MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kangana-ranaut0c6e1b17-086e-4deb-9181-09b6b288a1cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kangana-ranaut0c6e1b17-086e-4deb-9181-09b6b288a1cd-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నార‌నౌత్‌కు ఎంత క్రేజ్ ఉందో ఆమెపై అన్నే వివాదాలు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఎన్నో విష‌యాల్లో ఆమెపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. చాలా వ‌ర‌కు ఆమెకు షాక్‌లు త‌గిలాయి. ఇక ఇప్పుడు కూడా మళ్లీ కొత్త చిక్కులొచ్చా ప‌డ్డాయి ఆమెకు. కంగ‌నా కు చెందిన పాస్ పోర్ట్ విషయంలో కోర్టు లో తాజాగా చుక్కెదురైంది. కంగనా పాస్ పోర్ట్ రెన్యూవల్ చేసుకోవ‌డానికి పోలీసుల నుంచి ఎదురైన స‌మ‌స్య‌లు ఇప్పట్లో ఆమెకు తీరేలా క‌నిపించ ట్లేదు. ఆమె ఇప్పుడు దేశ ద్రోహం కేసును ఎదుర్కొంటున్న స‌మ‌యంలో ఇలా పాస్ పోర్ట్ రెన్kangana ranaut{#}Kangana Ranaut;Mumbai;court;BEAUTY;Traffic police;Cinemaబాలీవుడ్ క్వీన్ కి హై కోర్ట్ షాక్...?బాలీవుడ్ క్వీన్ కి హై కోర్ట్ షాక్...?kangana ranaut{#}Kangana Ranaut;Mumbai;court;BEAUTY;Traffic police;CinemaWed, 16 Jun 2021 16:33:13 GMTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నార‌నౌత్‌కు ఎంత క్రేజ్ ఉందో ఆమెపై అన్నే వివాదాలు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఎన్నో విష‌యాల్లో ఆమెపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. చాలా వ‌ర‌కు ఆమెకు షాక్‌లు త‌గిలాయి. ఇక ఇప్పుడు కూడా మళ్లీ కొత్త చిక్కులొచ్చా ప‌డ్డాయి ఆమెకు. కంగ‌నా కు చెందిన పాస్ పోర్ట్ విషయంలో కోర్టు లో తాజాగా చుక్కెదురైంది. కంగనా పాస్ పోర్ట్ రెన్యూవల్ చేసుకోవ‌డానికి పోలీసుల నుంచి ఎదురైన స‌మ‌స్య‌లు ఇప్పట్లో ఆమెకు తీరేలా క‌నిపించ ట్లేదు. ఆమె ఇప్పుడు దేశ ద్రోహం కేసును ఎదుర్కొంటున్న స‌మ‌యంలో ఇలా పాస్ పోర్ట్ రెన్యూవల్ లో కొన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తడంతో వాటిని ఎదుర్కొంటుంది ఈ బ్యూటీ క్వీన్.

ప్ర‌స్తుతం ఈ విష‌యంలో ఆమె ముంబై హైకోర్టును ఆశ్రయించింది. కాగా కోర్టు ఈ కేసును ఈ నెల 25కు వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే కంగనా ర‌నౌత్ ఈ నెలలో షూటింగ్ కోసం హంగేరిలోని బుడాపెస్ట్‌కు బ‌య‌లుదేరి వెళ్లేందుకు ప్లాన్ వేసుకుంది. 15వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ దాకా మూవీ యూనిట్ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. కానీ కంగ‌నా పాస్‌ పోర్టు గడువు సెప్టెంబర్‌ 15న అయిపోతోంది. దీంతో ఈ క్ర‌మంలో పాస్ పోర్ట్ రెన్యూవల్ చేయాలనీ అధికారులను రీసెంట్‌గా కంగనా ర‌నౌత్ కోరింది.

అయితే ఇప్పుడు కంగనా పై పోలీస్ కేసు ఉన్నందున తాము పాస్‌పోర్టును రెన్యూవల్ చేయలేమని అధికారులు స్ప‌ష్టంగా చెప్పారు. ఇందుకు కార‌ణం ఏంటంటే ఎవరికైనా పాస్ట్ పోర్ట్ రెన్యువల్‌ చేయాలంటే పోలీస్‌ వెరిఫికేషన్ క‌చ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ మధ్య బాంద్రా పోలీస్‌ స్టషన్‌లో ఆమెపై దేశద్రోహం కేసు నమోదు కావ‌డంతో ఈ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ కేసు నేపథ్యంలో కంగనా రనౌత్ పాస్ పోర్ట్ రెన్యూవల్ చేయడనికి అటు అధికారులు సైతం పూర్తి అభ్యంతరం వ్య‌క్తం చేస్తున్నారు.



"రాధేశ్యామ్" పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసిన కమెడియన్ ?

రాం చరణ్ బాలనటుడిగా చేశాడు.. కాని సినిమాలో సీన్స్ కట్ చేశారు.. ఏంటా కథ..?

రఘుబాబు తమ్ముడు కూడా టాలీవుడ్ హీరో అని మీకు తెలుసా.. ?

మెలోడీ చక్రవర్తిని పక్కా మాస్ చేసిందెవరు... ?

దేవరకొండకి తప్పట్లేదు.. ఓటిటి లోనే సినిమా?

అప్పుడు తేజు.. ఇప్పుడు చైతు.. వర్కౌట్ అయ్యేనా.!!

ఆ విషయంలో 'అల్లు అర్జున్' ని ఫాలో అవుతున్న 'రవితేజ'..?

షార్ట్ ఫిల్మ్ టూ ఫీచర్ ఫిల్మ్.. ఇక్కడ హిట్టు పడితే అక్కడ ఛాన్స్..!

వైసీపీ అరాచకాలకు ఇది మరో నిదర్శనం: నారా లోకేష్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>