LifeStyleSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/dogs-amazing-factsf557b3b4-68bf-4d5f-82ef-8174f7acae60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/dogs-amazing-factsf557b3b4-68bf-4d5f-82ef-8174f7acae60-415x250-IndiaHerald.jpgమానవులకు ఎప్పటినుంచో మంచి స్నేహితులుగా కుక్కలు మెలుగుతున్నాయి. మనతోపాటే శతాబ్దాలుగా నివసిస్తున్న ఈ విశ్వాస పాత్రమైన జంతువుల గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఆర్టికల్ లో శునకాల గురించి ఎవరికీ తెలియని 5 ఆసక్తికర విషయాలు ఏంటో తెలుసుకుందాం. 1. కుక్కల ముక్కు తడిగా ఉంటుంది. ప్రతి కుక్కకి ముక్కుపై చిన్న చిన్న నీటి బిందువులు కనిపిస్తుంటాయి. ఈ నీటి బిందువులను వాసన పసిగట్టడానికి కుక్కలు ఉపయోగించుకునే ఒక ప్రత్యేకమైన శ్లేషమని జంతు శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. వారి చెప్పినట్టుగానే ఈ తడి ముక్కు dogs amazing facts{#}Dogs;Aqua;Titanic;Shakti;Murder.;Parugu;Chirutha;Tigerశునకాల గురించి 5 ఆసక్తికర విషయాలు మీకోసం..!శునకాల గురించి 5 ఆసక్తికర విషయాలు మీకోసం..!dogs amazing facts{#}Dogs;Aqua;Titanic;Shakti;Murder.;Parugu;Chirutha;TigerWed, 16 Jun 2021 17:00:00 GMT
1. కుక్కల ముక్కు తడిగా ఉంటుంది.

ప్రతి కుక్కకి ముక్కుపై చిన్న చిన్న నీటి బిందువులు కనిపిస్తుంటాయి. ఈ నీటి బిందువులను వాసన పసిగట్టడానికి కుక్కలు ఉపయోగించుకునే ఒక ప్రత్యేకమైన శ్లేషమని జంతు శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. వారి చెప్పినట్టుగానే ఈ తడి ముక్కు కుక్కలకు సువాసన రసాయనాలు గ్రహించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. దూరంలో ఉన్న సువాసన రసాయనాలు కూడా శునకాల ముక్కుపైనున్న తడిపై చేరతాయి. అప్పుడు కుక్క తన తడి ముక్కుని నాలుకతో నాకి చూసి ఆ సువాసన ఏంటో కనిపెడుతుంది. అరకిలోమీటరు దూరంలోనున్న వంటకాల గుమగుమల వాసనలు కూడా కుక్క ముక్కుపై చేరతాయి. అప్పుడు కుక్కలు వాసన ఎటువైపు నుంచి వస్తుందో ఈజీగా కనిపెడతాయి. ఈ ప్రత్యేకమైన వాసన శక్తితోనే శునకాలు భారీ ఎత్తున వంటకాలు చేసే ఫంక్షన్ హాల్స్ వద్దకు సులభంగా చేరుకుంటాయి.

2. న్యూఫౌండ్లాండ్స్ జాతి కుక్కలు అసలైన రక్షకులు.

న్యూఫౌండ్లాండ్స్ అనే జాతి కుక్కలు తమ యజమానులను సంరక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఈ జాతి కుక్కల శరీరం ఒక వాటర్ రెసిస్టెంట్ కోట్ గా పనిచేస్తుంది. బాతు కాళ్ళ మాదిరి ఈ శునకాల కాళ్ల వేళ్ల మధ్య కూడా చర్మం ఉంటుంది. ఈ ప్రత్యేకమైన కాళ్లతో అవి నీళ్లలో శరవేగంగా ఈదగలవు. నిజానికి పూర్వకాలంలో మత్స్యకారులు ఈ కుక్కలను తమకు అసిస్టెంట్స్ గా పెంచుకునేవారు. ఈ కుక్కలు ఎవరైనా నీళ్ళల్లో మునిగిపోతుంటే వారిని రక్షించేందుకు రంగంలోకి దిగి వారిని కాపాడేవి. అయితే ఇప్పటికీ ఈ జాతి కుక్కలు తమ యజమానులు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుంటే వారిని రక్షించాలని నీళ్లలోకి దూకుతుంటాయి.

3. టైటానిక్ ప్రమాద ఘటనలో బతికిన మూడు కుక్కలు.

టైటానిక్ విరిగిపోయి మునిగిపోవడం వల్ల ఎంతో మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ టైటానిక్ షిప్ లోకి కొందరు ధనవంతులు తమ కుక్కలను కూడా ఎక్కించారు. ఐతే దురదృష్టవశాత్తు ప్రమాదం జరగడంతో కుక్కలన్నీ చనిపోయాయి కానీ మూడు మాత్రం బతికాయి. ఆ మూడు కుక్కలను వారి యజమానులు తమతోపాటు రహస్యంగా లైఫ్ బోట్స్ లో తీసుకొచ్చారట.

4. సూపర్ డాగ్.. బ్లడ్‌హౌండ్

బ్లడ్‌హౌండ్ డాగ్స్ కి అత్యంత శక్తివంతమైన వాసన గ్రహించే శక్తి ఉంటుంది. కొన్ని న్యాయస్థానాలు బ్లడ్‌హౌండ్ శునకాల వాసన ని సాక్ష్యాలుగా పరిగణిస్తాయంటే.. అవి ఎంత ఖచ్చితంగా వాసన పసిగడతాయో అర్థం చేసుకోవచ్చు. వీటి అద్భుతమైన శక్తి గురించి ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒక వ్యక్తి హత్య చేసి.. సంఘటన స్థలం నుంచి 210 కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడైనా సరే దాక్కున్నాడు అనుకోండి. అలాగే అతను ఒక రహస్య మార్గం గుండా పారిపోయి 12 రోజులు అవుతుంది అనుకోండి. ఆ నేపథ్యంలో ఈ బ్లడ్‌హౌండ్ డాగ్స్ ని నేరస్తుడిని పట్టుకునేందుకు రంగంలోకి దింపితే.. అవి 12 రోజుల క్రితం నేరస్తుడు వెళ్ళిన మార్గాన్ని తమ వాసన శక్తి తో పసిగట్టగలవు. అలాగే 210 కిలోమీటర్ల మేర నిందితుడు ఏ మూలన నక్కినా అతడిని అత్యంత సులభంగా ఇవి గుర్తించగలవు.


5. పరుగు పందెంలో చిరుత పులి ని సైతం ఓడించగల గ్రేహౌండ్ డాగ్.

చిరుత పులి ని మించి ఏ జంతువు కూడా వేగంగా పరిగెత్తలేదని అంటున్నారు. కానీ లాంగ్ డిస్టెన్స్ లో ఎలాంటి శక్తివంతమైన చిరుతపులినైనా గ్రేహౌండ్ జాతి కుక్కలు ఓడించగలవు. గంటకు 57 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో 11 కిలోమీటర్ల దూరం ఆగకుండా పరిగెత్తగల గ్రేహౌండ్ జాతి కుక్కలకి ఈ భూప్రపంచంలో మరేతర జంతువు కూడా పోటీ ఇవ్వలేదేమో. చిరుత పులులు 200 నుంచి 300 గజాల దూరం వరకు అత్యంత వేగంగా పరిగెడతాయి కాని ఆ తర్వాత వాటి పరుగెత్తే వేగము గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల లాంగ్ డిస్టెన్స్ లో గ్రేహౌండ్ డాగ్స్ దే పై చేయి అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.


రాం చరణ్ బాలనటుడిగా చేశాడు.. కాని సినిమాలో సీన్స్ కట్ చేశారు.. ఏంటా కథ..?

కుక్కలపై అమెరికా నిషేధం.. ఇక నో ఎంట్రీ?

శునకాల గురించి 5 ఆసక్తికర విషయాలు మీకోసం..! పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ లైఫ్ స్టైల్ కేటగిరీలో చూడండి.

ఆ సంచలన కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు?

షాకిచ్చిన హీరోయిన్.. ఆరుబయట బట్టలు లేకుండా మడ్ బాత్?

ఈ బియ్యం తింటే.. ఇక మీరు అవుతారు 'ఐరన్‌' మేన్..!?

గంగాదేవిని ఇలా పూజిస్తే మీ పాపాలన్నీ తీరిపోతాయి ?

వైరల్ వీడియో.. కుక్కతో క్యాచెస్ ప్రాక్టీస్ చేయిస్తున్న రవి శాస్త్రి..

మాకు భద్రత కల్పించండి : వివేకా కూతురు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>