BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/pulivendula956874db-4766-4358-acfb-a4cdfc1d2739-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/pulivendula956874db-4766-4358-acfb-a4cdfc1d2739-415x250-IndiaHerald.jpgపులివెందుల మండ‌లం న‌ల్ల‌పురెడ్డిప‌ల్లిలో కాల్పులు జ‌రిగిన సంఘ‌ట‌నా స్థ‌లాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజ‌న్ సంద‌ర్శించారు. ఈ కాల్పుల్లో మృతిచెందిన పార్థ‌సార‌ధిరెడ్డి, శివ‌ప్ర‌సాద‌రెడ్డి మ‌ధ్య ఆస్తి త‌గాదాలుండ‌టంవ‌ల్లే ఈ కాల్పులు జ‌రిగాయ‌ని ఎస్పీ వెల్ల‌డించారు. పాత క‌క్ష‌ల నేప‌థ్యంలో శివ‌ప్ర‌సాద‌రెడ్డి తుపాకీతో పార్థ‌సార‌ధిరెడ్డిపై కాల్పులు జ‌ర‌ప‌గా అత‌ను అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. అనంత‌రం ప్ర‌సాద‌రెడ్డి కూడా తుపాకీతో త‌న‌ను తాను కాల్చుకున్నాడు. బంధువులు ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మృతిచpulivendula{#}Pulivendula;District;policeపులివెందుల కాల్పుల‌పై పోలీసుల ద‌ర్యాప్తుపులివెందుల కాల్పుల‌పై పోలీసుల ద‌ర్యాప్తుpulivendula{#}Pulivendula;District;policeTue, 15 Jun 2021 15:50:00 GMT
పులివెందుల మండ‌లం న‌ల్ల‌పురెడ్డిప‌ల్లిలో కాల్పులు జ‌రిగిన సంఘ‌ట‌నా స్థ‌లాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజ‌న్ సంద‌ర్శించారు. ఈ కాల్పుల్లో మృతిచెందిన పార్థ‌సార‌ధిరెడ్డి, శివ‌ప్ర‌సాద‌రెడ్డి మ‌ధ్య ఆస్తి త‌గాదాలుండ‌టంవ‌ల్లే ఈ కాల్పులు జ‌రిగాయ‌ని ఎస్పీ వెల్ల‌డించారు. పాత క‌క్ష‌ల నేప‌థ్యంలో శివ‌ప్ర‌సాద‌రెడ్డి తుపాకీతో పార్థ‌సార‌ధిరెడ్డిపై కాల్పులు జ‌ర‌ప‌గా అత‌ను అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. అనంత‌రం ప్ర‌సాద‌రెడ్డి కూడా తుపాకీతో త‌న‌ను తాను కాల్చుకున్నాడు. బంధువులు ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మృతిచెందాడు. వైసీపీకి చెందిన ఈ రెండు కుటుంబాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగి కాల్పుల‌కు దారితీసిన‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. న‌ల్ల‌పురెడ్డిప‌ల్లిలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిస్థితిని ఎస్పీ స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించారు. కాల్పుల‌కు దారితీయ‌డానికి కార‌ణ‌మైన ప‌రిస్థితుల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌సాద‌రెడ్డికి అస‌లు తుపాకీ ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? ఎక్క‌డ కొనుగోలు చేశారు? ఎవ‌రెవ‌రు స‌హ‌క‌రించారు? అనే కోణంలో ఈ ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.





లేడీ ఎస్సై ఆత్మ‌హత్యాయ‌త్నం కేసులో కీల‌క ప‌రిణామం...?

పోలీసుల అదుపులో హీరోయిన్‌?

బాలుడికి 24x7 పోలీసుల సెక్యూరిటీ.. ఎందుకంటే?

మాకు భద్రత కల్పించండి : వివేకా కూతురు

ఇదేం దరిద్రం : టెక్ వ్యవహారంలో లైంగిక ఆరోపణలు!

కొన‌క‌ళ్ల కునుకు తీస్తున్నారా... కృష్ణా టీడీపీ దారెటు ?

జ‌డ్డి రామ‌కృష్ణ‌కు బెయిల్ మంజూరు

పాల్వంచ‌లో భారీ అగ్నిప్ర‌మాదం

బాలయ్య కు నో చెప్పిన శృతి.. వారిపై ఫోకస్ పెట్టిన డైరెక్టర్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>