MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-dual-role-movies-a0bb4e87-5042-4077-87bd-80af992fc63a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-dual-role-movies-a0bb4e87-5042-4077-87bd-80af992fc63a-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం మరియు కం బ్యాక్ సినిమా గా తెరకెక్కిన చిత్రం ఖైదీ నెంబర్ 150. రాజకీయాల్లో నుంచి తప్పుకున్న తర్వాత ఆయన చేస్తున్న ఈ సినిమా తో ఓ రకంగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు అని చెప్పొచ్చు. తన కం బ్యాక్ చిత్రం బాగుండాలనీ, మునుపటిలా ప్రేక్షకులు అలరింపబడాలని చెప్పి చాలా కథలు విని మరి ఈ తమిళ సినిమా రీమేక్ ఎంచుకున్నారు. మాస్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో విజయ్ హీరోగా కత్తి అనే పేరుతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది. tollywood-dual-role-movies {#}sai madhav burra;Donga;Thief;paruchuri brothers;Joseph Vijay;Konidela Production;Mass;devi sri prasad;Industry;Katthi;Tamil;Remake;Pawan Kalyan;Chitram;Darsakudu;Director;Chiranjeevi;kajal aggarwal;Audience;Cinemaఖైదీ నెంబర్ 150 : నిజంగా సరైన సినిమాతోనే బాస్ ఈజ్ బ్యాక్..!!ఖైదీ నెంబర్ 150 : నిజంగా సరైన సినిమాతోనే బాస్ ఈజ్ బ్యాక్..!!tollywood-dual-role-movies {#}sai madhav burra;Donga;Thief;paruchuri brothers;Joseph Vijay;Konidela Production;Mass;devi sri prasad;Industry;Katthi;Tamil;Remake;Pawan Kalyan;Chitram;Darsakudu;Director;Chiranjeevi;kajal aggarwal;Audience;CinemaWed, 16 Jun 2021 09:01:16 GMTమెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం మరియు కం బ్యాక్ సినిమా గా తెరకెక్కిన చిత్రం ఖైదీ నెంబర్ 150. రాజకీయాల్లో నుంచి తప్పుకున్న తర్వాత ఆయన చేస్తున్న ఈ సినిమా తో ఓ రకంగా సెకండ్  ఇన్నింగ్స్  మొదలుపెట్టారు అని చెప్పొచ్చు. తన కం బ్యాక్ చిత్రం బాగుండాలనీ, మునుపటిలా ప్రేక్షకులు అలరింపబడాలని చెప్పి చాలా కథలు విని మరి ఈ తమిళ సినిమా రీమేక్ ఎంచుకున్నారు. మాస్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో విజయ్ హీరోగా కత్తి అనే పేరుతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది. 

దాదాపు తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత తిరిగి సినీ రంగంలోకి చిరంజీవి ప్రవేశిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ద్వారానే మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కూడా పరిచయమయ్యారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. తొలిరోజు 50 కోట్ల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా రెండు రోజుల్లోనే వంద కోట్ల మార్కు చేరుకుంది. మొత్తంగా 164 కోట్ల వసూళ్లు సాధించి ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది. 

కేవలం 50 కోట్ల రూపాయల తోనే తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల లాభంతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ కథనం, సాయి మాధవ్ బుర్రా డైలాగులు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం తోడై బాస్ కి మరువలేని హిట్ ఇచ్చాయి. రైతుల కోసం పోరాటం చేసే వ్యక్తిగా చిరంజీవి మంచి నటన కనబరిచారు. ఇంకొక పాత్రలో దొంగ గా తనదైన స్టైల్ లో నటించారు. డ్యూయల్ రోల్ లో చిరంజీవి మరొకసారి నటించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.



అబ్బా.. ఆ సీన్ తోనే సినిమా సూపర్ హిట్.. అవునా..

లాక్ డౌన్: ఆ సిటీలో లక్ష ఉద్యోగాలకు గండి... ప్రభుత్వం ఆదుకుంటుందా ?

తెర మారింది.. కథలు మారాయి..!

శ్రీకాంత్ కు బాలకృష్ణ స్వీట్ వార్నింగ్ !

నగ్న పాత్రలో నటించేందుకు రెడీ అయిన మరో హీరోయిన్?

మహాసముద్రం సినిమాకు సిద్దార్థ పారితోషికం ఎంతో తెలుసా..?

సినిమా రంగమైనా, రాజకీయాలయినా పవన్ కల్యాణ్ చుట్టూ లెక్కలేనన్ని పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ఆయన పొలిటికల్ కెరీర్ గురించి, వ్యగ్తిగత విషయాల గురించి ఎప్పుడు ఏ వార్త ఎక్కడ వచ్చినా సెస్సేషన్ కాక మానదు. ఇటీవల కాలంలో పవన్ యాక్టివిటీ కాస్త తగ్గడంతో మరోసారి ఆయనపై సరికొత్త రూపంలో ఫేక్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. మోదీ కేబినెట్ లోకి పవన్ ని తీసుకుంటున్నారని, ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని దాని సారాంశం.

మన పవనే కదా.. వేసెయ్ ఫేక్ న్యూస్..

ఊహని మొదట చూసి అలా అనుకున్న శ్రీకాంత్.. ప్రేమించి ఎలా పెళ్లాడాడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>