PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/daggubatid11fc933-8468-4f24-b1ba-f4f50cb43f2d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/daggubatid11fc933-8468-4f24-b1ba-f4f50cb43f2d-415x250-IndiaHerald.jpgదగ్గుబాటి వెంకటేశ్వరరావు.....తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు. ఎన్టీఆర్ పెద్దల్లుడుగా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గుబాటి, కొన్నేళ్లు టీడీపీలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ని గద్దె దింపి చంద్రబాబు టీడీపీ పగ్గాలు, సీఎం పీఠం దక్కించుకున్నాక దగ్గుబాటి పూర్తిగా సైడ్ అయిపోయారు. భార్య పురంధేశ్వరితో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయారు. ఇక కాంగ్రెస్‌లో భార్యాభర్తలకు మంచి పొజిషన్ దక్కింది.daggubati{#}daggubati hitesh;Parchoor;Varasudu;Congress;Daggubati Venkateswara Rao;Wife;Hanu Raghavapudi;Venkatesh;NTR;CM;Bharatiya Janata Party;Jagan;CBN;TDP;Vishakapatnam;Andhra Pradeshదగ్గుబాటి చాప్టర్ క్లోజ్ అయినట్లేనా...!దగ్గుబాటి చాప్టర్ క్లోజ్ అయినట్లేనా...!daggubati{#}daggubati hitesh;Parchoor;Varasudu;Congress;Daggubati Venkateswara Rao;Wife;Hanu Raghavapudi;Venkatesh;NTR;CM;Bharatiya Janata Party;Jagan;CBN;TDP;Vishakapatnam;Andhra PradeshMon, 14 Jun 2021 00:00:00 GMTదగ్గుబాటి వెంకటేశ్వరరావు.....తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు. ఎన్టీఆర్ పెద్దల్లుడుగా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గుబాటి, కొన్నేళ్లు టీడీపీలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ని గద్దె దింపి చంద్రబాబు టీడీపీ పగ్గాలు, సీఎం పీఠం దక్కించుకున్నాక దగ్గుబాటి పూర్తిగా సైడ్ అయిపోయారు. భార్య పురంధేశ్వరితో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయారు. ఇక కాంగ్రెస్‌లో భార్యాభర్తలకు మంచి పొజిషన్ దక్కింది.


ఇక 2004, 2009 సమయాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో దగ్గుబాటి ఫ్యామిలీకి తిరుగులేకుండా పోయింది. అయితే ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగి ఏపీలో కాంగ్రెస్ క్లోజ్ అయిందో అప్పటినుంచి దగ్గుబాటి ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్ దెబ్బతింది. 2014లో పురంధేశ్వరి కాంగ్రెస్‌ని వీడి బీజేపీలోకి వెళ్ళి సెటిల్ అయ్యారు.


ఇక వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరమయ్యారు. అయితే అనూహ్యంగా 2019 ఎన్నికల ముందు తన వారసుడు కోసం మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారు. తన తనయుడు హితేష్‌ని వైసీపీలో చేర్చి పర్చూరు టిక్కెట్ కూడా తెచ్చుకున్నారు. కానీ విదేశీ పౌరసత్వం రద్దు కాకపోవడంతో హితేష్ పోటీ చేయడం కుదరలేదు. దీంతో దగ్గుబాటి వైసీపీ తరుపున పర్చూరులో పోటీ చేశారు. ఇక రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నా సరే పర్చూరులో టీడీపీ జెండా ఎగిరింది. దగ్గుబాటి ఓటమి పాలయ్యారు.


అటు పురంధేశ్వరి బీజేపీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇలా భార్యాభర్తలు ఇద్దరు వేరు వేరు పార్టీల్లో ఉండి ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక పురంధేశ్వరి బీజేపీలో కొనసాగుతుండగా, దగ్గుబాటి మాత్రం మళ్ళీ రాజకీయాలకు దూరమయ్యారు. అటు జగన్ కూడా దగ్గుబాటిని లైట్ తీసుకుని, పర్చూరుకు రావి రామనాథంబాబుని మళ్ళీ ఇన్‌చార్జ్‌గా పెట్టారు.


అయితే ఎన్నికలైన దగ్గర నుంచి దగ్గుబాటి మళ్ళీ ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. ఇక భవిష్యత్‌లో కూడా కనిపించడం కష్టమే అని తెలుస్తోంది. ఇక వారసుడు భవిష్యత్ పురంధేశ్వరి చూసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే ఏపీ రాజకీయాల్లో దగ్గుబాటి చాప్టర్ క్లోజ్ అయినట్లే అనుకుంటా!




చిన్నోడు, పెద్దోడి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాని ఎప్పటికీ మర్చిపోలేము ..... ??

ఛాన్స్ ఇస్తున్న మోడీ.. అందుకునే వాడేడీ..?

ఏపీ లో జోరందుకున్న క్రికెట్ బెట్టింగ్స్.. ఆ జిల్లా పై ఖాకీల పంజా..

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం.....తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ పార్టీకి తిరుగులేని బలం ఉంది. అందుకే టీడీపీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో ఎక్కువసార్లు పసుపు జెండా ఎగిరింది. ఆరు సార్లు చింతలపూడిలో టీడీపీ గెలిచింది. ఇక 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే 2019 ఎన్నికల నుంచి ఇక్కడ సీన్ మారిపోయింది. నియోజకవర్గంలో టీడీపీ వీక్ అయిపోయింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్ధి కర్రా రాజారావుపై వైసీపీ అభ్యర్ధి ఎలిజా విజయం సాధించారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు.....తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు. ఎన్టీఆర్ పెద్దల్లుడుగా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గుబాటి, కొన్నేళ్లు టీడీపీలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ని గద్దె దింపి చంద్రబాబు టీడీపీ పగ్గాలు, సీఎం పీఠం దక్కించుకున్నాక దగ్గుబాటి పూర్తిగా సైడ్ అయిపోయారు. భార్య పురంధేశ్వరితో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయారు. ఇక కాంగ్రెస్‌లో భార్యాభర్తలకు మంచి పొజిషన్ దక్కింది.

బీజేపీ కాకుంటే కాంగ్రెస్ వెంటేనా... ?

గుడ్ న్యూస్... కరోనా రహిత రాష్ట్రం దిశగా వెళుతున్న ఏపీ...

ఏపీ గవర్నర్ కు నారా లోకేష్ లేఖ ... కారణమిదే ?

రాజకీయాల్లో ఎన్నో దారులు. లక్ష్యాన్ని చేరుకోవాలి అని అనుకోవాలే కానీ ఏ దారి అయినా ఎంచుకోవచ్చు. అయితే దానిని రాదారిగా మార్చుకోవడంలోనే నాయకుడి సత్తా అన్నది ఆధారపడి ఉంటుంది. ఇక దేశంలో రాజకీయాలు మారుతున్నాయి. అలాగే ఏపీలో కూడా రాజకీయం మారుతోంది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>