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో నర్సు పాత్రలో నటించి మెప్పించింది.తన మాట తీరు, చక్కటి హావభావాలు మన అందరి మదిలో ఎప్పటికి గుర్తు ఉండి పోతాయి. ఈ సినిమా తరువాత మళ్ళీ వెండితెరపై 2013లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో సీతగా నటించింది. విక్టరీ వెంకటేష్ కి జోడిగా నటించింది. చక్కటి చీర కట్టులో మనింట్లో అమ్మాయిలా కనిపించి మురిపించింది అంజలి.ఈ సినిమాలో  అమాయకంగా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంది . తర్వాత 'బలుపు' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా రవితేజతో ఆడిపాడింది. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.


అలాగే అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే.అలాగే  సింగం-2 తమిళ వెర్షన్‌లో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది అంజలి. తరువాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా తమిళంలో కూడా అనేక సినిమాల్లో నటిస్తూ ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా అందుకుంది. మళ్ళీ చాలాకాలం తర్వాత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది.రీసెంట్ గా హిట్ అయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటించి మళ్ళీ "దట్ ఈజ్ అంజలి" అని  నిరూపించుకుంది.వకీల్ సాబ్ సినిమాలో అంజలి నటనకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు.  ప్రస్తుతం తెలుగులో ఆనందభైరవి అనే సినిమాలో అవకాశాన్ని అందుకుంది. ఇక తమిళం, కన్నడ, మలయాళం భాషలో కొన్ని సినిమాలకి ఓకే చూపినట్లు తెలుస్తుంది.అలాగే తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కనున్న ఎఫ్ 3 లో కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.







షాకిచ్చిన హీరోయిన్.. ఆరుబయట బట్టలు లేకుండా మడ్ బాత్?

హలో బ్రదర్.. సినిమాలో నాగార్జున కి డూప్ గా నటించిన హీరో ఎవరో తెలుసా..?

పవన్ సినిమాకు డీజే ఛాయలు !

కథ లేదు కాకరకాయ్ లేదు.. ముద్దు సీన్లు.. బెడ్ రూం సీన్లు చాలు..!

అంజలి బర్త్ డే స్పెషల్ స్టోరీ మీ కోసం.

డ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ నటి?

అబ్బా.. ఆ సీన్ తోనే సినిమా సూపర్ హిట్.. అవునా..

ఖైదీ నెంబర్ 150 : నిజంగా సరైన సినిమాతోనే బాస్ ఈజ్ బ్యాక్..!!

తెర మారింది.. కథలు మారాయి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>