SmaranaGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/tag6bf66537-134e-49dd-8e9d-9a4710ac7f52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/tag6bf66537-134e-49dd-8e9d-9a4710ac7f52-415x250-IndiaHerald.jpg"భారతీయులకు, కుక్కలకు ఇక్కడ ప్రవేశం లేదు" అని.. చిట్టగాంగ్ పట్టణంలోని ఒక బ్రిటీష్ క్లబ్ ముందు బోర్డ్ పెట్టారు. ఎంత దుర్మార్గం.. ఎంత అహంకారం. బ్రిటీష్ వాళ్ళ ఈ దుర్మార్గాన్ని చూసి ఓ అమ్మాయి మనసు రగిలింది. ఆమె గుండెలో ఆగ్రహం మండింది. ఆమె కళ్ళలో అగ్ని జ్వాలలు రేగాయి. ఎలాగైనా ఆ బోర్డుని బద్దలుకొట్టి తెల్లవాళ్లకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంది. ఆమె పేరు ప్రీతిలత.tag{#}prithy;Yuva;Ishtam;Girl;septemberస్వ‌రాజ్య వీరుల వీరోచితానికి నిద‌ర్శ‌నం.. ప్రీతిల‌త‌స్వ‌రాజ్య వీరుల వీరోచితానికి నిద‌ర్శ‌నం.. ప్రీతిల‌త‌tag{#}prithy;Yuva;Ishtam;Girl;septemberWed, 16 Jun 2021 17:08:15 GMT
"భారతీయులకు, కుక్కలకు ఇక్కడ ప్రవేశం లేదు" అని.. చిట్టగాంగ్ పట్టణంలోని ఒక బ్రిటీష్ క్లబ్ ముందు బోర్డ్ పెట్టారు. ఎంత దుర్మార్గం.. ఎంత అహంకారం. బ్రిటీష్ వాళ్ళ ఈ దుర్మార్గాన్ని చూసి ఓ అమ్మాయి మనసు రగిలింది. ఆమె గుండెలో ఆగ్రహం మండింది. ఆమె కళ్ళలో అగ్ని జ్వాలలు రేగాయి. ఎలాగైనా ఆ బోర్డుని బద్దలుకొట్టి తెల్లవాళ్లకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంది. ఆమె పేరు ప్రీతిలత.

అర్థ‌రాత్రి క్ల‌బ్‌పై దాడి
కలకత్తా యూనివర్సిటీలో బి.ఏ.ఫస్ట్ క్లాసులో పాస్ అయిన మేధావి ప్రీతిల‌త‌. స్వరాజ్య వీరుడు సూర్యసేన్ స‌హకారంతో 1932 సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 10-45 గంట‌ల‌కు బ్రిటీష్ క్లబ్ పైన దాడి చేసింది. ఒక్క దెబ్బకే బోర్డ్ బద్దలైంది. క్లబ్ లోకి ధైర్యంగా అడుగుపెట్టి కాల్చడం మొదలు పెట్టారు ప్రీతిలత బృందం. యువ వీరుల్ని చూసి భయంతో గజగజలాడారు బ్రిటీష్ అధికారులు. అప్పటికే చాలా మంది గాయపడ్డారు. ఇంతలో ఒక మూలనుంచి ప్రీతిలతని గురి చూసి కాల్చాడు ఓ తెల్లవాడు. బులెట్ ప్రీతిల‌త భుజంలోకి దూసుకు పోయింది. రక్తం ధార కట్టింది. ఆ చేతిని అలాగే నొక్కి పెట్టి ప్రీతి ముందుకు సాగింది. ఆమె ధైర్యానికి అధికారులు వణికిపోయారు.

భ‌ర‌త‌మాత‌కు జై అంటూ ప్రాణాలు విడిచి..
క్రమంగా బులెట్ గాయం నుంచి రక్తస్రావం ఎక్కువైంది. ప్రాణాలతో ఆంగ్లేయులకు దొరకడం ప్రీతిలతకు  ఇష్టం లేదు. అందుకే.. తనతో తెచ్చుకొన్న విషం మింగి.. భరతమాతకు జై అంటూ ప్రాణాలు విడిచింది. ప్రీతిలతకు అప్పటికి కేవలం ఇరవై ఒక్క సంవ‌త్స‌రాల వ‌య‌సు మాత్రమే. ఆ తర్వాత భారతీయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే అటువంటి బోర్డులు మరెక్కడా పెట్టే ధైర్యం చేయలేకపోయారు తెల్లవారు. అదీ ప్రీతిలత అంటే. ఇలాంటి ప్రీతిల‌త‌లు ఎంద‌రో తెల్ల‌వారికి వ్య‌తిరేకంగా పోరాడారు. కొన్ని వెలుగులోకి వ‌చ్చాయి.. మ‌రికొన్ని వెలుగులోకి రాలేదు. అంద‌రి ఆశ‌యం ఒక్క‌టే.. అంద‌రి ల‌క్ష్యం ఒక్క‌టే.. నా దేశాన్ని స్వ‌తంత్ర దేశంగా చూడాల‌ని.. అర్థ‌రాత్రి స్వాతంత్ర్యం పొందేనాటికి కొంద‌రు వీరులు అమ‌రుల‌య్యారు. కానీ వారంతా ప్ర‌జ‌ల గుండెల్లో జీవించేవున్నారు.



జులై ఒక‌టో తేదీ నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఏపీ ఇంట‌ర్‌బోర్డు కార్య‌ద‌ర్శి ఉమ‌ర్‌జ‌లీల్ చెప్పారు. ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు అయిన త‌ర్వాత వాటి ఫ‌లితాలు స‌త్వ‌ర‌మే విడుద‌ల‌య్యేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు. ప్ర‌భుత్వ‌రంగ సంస్థ సీజీజీ ద్వారా ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించాల‌నే యోచ‌న ఉంద‌ని, వారంలోప‌లే ఫ‌లితాలు వెల్ల‌డించేలా స‌న్నాహాలు చేస్తున్నామ‌న్నారు

జులై 1 నుంచి ఇంట‌ర్ త‌ర‌గ‌తులు?

ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒక‌టైన ఫ్రాంక్లిన్ టెంపుల్ట‌న్ గొప్ప‌త‌నం ఏ1 ఫ్రాడ్ రెడ్డికేం తెలుస్తుంద‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శించారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీల్లో ఒక‌టైన ఆ కంపెనీ సీఈవోల‌ను బ‌తిమాలి చంద్ర‌బాబునాయుడు ఏపీకి తెచ్చార‌ని, ఇప్పుడేమో ఏ1, ఏ2 ఫ్రాడ్ రెడ్ల జే ట్యాక్స్ చెల్లించ‌లేక ఫ్రాంక్లిన్ ఏపీకి బైబై చెప్పేసింద‌న్నారు.

ఏ1, ఏ2కి కంపెనీల గొప్ప‌త‌నం ఏం తెలుసు?

విజ‌య‌వాడ ఈఎస్ఐ డైరెక్ట‌రేట్‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై రెండురోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాలంటూ డైరెక్ట‌ర్‌ను కార్మిక‌శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం ఆదేశించారు. మందుల ల‌భ్య‌త‌పై త‌క్ష‌ణ‌మే దృష్టిసారించాలంటూ అధికారుల‌కు సూచించారు. కొటేష‌న్ లేకుండా మాస్క్‌లు, శానిటైజ‌ర్లు నేరుగా సూప‌ర్‌బ‌జార్ నుంచి కొనుగోలు చేసినవారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ్లు రావ‌డంతో మంత్రి ఈ స‌మావేశం నిర్వ‌హించారు.

అవ‌క‌త‌వ‌క‌ల‌పై రెండురోజుల్లో నివేదిక‌?

నాని భార్య అంజనా కు టాలీవుడ్ లో ఎవరికి లేని బాక్గ్రౌండ్ ఉంది

షార్ట్ ఫిల్మ్ టూ ఫీచర్ ఫిల్మ్.. ఇక్కడ హిట్టు పడితే అక్కడ ఛాన్స్..!

దూడల సీరంతో కొవాగ్జిన్‌ టీకా... షాకింగ్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>