PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-b6cedd61-3e52-4945-833f-1499b061d5aa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-b6cedd61-3e52-4945-833f-1499b061d5aa-415x250-IndiaHerald.jpgఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్‌తో ఆ రోజు సాయంత్రం 5గంట‌ల‌కు భేటీకానున్నారు. చాలా రోజుల త‌రువాత సీఎం జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌ని క‌లుస్తుండ‌టంతో సమావేశానికి ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అయితే ప్ర‌ధానంగా గ‌వ‌ర్న‌ర్ కోటాకు ఎమ్మెల్సీల ఎంపిక చేయ‌డంపైనే వీరిద్ద‌రి మధ్య చ‌ర్చ కొన‌సాగ‌నుంది.గ‌వ‌ర్న‌ర్ కోటాలో నాలుగు ఎమ్మెల్పీ స్థానాలు శుక్ర‌వారం ఖాళీకానున్నాయి.అయితే ఈ నాలుగు స్థానాల‌కు వైసీపీ నుంచి న‌లుగురు పేర్ల‌ను సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఖ‌రారు చేసి గ‌వ‌ర్న‌ర్jagan;{#}THOTA TRIMURTHULU;Thota Chandrasekhar;JAC;Trimurtulu;Amaravathi;Evening;Telangana Chief Minister;Assembly;Guntur;District;Reddy;CM;Party;YCPజగన్ కు అడ్డం తిరిగిన గవర్నర్...? ఆ ఇద్దరి కోసం రిస్క్ తీసుకుంటున్న సీఎం...?జగన్ కు అడ్డం తిరిగిన గవర్నర్...? ఆ ఇద్దరి కోసం రిస్క్ తీసుకుంటున్న సీఎం...?jagan;{#}THOTA TRIMURTHULU;Thota Chandrasekhar;JAC;Trimurtulu;Amaravathi;Evening;Telangana Chief Minister;Assembly;Guntur;District;Reddy;CM;Party;YCPMon, 14 Jun 2021 15:59:02 GMTఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్‌తో ఆ రోజు సాయంత్రం 5గంట‌ల‌కు భేటీకానున్నారు. చాలా రోజుల త‌రువాత సీఎం జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌ని క‌లుస్తుండ‌టంతో సమావేశానికి ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అయితే ప్ర‌ధానంగా గ‌వ‌ర్న‌ర్ కోటాకు ఎమ్మెల్సీల  ఎంపిక చేయ‌డంపైనే వీరిద్ద‌రి మధ్య చ‌ర్చ కొన‌సాగ‌నుంది.గ‌వ‌ర్న‌ర్ కోటాలో నాలుగు ఎమ్మెల్పీ స్థానాలు శుక్ర‌వారం ఖాళీకానున్నాయి.అయితే ఈ నాలుగు స్థానాల‌కు వైసీపీ నుంచి న‌లుగురు పేర్ల‌ను సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఖ‌రారు చేసి గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు పంపారు. కానీ గ‌వ‌ర్న‌ర్ ఇంకా వాటికి ఆమోద‌ముద్ర వేయ‌లేదు.రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి గ‌వ‌ర్న‌ర్‌కి పంపిన పేర్ల‌లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా నుంచి మోషేను రాజు, గుంటూరు జిల్లా నుంచి లేళ్ల అప్పిరెడ్డి,క‌డ‌ప జిల్లా నుంచి ఆర్వీ ర‌మేష్ యాదవ్‌, తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి తోట త్రిమూర్తులు ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ నాలుగు పేర్ల‌లో రెండు పేర్ల‌పై సందిగ్థ‌త ఏర్ప‌డింది. ఇందులో ఇద్ద‌రికి ఎమ్మెల్సీలుగా అవ‌కాశం క‌ల్పించాలా వ‌ద్దా అనే విష‌యంపై గ‌వ‌ర్న‌ర్ ఆలోచిస్తున్న‌ట్లు సమాచారం.గ‌వ‌ర్న‌ర్‌కి ఈ పేర్ల‌ను పంపి రెండురోజులు అవుతున్న ఇంకా ఆమోద‌ముద్ర ప‌డ‌క‌పోవ‌డంతో హుటాహుటిన సీఎం జ‌గ‌న్ రాజ్‌భ‌వ‌న్ బాట ప‌ట్టారు. ఆ రెండు పేర్ల‌పై ఏర్ప‌డ్డ సందిగ్ధ‌త‌ను తొలిగించే అంశంపైనే చ‌ర్చించ‌నున్నారు.
లేళ్ల అప్పిరెడ్డి,తోట త్రిమూర్తుల‌పై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయ‌నే కార‌ణంతోనే గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెల‌ప‌లేద‌ని స‌మాచారం. దీనిని ప‌రిష్క‌రించుకునేందుకు సీఎం జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌ని క‌ల‌వ‌నున్నారు.ప్ర‌ధానంగా తోట త్రిమూర్తుల‌పై ఇటీవ‌ల ద‌ళిత యువ‌కుడిపై శిరోముండ‌నం కేసులో ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.ఇదే విష‌యాన్ని ప్ర‌తిప‌క్ష‌నాయ‌కులు,ద‌ళిత సంఘాల నాయకులు గ‌వ‌ర్న‌ర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ఇలాంటి నాయ‌కుల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌న కోటాలో ప‌ద‌వులు ఇస్తే ఎలా అనే ప్ర‌శ్నలు వ‌స్తున్నాయి.అందుకే గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ కూడా క్షుణంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తుంది.ఇటు అమ‌రావ‌తి ద‌ళిత బ‌హుజ‌న జేఏసీ నేత‌లు కూడా తోట త్రిమూర్తుల‌కు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.శిరోముండ‌నం చేసిన వ్య‌క్తికి ఎమ్మెల్సీ ఇవ్వ‌డమంటే ద‌ళితుల మ‌రోభావాల‌ను గాయ‌ప‌ర‌చ‌ట‌మేన‌ని జేఏసీ నాయ‌కులు అంటున్నారు.తక్షణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోట త్రిమూర్తులు విషయంలో పునరాలోచించాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.
గ‌తంలో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఫ‌లానా వారికి అవ‌కాశం ఇవ్వండి అంటూ సీఎం నుంచి లేఖ‌లు వెళ్ల‌గానే గ‌వ‌ర్న‌ర్‌లు వాటికి ఆమోద ముద్ర వేసి పంపించివేస్తారు. కానీ ఏపీలో ప్ర‌స్తుతం అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. గ‌వ‌ర్న‌ర్ హ‌రిచంద‌న్ అన్ని విష‌యాల‌ను క్షుణంగా ప‌రిశీలించి పెద్ద‌ల స‌భ‌కు వెళ్లేవారు కాబ‌ట్టి వారికి ఉన్న అర్హ‌త‌ల‌ను ప‌రిశీలిస్తున్నారు.అందుకోస‌మే జ‌గ‌న్ పంపిన పేర్ల‌కు ఆమోద ముద్ర ప‌డ‌లేద‌ని తెలుస్తోంది.

గత ఏడాది సీఆర్డీయే ర‌ద్దు బిల్లు మండ‌లిలో వీగిపోవ‌డంతో సీఎం జ‌గ‌న్ అసెంబ్లీ సాక్షిగా మండ‌లిని రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు కానీ ఇంతవ‌ర‌కు అది ర‌ద్దు కాలేదు.అయితే అదే మండ‌లిలో తన‌కు మెజార్టీ వ‌స్తుండ‌టంతో ఇప్పుడు దానిపై సీఎం జ‌గ‌న్ దృష్టి సారించారు.మొత్తానికి ఆ ఇద్ద‌రు నేత‌ల‌కోసం సీఎం జ‌గ‌న్ తీసుకుని మ‌రి పద‌వులు ఇప్పిస్తున్న‌ట్లు ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.మ‌రి గ‌వ‌ర్న‌ర్ ఆ నాలుగు పేర్ల‌కు శుక్ర‌వారం లోపు ఆమోద‌ముద్ర వేస్తారా లేదో వేచి చూడాలి






రాజశేఖర్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే సినిమా అదే..?

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రేపు వారి అకౌంట్ లోకి రూ.10 వేలు?

తెలంగాణలో రాత్రి క‌ర్ఫ్యూ..?

తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

స‌ర్కార్ భూముల అమ్మ‌కం ఆపాలి - ఇందిరా

క‌రోనా కాలంలో దొర‌క‌ని ర‌క్తం..?

బోరు బావిలోప‌డిన 4 ఏళ్ల చిన్నారి.. !

సీఎం పై రాముల‌మ్మ సెటైర్లు... !

వారికి ధన్యవాదాలు తెలిపిన విడదల రజినీ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>