MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/telugu-anchors-web-series0e6d209f-f894-4c8e-b757-3761b1930846-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/telugu-anchors-web-series0e6d209f-f894-4c8e-b757-3761b1930846-415x250-IndiaHerald.jpgలాక్ డౌన్ సమయంలో జోరుగా ఊపందుకున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎంతోమంది నటీనటులకు లైఫ్ ఇస్తున్న విషయం తెలిసిందే. మరికొందరు స్టార్ యాక్టర్లు ఓటీటీ లలో కనిపించి ఓటిటి వేదికలకు మరింత క్రేజ్ పెంచేస్తున్నారు. వెబ్ సిరీస్ లు, భారీ ప్రాజెక్ట్ షోలు ఇలా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓటీటీ ల హవా ఓ రేంజ్ లో కొనసాగుతోంది. TELUGU ANCHORS WEB SERIES{#}anasuya bharadwaj;Samantha;Josh;Anasuya;Telugu;Heroine;Amazonఆ ముగ్గురూ ఒకే వెబ్ సిరీస్ లో ... గ్లామర్ డోసు ఎక్కువే ?ఆ ముగ్గురూ ఒకే వెబ్ సిరీస్ లో ... గ్లామర్ డోసు ఎక్కువే ?TELUGU ANCHORS WEB SERIES{#}anasuya bharadwaj;Samantha;Josh;Anasuya;Telugu;Heroine;AmazonMon, 14 Jun 2021 14:00:29 GMTలాక్ డౌన్ సమయంలో జోరుగా ఊపందుకున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎంతోమంది నటీనటులకు లైఫ్ ఇస్తున్న విషయం తెలిసిందే. మరికొందరు స్టార్ యాక్టర్లు ఓటీటీ లలో కనిపించి  ఓటిటి వేదికలకు మరింత క్రేజ్ పెంచేస్తున్నారు. వెబ్ సిరీస్ లు, భారీ ప్రాజెక్ట్ షోలు ఇలా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓటీటీ ల హవా ఓ రేంజ్ లో కొనసాగుతోంది. ఇప్పటికే కాజల్, సమంత వంటి స్టార్ హీరోయిన్లు సైతం ఇక్కడ మెరిసి వీటి స్థాయిని మరింత పెంచేశారు. అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి ఓ టి టి యాప్ లు ప్రత్యేక వెబ్ సిరీస్ లతో తమ సత్తా చాటుతున్నాయి. అయితే తాజాగా ఓటీటీలకు సంబంధించి బిందాస్ లాంటి వార్త ప్రేక్షకులను తెగ ఊరిస్తోంది. తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్ లుగా కొనసాగుతున్న అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్, వర్షిని సుందరరాజన్ ముగ్గురినీ ఓకే వెబ్ సిరీస్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
 ప్రముఖ మల్లెమాల యాజమాన్యంతో వీరికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇదే సంస్థ వీరి ముగ్గురితో ఒక ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు టాక్. ఈ వెబ్ సిరీస్ లో పలువురు సినీ ప్రముఖ నటీనటులు సైతం కనిపించనున్నట్లు వినికిడి. అయితే రేష్మి, అనసూయ, వర్షిని లు మాత్రం ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఓవైపు స్టార్ యాంకర్ ల గానూ, మరో వైపు వెండితెరపై  నటుల గానూ కొనసాగుతున్న ఈ ముగ్గురు గ్లామరస్ బామల క్రేజ్ కు ఏమాత్రం కొదవలేదు. స్టార్ హీరోయిన్లతో సమానంగా ఫాలోయింగ్ పెంచుకుంటున్న వీరిని ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్స్ గా నటింపచేయనున్నట్లు తెలుస్తోంది.
 ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఎంటర్టైన్మెంట్ కు, గ్లామర్ కు ఏ మాత్రం కొదువ ఉండదు. ఇప్పుడదే జోష్ తో  రష్మీ, అనసూయ, వర్షిని లు వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ అంశం గురించి అధికారికంగా ఏ ప్రకటన లేదు కానీ, రానున్న రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కొందరు సినీ ప్రముఖులు. మరి ఏమి జరగనుందో చూడాలి.
 


ఆంటీ లాగే ఉన్నావు అనేవారు : ప్రియమణి

ఉచిత వైద్యం అందించ‌డ‌మే త‌న క‌లంటున్న రియ‌ల్ హీరో

పోలీస్ పాత్రలకు ప్రాణం పోసిన పదహారు సినిమాలు ఇవే..

లాక్ డౌన్ సమయంలో జోరుగా ఊపందుకున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎంతోమంది నటీనటులకు లైఫ్ ఇస్తున్న విషయం తెలిసిందే. మరికొందరు స్టార్ యాక్టర్లు ఓటీటీ లలో కనిపించి ఓటిటి వేదికలకు మరింత క్రేజ్ పెంచేస్తున్నారు. వెబ్ సిరీస్ లు, భారీ ప్రాజెక్ట్ షోలు ఇలా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓటీటీ ల హవా ఓ రేంజ్ లో కొనసాగుతోంది.

వెంకటేష్ కెరీర్ లో గుర్తుండిపోయే "ఘర్షణ"

బుల్లిపిట్ట: విద్యార్థుల కోసం అమెజాన్ సూపర్ సేల్.. అన్నీ రూ.10 వేలలోపే..

ఈ హీరోయిన్ కి చైతు లక్ తెచ్చేనా!!

సుమ ఇంట్లో ఉండి కూడా ఇంతలా సంపాదిస్తుందా.. ?

సినిమాలు వదిలేసి సన్యాసం తీసుకున్న నటులు వీళ్ళే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>