PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-today-islamophobia65f31760-557b-4a8d-9726-4e910013c602-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-today-islamophobia65f31760-557b-4a8d-9726-4e910013c602-415x250-IndiaHerald.jpgజాతీయ న్యూస్ ఛానల్స్ పై మతపరమైన ఆరోపణలు ఎన్నో వెల్లువెత్తుతుంటాయి. భారతదేశంలో నాయకులు చేస్తున్న మత రాజకీయాలకు వంత పాడుతూ ప్రముఖ న్యూస్ మీడియా సంస్థలు ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాయని చాలా కాలం నుంచి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొన్ని న్యూస్ మీడియా సంస్థలకు ఇస్లామోఫోబియా ఉందని కొందరు నిరాధారమైన వ్యాఖ్యలు సోషల్ మీడియా మీడియా వేదికగా చేస్తుంటారు. ఇండియన్ మీడియా ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందని.. ముస్లింల పట్ల పక్షపాత వైఖరిని కనబరుస్తోందని గతంలో చాలామంది మindia today islamophobia{#}high courtఇండియాటుడేపై సంచలన ఆరోపణలు.. హైకోర్టు ఏం తేల్చిందంటే..?ఇండియాటుడేపై సంచలన ఆరోపణలు.. హైకోర్టు ఏం తేల్చిందంటే..?india today islamophobia{#}high courtTue, 15 Jun 2021 12:00:00 GMTమీడియా సంస్థలు ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాయని చాలా కాలం నుంచి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొన్ని న్యూస్ మీడియా సంస్థలకు ఇస్లామోఫోబియా ఉందని కొందరు నిరాధారమైన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా చేస్తుంటారు.


ఇండియన్ మీడియా ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందని.. ముస్లింల పట్ల పక్షపాత వైఖరిని కనబరుస్తోందని గతంలో చాలామంది ముస్లిములు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇండియన్ ముస్లిం డిజిటల్ మీడియా "ది కాగ్నేట్".. ప్రముఖ జాతీయ న్యూస్ మీడియా సంస్థ అయిన ఇండియా టుడే పై సంచలన ఆరోపణలు చేసింది. ఇండియా టుడే రిపోర్టింగ్ ఇస్లామోఫోబియా కి అద్దం పడుతోందని "ది కాగ్నేట్" సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు షేర్ చేసింది. రంజాన్ రోజున ముస్లిం ప్రజల సమూహాల కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని ఇండియాటుడే రిపోర్ట్ చేసిందని కానీ కుంభమేళా కారణంగా కరోనా వ్యాప్తి పెరిగిపోయిందని ఇండియా టుడే రిపోర్ట్ చేయలేదని.. దీన్నిబట్టి ఇండియాటుడే ముస్లింల పట్ల పక్షపాత భావంతో న్యూస్ పబ్లిష్ చేస్తోందని "ది కాగ్నేట్" సంచలన ఆరోపణలు చేసింది.



అంతేకాకుండా ఇండియాటుడే వార్తాకథనాల యొక్క శీర్షికలు సేకరించి.. వాటితో ఒక ఇన్ఫో గ్రాఫిక్ ఫోటో తయారుచేసి.. ఇండియాటుడే ఇస్లామోఫోబిక్ అని ది కాగ్నేట్ వరుసగా పోస్టులు షేర్ చేసింది. దీంతో ఇండియా టుడే కన్నెర్ర చేసింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి..ది కాగ్నేట్ డిజిటల్ మీడియా 'తప్పుడు', 'నిరాధారమైన', 'అపఖ్యాతికరమైన' ఆరోపణలు చేస్తోందని ఒక పరువు నష్టం దావా కేసు వేసింది. అయితే తమపై ఇండియాటుడే కేస్ వేయటం ఒక పనికిమాలిన చర్య అని.. మీడియా పక్షపాత వైఖరిని బట్టబయలు చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తే తమపై కేసులు పెడుతున్నారని ది కాగ్నేట్ ఎడిటర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.



అయితే ఇండియాటుడే ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని ఢిల్లీ హైకోర్టు లాయర్ జస్టిస్ సంజీవ్ నరులా విచారణ చేపట్టారు. అయితే ఆయన.. ఇండియా టుడే ముస్లిం, హిందూ పండుగలకు సంబంధించి ఒకే రకంగా న్యూస్ రిపోర్ట్ చేసిందని వెల్లడించారు. అలాగే అబద్ధాలతో అందరినీ పక్కదారి పట్టిస్తున్న 'ది కాగ్నేట్' పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వెళ్లగక్కింది. వెంటనే ఇండియా టుడే పై చేసిన ఆరోపణలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల లోపు ఈ పని పూర్తి చేయాలని లేకపోతే పరువు నష్టం దావా చెల్లించాల్సి వస్తుందని ఢిల్లీ హై కోర్టు హెచ్చరించింది.



ఇండియాటుడేపై సంచలన ఆరోపణలు.. హైకోర్టు ఏం తేల్చిందంటే..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ పాలిటిక్స్ కేటగిరీలో చూడండి.

జీహెచ్ఎంసీలో కరోనా మరణాల్లో గందరగోళం.. అసలు ఏది నిజం?

ఆ రెండు ఏక‌మై జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాట‌తీస్తాయ్ - చంద్ర‌బాబు

గోవుల ప్రాణాలు ఎవరు తెస్తారు?

అరాచక పాల‌న‌పై న్యాయం గెలిచింది - నారా లోకేష్‌

ఏపీ ప్ర‌భుత్వానికి షాక్ ..మ‌ళ్లీ అశోక్ గ‌జ‌ప‌తిరాజుకే బాధ్య‌త‌లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>