Crimepraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/karla-skam-mutaku-chek-pettinab1906c35-f081-4baa-858c-e054134efc05-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/karla-skam-mutaku-chek-pettinab1906c35-f081-4baa-858c-e054134efc05-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో కేటుగాళ్ల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది. ఉద్యోగమో, వ్యాపారమో చేసి బతకడం కాదు... ఇక జనాల్ని బురిడీ కొట్టించమే ఉద్యోగంగా మార్చుకుంటున్నారు ఎంతోమంది. ఇక ఇటీవలే హైదరాబాద్ నగరంలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. మంచి వాళ్ళ లాగా నటిస్తూ భారీ కార్ల స్కామ్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఇటీవల కాలంలో పోలీసులు భారీగా ఫిర్యాదులు అందుకోవడంతో ఇక ఈ కేసులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చివరికి మాయ మాటలతో నమ్మించి కార్లను దొంగలించి భారీగా సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్ల భరతం పట్టారు పోలీసులు. వివరాల్లోకిCp{#}Police Station;Car;king;Hyderabad;media;maya;News;policeకార్ల స్కామ్ ముఠాకి చెక్ పెట్టిన పోలీసులు. సీపీ సజ్జనార్ ఏమన్నారంటే?కార్ల స్కామ్ ముఠాకి చెక్ పెట్టిన పోలీసులు. సీపీ సజ్జనార్ ఏమన్నారంటే?Cp{#}Police Station;Car;king;Hyderabad;media;maya;News;policeMon, 14 Jun 2021 16:13:46 GMTఈ మధ్యకాలంలో  కేటుగాళ్ల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది.  ఉద్యోగమో, వ్యాపారమో చేసి బతకడం కాదు...  ఇక జనాల్ని బురిడీ కొట్టించమే ఉద్యోగంగా మార్చుకుంటున్నారు ఎంతోమంది.  ఇక ఇటీవలే హైదరాబాద్ నగరంలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. మంచి వాళ్ళ లాగా నటిస్తూ భారీ కార్ల స్కామ్ చేయడం మొదలుపెట్టారు.  ఇక ఇటీవల కాలంలో పోలీసులు భారీగా ఫిర్యాదులు అందుకోవడంతో ఇక ఈ కేసులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చివరికి మాయ మాటలతో నమ్మించి కార్లను దొంగలించి భారీగా  సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్ల భరతం పట్టారు పోలీసులు.



 వివరాల్లోకి వెళితే...  హైదరాబాద్ నగరంలోని ఆర్ సి పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల భారీ కార్ల స్కాం గ్యాంగ్ ను పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అరెస్టు చేశారు. కార్లను అద్దెకు ఇచ్చే  దుకాణాలనే టార్గెట్ గా చేసుకుని మాయ మాటలతో నమ్మించి ఇక కార్లను రెంటుకు తీసుకొని అటు నుంచి అటే పరార్ అవుతున్నారు. ఇక దొంగలించిన కార్లను తక్కువ ధరలకే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి  ఫిర్యాదులు ఎక్కువవడంతో ఇక ఈ ముఠా పై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు ఇక భారీ స్కామ్ కి  పాల్పడుతున్న ముఠా ఆగడాలకు కళ్లెం వేశారు.



 ఇకపోతే ఇటీవలే ఇక ఈ కేసు పై మీడియా సమావేశం నిర్వహించారు సీపీ సజ్జనార్. కార్ స్కామ్ ముఠా దగ్గర నుంచి నాలుగు కోట్ల వరకు విలువ చేసే 50 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు ఇప్పటికే దొంగిలించిన  కొన్ని కార్లను అమ్మకానికి కూడా పెట్టినట్లు గుర్తించామన్నారు సీపీ.   దాదాపు 200 కార్లకు పైగా ఇప్పటివరకూ ఈ ముఠా తక్కువ ధరకే అమ్మకానికి పెట్టినట్లు పోలీసులు విచారణలో తేలిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా పట్టుబడిన ఆరుగురూ నిందితుల్లో  నరేష్, బాదావత్ రాజు అనే ఇద్దరు నిందితులు అసలైన సూత్రధారులుగా తేల్చామని.. వీరిపై  ఇప్పటికే పలు పోలీసు స్టేషన్లలో ఏడు కేసులు ఉన్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.  ఇక నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు మరింత సమాచారం రాబడుతున్నట్లు చెప్పుకొచ్చారు.



బోరు బావిలోప‌డిన 4 ఏళ్ల చిన్నారి.. !

వృత్తే దైవం.. సానుభూతి శూన్యం..

వారికి ధన్యవాదాలు తెలిపిన విడదల రజినీ..?

సీఎం ఆస్తుల పై ,నా ఆస్తుల విచారణ జరపాలి : ఈట‌ల‌

వకీల్ సాబ్ దుమ్ము దులుపుతున్న దిల్ రాజు..

యాంకర్ రఘు కు బెయిల్..!

తల్లులకు టీకాలు.. మరి పిల్లలకు రక్షణ ఏది..

ఆ రెండు ఏక‌మై జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాట‌తీస్తాయ్ - చంద్ర‌బాబు

గోవుల ప్రాణాలు ఎవరు తెస్తారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>