PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/the-mp-who-drowned-jagan-with-swamijiff102c51-8d5c-4902-be62-76491527d4b0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/the-mp-who-drowned-jagan-with-swamijiff102c51-8d5c-4902-be62-76491527d4b0-415x250-IndiaHerald.jpgముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డిని ఒక ఎంపీ, ఒక స్వామీజీ క‌లిసి ముంచారా? ఖ‌రీదైన భూముల కోసం ఇద్ద‌రూ క‌లిసి ఒక ప్ర‌ణాళిక ర‌చించారా? అంటే స‌మాధానం ఔన‌నే వ‌స్తోంది. మాన్సాస్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారంలో హైకోర్టు మీజీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు అనుకూలంగా తీర్పు వెలువ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇది ప్ర‌భుత్వానికి, ముఖ్య‌మంత్రికి గ‌ట్టి ఎదురుదెబ్బ‌గా చెప్ప‌వ‌చ్చు. అస‌లు సంచ‌యిత ఎవ‌రో తెలియ‌ని జ‌గ‌న్‌రెడ్డివ‌ద్ద‌కు ఆమెను తీసుకువెళ్లి మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్‌ప‌ర్స‌న్‌గా నియ‌మింపచేయ‌డం వెన‌క ఆయ‌న‌కు కుడి ఎడ‌మ‌లుగjagan, vizag, ashok, mansas{#}High court;central government;ashok;Party;Y. S. Rajasekhara Reddy;MP;Wife;YCP;East Godavariజ‌గ‌న్‌ను ముంచిన ఎంపీ, స్వామీజీ?జ‌గ‌న్‌ను ముంచిన ఎంపీ, స్వామీజీ?jagan, vizag, ashok, mansas{#}High court;central government;ashok;Party;Y. S. Rajasekhara Reddy;MP;Wife;YCP;East GodavariTue, 15 Jun 2021 20:19:43 GMT
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డిని ఒక ఎంపీ, ఒక స్వామీజీ క‌లిసి ముంచారా? ఖ‌రీదైన భూముల కోసం ఇద్ద‌రూ క‌లిసి ఒక ప్ర‌ణాళిక ర‌చించారా? అంటే స‌మాధానం ఔన‌నే వ‌స్తోంది. మాన్సాస్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారంలో హైకోర్టు మీజీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు అనుకూలంగా తీర్పు వెలువ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇది ప్ర‌భుత్వానికి, ముఖ్య‌మంత్రికి గ‌ట్టి ఎదురుదెబ్బ‌గా చెప్ప‌వ‌చ్చు. అస‌లు సంచ‌యిత ఎవ‌రో తెలియ‌ని జ‌గ‌న్‌రెడ్డివ‌ద్ద‌కు ఆమెను తీసుకువెళ్లి మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్‌ప‌ర్స‌న్‌గా నియ‌మింపచేయ‌డం వెన‌క ఆయ‌న‌కు కుడి ఎడ‌మ‌లుగా ఉండే వ్య‌క్తులే అలా చేయ‌డం విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది.

మాన్సాస్ భూముల‌పై స్వామీజీ క‌న్ను?
మాన్సాస్ ట్ర‌స్ట్‌కు ఉన్న ఖ‌రీదైన భూముల‌పై విశాఖ‌ప‌ట్నంలోని ఒక స్వామీజీకి ఎప్ప‌టినుంచో క‌న్నుంద‌ని అధికార పార్టీ నేత‌లు చెబుతుంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల‌ను చూస్తోన్న ఒక ఎంపీ విశాఖ‌ప‌ట్నం రావ‌డంతో స్వామీజీ త‌న ప‌ని సులువైంద‌ని భావించారు. ట్ర‌స్ట్‌కుకానీ, సింహాచ‌లం దేవ‌స్థానానికికానీ పురుషుల‌నే చైర్మ‌న్‌గా నియ‌మించాల‌నే నిబంధ‌న ఉంది. అయితే ఈ నిబంధ‌న బ‌య‌ట‌కు తెలియ‌కుండా ఎప్పుడో ఇక్క‌డి నుంచి వెళ్లిపోయిన సంచయిత‌ను ర‌ప్పించి అశోక్‌గ‌జ‌ప‌తిని త‌ప్పించారు. ఆమె సంచయిత క్రైస్త‌వ మ‌తం స్వీక‌రించార‌ని, చ‌ర్చిల‌కు వెళ‌తార‌ని తెలుసు. అయినా వీరిద్ద‌రూ ఆమెకు ద‌గ్గ‌రుండి శిక్ష‌ణ ఇప్పించి నాట‌కాన్ని ర‌క్తిక‌ట్టించాల‌ని చూశారు. అటు సంచ‌యిత‌ను, ఇటు ముఖ్య‌మంత్రిని ఇద్ద‌రినీ ఈ ఇద్ద‌రూ ఘోరంగా వంచించార‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయంగా ఉంది.

వివాదాల సుడిగుండం
సంచయిత నియామకం అనేక వివాదాల‌కు దారితీసింది. ట్రస్టు డీడ్‌ ఉల్లంఘన ఒకటి కాగా, ఆమెకు ఆనంద గజపతిరాజు కుటుంబానికి ఎటువంటి సంబంధం లేద‌నే వాద‌న వ‌చ్చింది. వంశపారంపర్యంగా ఆ హక్కులు త‌మ‌కే వ‌ర్తిస్తాయంటూ ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె కూడా కోర్టును ఆశ్రయించిన విష‌యం తెలిసిందే. ఇన్ని లోపాలున్నా వైసీపీ ప్రభుత్వం వీటిని ఏ మాత్రం ఖాత‌రు చేయ‌లేదు. మాన్సాస్‌ ట్రస్టు ఎగ్జిక్యూటివ్ అధికారులుగా ప‌లువురు మారారు. ట్రస్టు పరిధిలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆలయ‌ భూముల్లోని ఇసుక వేలం విషయంలో కూడా ఆమె జోక్యం చేసుకునేవారంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆమె ఒత్తిడి త‌ట్టుకోలేక చాలామంది అధికారులు బ‌దిలీపై వెళ్లారు. ఇలా తెర‌వెన‌క అనేక‌ర‌కాల విష‌యాలు జ‌రిగిన‌ప్ప‌టికీ ఇవ‌న్నీ బ‌య‌ట‌కు రాకుండా తొక్కిపెట్టిన ఆ ఎంపీ, ఆ స్వామీజీ ఇప్పుడు ముఖ్య‌మంత్రికి ఏం స‌మాధానం చెబుతారు?  వారిద్ద‌రిప‌ట్ల ఆయ‌న వైఖ‌రి ఎలా ఉండ‌బోతోంది? అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.







రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

యూత్ చాయిస్ అంటున్న మోడీ... ?

తెలంగాణ కేబినెట్ లో కీలక మార్పులు.. వారి ఉద్వాసన తప్పదు?

వ్యాక్సిన్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ కీల‌క నిర్ణ‌యం

గ్రూప్ 1 అభ్య‌ర్థుల కేసుపై తీర్పు రిజ‌ర్వ్ చేసిన హైకోర్ట్

ఆటో నడిపిన విడదల రజినీ.. కారణమదేనా..?

జులై మొద‌టివారంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు?

లేడీ ఎస్సై ఆత్మ‌హత్యాయ‌త్నం కేసులో కీల‌క ప‌రిణామం...?

పోలీసుల అదుపులో హీరోయిన్‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>