Bengaluru: ఐటీ హబ్ లో ఎంట్రీకి కొత్త రూల్స్, తేడా వస్తే అక్కడికే, అన్ లాక్ దెబ్బతో ఫోలో అంటూ !

 లాక్ డౌన్ దెబ్బతో బెంగళూరు ఖాళీ

లాక్ డౌన్ దెబ్బతో బెంగళూరు ఖాళీ

కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో తెలుగు రాష్ట్రాల కంటే ముందే కర్ణాటకలో గత నెలలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. బెంగళూరు నగరంలో అనేక పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు, కంపెనీ ఉద్యోగులు, ట్యాక్సీ డ్రైవర్లు, గార్మెంట్స్ ఉద్యోగులు, వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు తదితర పనులు చేస్తున్న వారు లాక్ డౌన్ దెబ్బతో ఎవరి ఊర్లకు వారు వెళ్లిపోయారు.

 ఛలో బెంగళూరు

ఛలో బెంగళూరు

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సొంతఊర్లకు వెళ్లిపోయిన వాళ్లు ఇప్పుడు అన్ లాక్ తో ఫోలో అంటూ బెంగళూరులోకి ఎంట్రీ ఇస్తున్నారు. కర్ణాటకలోని ఇతర జిల్లాల నుంచినే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రాల నుంచి వలస కార్మికులు, ఉద్యోగులు కర్ణాటకలోకి, బెంగళూరు నగరంలోకి లక్షల మంది వస్తున్నారు.

 కరోనా పాజిటివ్ భయం ?

కరోనా పాజిటివ్ భయం ?

కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న వాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరులోకి వచ్చే అవకాశం ఉందని, అందు వలన కరోనా వైరస్ మళ్లీ వ్యాపించే అవకాశం ఉందని బీబీఎంపీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు నగరం నలుమూలల నుంచి సిటీలోకి ఎంట్రీ కాకముందే అందరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని బీబీఎంపీ అధికారులు మొబైల్ టెస్టింగ్ బృందాలను ఏర్పాటు చేశారు.

 బెంగళూరు నలుమూలల సేమ్ సీన్

బెంగళూరు నలుమూలల సేమ్ సీన్

ఆంధ్రప్రదేశ్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారికి హోసకోటే శివార్లలో, తుమకూరు రోడ్డు, బెంగళూరు-బళ్లారి రోడ్డులో, హోసూరు రోడ్డు, మాగడి రోడ్లలో బెంగళూరు సిటీలోకి వస్తున్న వారందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బెంగళూరు సిటీ నలుమూలల్లో బీబీఎంపీ ఆరోగ్య శాఖకు చెందిన సిబ్బంది ఐటీ హబ్ లోకి ఎంట్రీ ఇస్తున్న అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

హోమ్ ఐసోలేషన్ కాదు..... కరోనా క్వారంటైన్

హోమ్ ఐసోలేషన్ కాదు….. కరోనా క్వారంటైన్

ఎవరికైనా కరోనా పాజిటివ్ అని వెలుగు చూస్తే వాళ్లను హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించడం కంటే వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని బీబీఎంపీ అధికారులు డిసైడ్ అయ్యారు. ఈ దెబ్బతో కరోనా పాజిటివ్ వచ్చినా హోమ్ ఐస్ లేషన్ లో ఉండాలనుకునే వాళ్లకు ఇప్పుడు బీబీఎంపీ అధికారులు ఊహించని షాక్ ఇస్తున్నారు.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *