Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/david1c5be313-3fbe-4712-878f-3c079fbb748a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/david1c5be313-3fbe-4712-878f-3c079fbb748a-415x250-IndiaHerald.jpgడేవిడ్ వార్నర్ ఒక విదేశీ క్రికెటర్ అయినప్పటికీ అటు ఇండియాలో ఎంతోమంది అభిమానులున్నారు. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నప్పటికీ ఇండియా అభిమానుల నుంచి కూడా సపోర్ట్ లభిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఐపీఎల్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల నుంచి అయితే డేవిడ్ వార్నర్ కి ఎంత సపోర్టు లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డేవిడ్ వార్నర్ తెలుగు ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ వచ్చాడు. ఎలాంటి స్టార్ ఆటగాళ్లు లేకDavid{#}Cricket;Australia;Posters;House;Hyderabad;Indian;media;bollywood;Telugu;Indiaఇండియా నా రెండో ఇల్లు.. డేవిడ్ వార్నర్ తెలుగు పోస్ట్?ఇండియా నా రెండో ఇల్లు.. డేవిడ్ వార్నర్ తెలుగు పోస్ట్?David{#}Cricket;Australia;Posters;House;Hyderabad;Indian;media;bollywood;Telugu;IndiaWed, 16 Jun 2021 18:50:00 GMTడేవిడ్ వార్నర్ ఒక విదేశీ క్రికెటర్ అయినప్పటికీ అటు ఇండియాలో ఎంతోమంది అభిమానులున్నారు.  డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నప్పటికీ ఇండియా అభిమానుల నుంచి కూడా సపోర్ట్ లభిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఐపీఎల్.  ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల నుంచి అయితే డేవిడ్ వార్నర్ కి ఎంత సపోర్టు లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డేవిడ్ వార్నర్ తెలుగు ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ వచ్చాడు. ఎలాంటి స్టార్ ఆటగాళ్లు లేకుండా పసికూనల మొదలైన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు డేవిడ్ వార్నర్.



 దీంతో ఇక తెలుగు ప్రజలందరూ వార్నర్ ని డేవిడ్ బాయ్ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. ఇక ఆ తర్వాత గత ఏడాది లాక్డౌన్ సమయంలో  టిక్ టాక్ అనే ఎంటర్టైన్మెంట్ యాప్ ద్వారా తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు డేవిడ్ వార్నర్.  టిక్ టాక్ యాప్ ద్వారా తెలుగు హీరోల సినిమాల్లోని పాటలకు డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేసి అదరగొట్టాడు. కేవలం తెలుగు హీరోలు మాత్రమే కాదు బాలీవుడ్ హీరోల సినిమాల పాటలకు కూడా డాన్స్ చేసాడు. ఇలా టిక్ టాక్ ద్వారా  భారత క్రికెట్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు డేవిడ్ వార్నర్.



 ఇక ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నప్పటికీ ఇండియా పై తనకున్న ప్రేమను ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తుంటాడు. ఇటీవల మరోసారి భారత్ పై తన ప్రేమను చాటుకున్నాడు డేవిడ్ వార్నర్. తన రెండో ఇల్లు ఇండియా అంటూ తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేశాడు. ఇక భారతదేశంలో తనకు నచ్చిన ప్రదేశం హైద్రాబాద్ అంటూ తెలిపాడు. అయితే ఇదంతా తెలుగులోనే చెప్పడం గమనార్హం. ఇక అంతే కాకుండా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కొన్ని పోస్టర్ లను కూడా ఈ పోస్ట్ కి జత చేశాడు డేవిడ్ వార్నర్. ఈ పోస్ట్ కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అయిపోతుంది.



రాం చరణ్ బాలనటుడిగా చేశాడు.. కాని సినిమాలో సీన్స్ కట్ చేశారు.. ఏంటా కథ..?

రఘుబాబు తమ్ముడు కూడా టాలీవుడ్ హీరో అని మీకు తెలుసా.. ?

మెలోడీ చక్రవర్తిని పక్కా మాస్ చేసిందెవరు... ?

దేవరకొండకి తప్పట్లేదు.. ఓటిటి లోనే సినిమా?

పెరుగుతున్న సైబర్ నేరాలు.. సీపీ అంజనీ కుమార్ ఏం చెప్పారో తెలుసా?

అప్పుడు తేజు.. ఇప్పుడు చైతు.. వర్కౌట్ అయ్యేనా.!!

అమితాబ్ పై పూరి కామెంట్స్...

నాని భార్య అంజనా కు టాలీవుడ్ లో ఎవరికి లేని బాక్గ్రౌండ్ ఉంది

దూడల సీరంతో కొవాగ్జిన్‌ టీకా... షాకింగ్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>