PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp1162ec16-1ab3-4be6-b747-afec8656144b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp1162ec16-1ab3-4be6-b747-afec8656144b-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో కొత్త రాజకీయం మొదలైందా. మాజీ మంత్రి టీయారెస్ పునాదుల్లో నుంచి ఆ పార్టీలో ఉన్న ఉద్యమ నేత ఈటల రాజేందర్ కాషాయం కండువా కప్పుకున్నాక తెలంగాణాలో సీన్ మారుతుందా. అలా మారిన రాజకీయం ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం అన్నదే ఇపుడు చర్చగా ఉంది. bjp{#}Bharatiya Janata Partyబీజేపీ ఈటెలు గుచ్చుకునేది ఆ పార్టీకేనా... ?బీజేపీ ఈటెలు గుచ్చుకునేది ఆ పార్టీకేనా... ?bjp{#}Bharatiya Janata PartyMon, 14 Jun 2021 21:00:00 GMTతెలంగాణాలో కొత్త రాజకీయం మొదలైందా. మాజీ మంత్రి టీయారెస్ పునాదుల్లో నుంచి ఆ పార్టీలో ఉన్న ఉద్యమ నేత ఈటల రాజేందర్ కాషాయం కండువా కప్పుకున్నాక తెలంగాణాలో సీన్ మారుతుందా. అలా మారిన రాజకీయం ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

తెలంగాణాలో బీజేపీ ఈటల రాకతో బలపడుతుందా అంటే అవును అన్న సమాధానం వస్తోంది. అయితే అది ఎంతవరకూ అన్నదే ప్రశ్న. ఇప్పటిదాకా చూసుకుంటే బీజేపీకి తెలంగాణాలో రెండు మూడు జిల్లాలో తప్ప పెద్దగా బలం లేదు. ఆ పార్టీకి తెలంగాణా అంతటా పట్టు లేదు అన్నది తెలిసిందే. మరో వైపు చూసుకుంటే తెలంగాణాలో మొత్తం ఉనికి ఉన్న పార్టీ కాంగ్రెస్.
అయితే కాంగ్రెస్ సరైన దిశలో సాగడంలేదు అన్న మాట ఉంది. ఆ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు. వారిలో వారికే పోరు సాగుతూ ఉంటుంది. అధికారంలో లేకపోయినా కూదా కాంగ్రెస్ లో కొట్లాడుకునేవారు ఉంటారు. పవర్ లో ఉంటే సీఎం కావాలి. లేకపోతే పీసీసీ పోస్ట్ కావాలి. ఇలా సాగే కాంగ్రెస్ రాజకీయం అధికారంలో ఉన్న వారికి ఎపుడూ శ్రీరామరక్షగా ఉంటుంది.

ఇపుడు బీజేపీలో కొంత జోష్ కనిపిస్తోంది. బీజేపీ ఈటల వంటి వారు వచ్చిన తరువాత ఇంకా స్పీడ్ చేస్తుంది. అయితే మరో రెండేళ్ళలో ఎన్నికలు ఉన్న నేపధ్యంలో తెలంగాణా అంతటా 119 సీట్లలో బీజేపీ బలపడడం అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. దాంతో పాటుగా బీజేపీ ఎంత పుంజుకుంటే అంత మేరకు కాంగ్రెస్ కి దెబ్బ పడుతుంది. అంటే బీజేపీ ఇపుడు కాంగ్రెస్ కోటలు కూలుస్తుంది అన్న మాట. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ నుంచే పెద్ద సంఖ్యలో బీజేపీలోకి జనాలు చేరవచ్చు. అదే సమయంలో బీజేపీ పొడ గిట్టని వారు, కేంద్రంలో బీజేపీ మోడీ క్రేజ్ తగ్గుతోందని భావించేవారు టీయారెస్ వైపు వెళ్ళే చాన్స్ ఉంటుంది. ఈ పరిణామాలు చూసుకుంటే ట్రయాంగిల్ ఫైట్ 2023లో జరుగుతుంది. ఈ ఫైట్ లో కచ్చితంగా  కాంగ్రెస్ కి భారీ లాస్ జరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అదే సమయంలో టీయారెస్ అధికార పార్టీగా ఈ ఓట్ల చీలిక నుంచి మరో మారు గట్టెక్కే పరిస్థితి కూడా ఉంటుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.






తెలంగాణాలో కొత్త రాజకీయం మొదలైందా. మాజీ మంత్రి టీయారెస్ పునాదుల్లో నుంచి ఆ పార్టీలో ఉన్న ఉద్యమ నేత ఈటల రాజేందర్ కాషాయం కండువా కప్పుకున్నాక తెలంగాణాలో సీన్ మారుతుందా. అలా మారిన రాజకీయం ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

సీఎం పై రాముల‌మ్మ సెటైర్లు... !

సీఎం ఆస్తుల పై ,నా ఆస్తుల విచారణ జరపాలి : ఈట‌ల‌

కియా కార్ల తో పాలన పరుగులు పెడుతుందా..?

బీజేపీకి కేసీఆర్ ఆఫ‌ర్‌?

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై రఘురామ లేఖ‌ల‌యాత్ర

అన్నంత పని చేసిన ఈటెల... ఈటెలతో పాటు చేరింది ఎవరు...?

మోదీని గద్దె దించే వ్యూహంలో దీదీ ?

టీఆర్ ఎస్‌, బీజేపీ ఆహ్వానంపై చ‌ర్చిస్తున్నా: ఎల్‌.ర‌మ‌ణ‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>