MoviesChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan19b19290-caea-4487-a8e3-0e4c5f60483f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan19b19290-caea-4487-a8e3-0e4c5f60483f-415x250-IndiaHerald.jpgకరోనా సమయంలో బాగా ఇబ్బంది పడిన రంగం ఏదైనా ఉంది అంటే అది సినీరంగం అనే చెప్పాలి. ప్రభుత్వానికి ఈ రంగం నుంచి అనేక రకాలుగా ఆదాయం వస్తున్నా సరే అత్యవసరమైన విషయం కాకపోవడంతో ఇప్పటికీ షూటింగ్ లు మొదలయ్యే విషయం మొదలు థియేటర్లను ఓపెన్ చేసే విషయం దాకా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే జూలై ఒకటో తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్ లు ఓపెన్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ విషయంలో ఎలాంటి అంచనాలు, అవకాశాలు కనిపించకపోవడంతో తాజాగా జగన్ తో సినీ పెద్దjagan{#}Andhra Pradesh;Telangana;cinema theater;Jagan;CBN;Coronavirus;Newsజగన్ తో సినీ పెద్దల భేటీ.. అదే మెయిన్ అజెండా?జగన్ తో సినీ పెద్దల భేటీ.. అదే మెయిన్ అజెండా?jagan{#}Andhra Pradesh;Telangana;cinema theater;Jagan;CBN;Coronavirus;NewsWed, 16 Jun 2021 13:03:00 GMTకరోనా సమయంలో బాగా ఇబ్బంది పడిన రంగం ఏదైనా ఉంది అంటే అది సినీరంగం అనే చెప్పాలి. ప్రభుత్వానికి ఈ రంగం నుంచి అనేక రకాలుగా ఆదాయం వస్తున్నా సరే అత్యవసరమైన విషయం కాకపోవడంతో ఇప్పటికీ షూటింగ్ లు మొదలయ్యే విషయం మొదలు థియేటర్లను ఓపెన్ చేసే విషయం దాకా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే జూలై ఒకటో తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్ లు ఓపెన్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. 

కానీ ఆంధ్ర ప్రదేశ్ విషయంలో ఎలాంటి అంచనాలు, అవకాశాలు కనిపించకపోవడంతో తాజాగా జగన్ తో సినీ పెద్దలు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కేవలం థియేటర్ల ఓపెనింగ్ విషయం మాత్రమే కాక మరిన్ని అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటుంటే అనేక రాయితీలు ప్రకటించారు. ప్రస్తుత సమయంలో ఆ రాయితీలు ప్రోత్సాహకాలు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దగా సీరియస్ గా ఉన్న దాఖలాలు కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలోనే ఆ రాయితీలు ఇవ్వడమే కాక కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరిన్ని రాయితీలు ఇవ్వమని ఈ భేటీలో జగన్ ను కోరే అవకాశం కనిపిస్తోంది. అంతేకాక విశాఖలో ఒక అతిపెద్ద స్టూడియో ఏర్పాటుకు సంబంధించి కూడా సినీ పెద్దలు జగన్ మద్దతు కోరే అవకాశం కనిపిస్తోంది. ఇవి కాక వకీల్ సాబ్ విషయంలో టిక్కెట్ల జిఓ జారీ చేయడం ఇప్పుడు సినీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ టికెట్లు జీవోను వెనక్కి తీసుకోమని కూడా ఈ భేటీలో కోరే అవకాశం ఉందని అంటున్నారు.



వెల్లంపల్లి తగ్గట్లేదుగా...అవి బయటపెట్టేది ఎప్పుడు?

ఓ పద్ధతి,ప్రణాళిక లేకపోతే టాలీవుడ్ కి భారీ నష్టమే!!

నితిన్ స్టార్ డైరెక్టర్ లను కూడా నమ్మట్లేదా!!

గాలితో నడిచే కారు.. మైలేజ్ మాత్రం ఫీక్స్..

దారుణం: ముచ్చటైన కుటుంబం.. చివరకు ఇలా!

శుభకార్యాలపై కరోనా పంజా ?

ఏపీ రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. గ‌తంలో అధికారంలో ఉన్న చంద్ర‌బాబు, మార్పు తెస్తాను.. అంటూ.. ఒక్క ఛాన్స్‌తో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌ల వ్య‌వ‌హార శైలి ఒకే విధంగా ఉంద‌ని .. రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదంతా ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ ఢిల్లీలో ప‌ర్య‌టించిన త‌ర్వాత వ‌స్తున్న విశ్లేష‌ణ‌లు కావ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఏ రాష్ట్ర సీఎం కూడా ఇంత‌గా .. అంటే గ‌తంలో చంద్ర‌బాబు, ఇప్పుడు జ‌గ‌న్ చేసిన‌న్ని ప‌ర్య‌ట‌న‌లు ఢిల్లీకి చేయ‌లేదు. కేంద్ర పెద్ద‌ల చుట్టూ ఇన్నిసార్లు ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌లేదు.

సీఎం జ‌గ‌న్ సేమ్ చంద్ర‌బాబు స్టైల్లోనే ?

పవన్ సినిమాకు డీజే ఛాయలు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>