PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-190bfebba2-9b8b-422b-aef0-164e5c7d6420-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-190bfebba2-9b8b-422b-aef0-164e5c7d6420-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సమయంలో వృత్తి ధర్మంలో భాగంగా ప్రాణాల కోల్పోయిన వారిలో వైద్య సిబ్బంది, పోలీసులతో పాటు జర్నలిస్టులు కూడా ఉన్నారు. కరోనాకు భయపడి ప్రజలంతా ఇళ్లకు పరిమితమయిన వేళ వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి అందరూ దూరం పెట్టిన వారికి చికిత్స అందిస్తున్నారు, పోలీసులు ప్రజలను రక్షించేందుకు రాత్రిపగలు తేడా లేకుండా తమ..covid-19{#}January;2020;Tamil;policeవృత్తే దైవం.. సానుభూతి శూన్యం..వృత్తే దైవం.. సానుభూతి శూన్యం..covid-19{#}January;2020;Tamil;policeMon, 14 Jun 2021 17:17:57 GMTదేశంలో కరోనా సమయంలో వృత్తి ధర్మంలో భాగంగా ప్రాణాల కోల్పోయిన వారిలో వైద్య సిబ్బంది, పోలీసులతో పాటు జర్నలిస్టులు కూడా ఉన్నారు. కరోనాకు భయపడి ప్రజలంతా ఇళ్లకు పరిమితమయిన వేళ వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి అందరూ దూరం పెట్టిన వారికి చికిత్స అందిస్తున్నారు, పోలీసులు ప్రజలను రక్షించేందుకు రాత్రిపగలు తేడా లేకుండా తమ విధుల నిర్వహణలో భాగంగా రోడ్లపైనే రోజులు గడుపుతున్నారు. అదే తరహాలో జర్నలిస్టులు సైతం దేశ నలుమూలలా జరిగే సంఘటనలను వార్తల రూపంలో ప్రజలకు చేరవేస్తూ, ఎప్పటికప్పుడు మహమ్మారి వివరాలను తెలుపుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఎందరో జర్నలిస్టులు తమ ప్రాణాలను కోల్పోయారు. గత సంవత్సర కాలంలో దేశ వ్యాప్తంగా 973 మంది జర్నలిస్టులు వివిధ కారణాల వల్ల మృతి చెందారు. అంతేకాకుండా 154 మంది జర్నలిస్టులపై అక్రమ కేసులు కూడా నమోదయ్యాయి. ఇందులో జనవరి 2021 నుంచి ఇప్పటి వరకు 50 మందికి పైగా జర్నలిస్టులు కరోనా మహమ్మారి కారణంగా తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఢిల్లీకి చెందినటువంటి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ వారు నిర్మహించిన ఓ అధ్యయనం ప్రకారం 2020 ఏప్రిల్ నుంచి 2021 ఏప్రిల్ మధ్య కాలంలో దేశంలో 101 మంది జర్నలిస్టులు మృతిచెందారు. 2021 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కారణంగా మరణించిన జర్నలిస్టుల మరణాల సంఖ్య 52 గా నమోదయింది. దేశ వ్యాప్తంగా  కరోనా మొదటి వేవ్‌లో ఉత్తర ప్రదేశ్‌లో 19, మహారాష్ట్రలో 13, ఆంధ్రాలో 6, తమిళ నాడులో4, ఢిల్లీలో 8, తెలంగాణలో 17 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ఇంకా జర్నలిస్టులు మరణిస్తూనే  ఉన్నారు. ఇటీవల జర్నలిస్ట్ టీఎన్ఆర్ కూడా కరోనా కారణంగానే మరణించారు.
అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా తమ వృత్తికి న్యాయం చేసేందుకు జర్నలిస్టులు పడుతున్న తపన అభినందనీయం. కానీ వీరి కష్టాన్ని ఎవ్వరూ గుర్తించకపోగా, వీరిపై అక్రమ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎంత కష్టపడుతున్నా కనీస సానుభూతి లభించని వర్గం కూడా జర్నలిస్టులే కావడం బాధాకరం.



హీరోయిన్ 'రాశి' సీరియల్స్ లో నటిస్తూ.. వారానికి ఎంత సంపాదిస్తుందో తెలుసా..??

బోరు బావిలోప‌డిన 4 ఏళ్ల చిన్నారి.. !

యాంకర్ రఘు కు బెయిల్..!

కార్ల స్కామ్ ముఠాకి చెక్ పెట్టిన పోలీసులు. సీపీ సజ్జనార్ ఏమన్నారంటే?

అమెరికా వెళ్లడానికి రజనీకాంత్‌ కి పర్మిషన్.. కారణం అదే..?

ఇంకా తేలని సుశాంత్ మిస్ట‌రీ...?

చలాకి పోలీస్ గా వచ్చి.. బాక్సాఫీస్ దగ్గర గర్జించిన పవన్?

గోడ ప‌డ‌గొట్ట‌బోయిన జేపీ కంపెనీ?

ప్రియమణి రెమ్యూనరేషన్ ఎంత.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>