PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaganf8619bc6-7059-4109-a3cd-72e8d9c71757-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaganf8619bc6-7059-4109-a3cd-72e8d9c71757-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో నేతల చెప్పిన మాట మీద నిలబడి ఉండాలి. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోకపోతే ప్రజలకు నాయకులపై నమ్మకం పోతుంది. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు అలాగే ఎక్కువ హామీలు ఏపీ ప్రజలకు ఇచ్చారు. తీరా 2014లో గెలిచి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయలేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ప్రజలని ఆయన నమ్మలేదు. ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా అనేక హామీలు ఇచ్చిన జగన్‌ని నమ్మారు. అందుకే జగన్‌ని భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చారు.jagan{#}Jagan;Andhra Pradesh;MP;AgriGold;CBN;Letter;Hanu Raghavapudiఇక జగన్ మాట తప్పినట్లేనా...!ఇక జగన్ మాట తప్పినట్లేనా...!jagan{#}Jagan;Andhra Pradesh;MP;AgriGold;CBN;Letter;Hanu RaghavapudiMon, 14 Jun 2021 12:30:00 GMTరాజకీయాల్లో నేతల చెప్పిన మాట మీద నిలబడి ఉండాలి. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోకపోతే ప్రజలకు నాయకులపై నమ్మకం పోతుంది. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు అలాగే ఎక్కువ హామీలు ఏపీ ప్రజలకు ఇచ్చారు. తీరా 2014లో గెలిచి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయలేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ఆయనని ప్రజలు

నమ్మలేదు. ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా అనేక హామీలు ఇచ్చిన జగన్‌ని నమ్మారు. అందుకే జగన్ భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చారు.


జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతి హామీని అమలు చేసే దిశగా ముందుకెళుతున్నారు. ఈ రెండేళ్ల కాలంలో అనేక హామీలు అమలు చేశారు. అయితే మాట తప్పను, మడమ తిప్పను అని అధికారంలోకి వచ్చిన జగన్ సైతం కొన్ని హామీల విషయంలో ఇంకా ముందుకెళ్లలేదని తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా జగన్ అమలు చేయని హామీలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు వరుసపెట్టి లేఖలు రాస్తున్నారు.


ఇక జగన్ అమలు చేయని వాటిల్లో ఉద్యోగులకు సి‌పి‌ఎస్ రద్దు కాలేదు. అధికారంలో వచ్చిన వారం రోజుల్లోనే సి‌పి‌ఎస్ రద్దు చేసేద్దామని జగన్ చెప్పారు. కానీ రెండేళ్ల నుంచి దాని ఊసు తీసినట్లు కనిపించలేదు. అటు ప్రతి ఏటా రూ.250 పెంచుకుంటూ పోతానని అన్నారు. మొదట్లో రూ.250 పెంచారు. కానీ తర్వాత సంవత్సరం అమలు కాలేదు. మద్యపాన నిషేదం అన్నారు. అది ఆచరణలో ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు.


ఇక పెళ్లికానుక, షాదీ ముబారక్, అగ్రిగోల్డ్ అంశాలని జగన్ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఇక హోదా, విభజన హామీలు విషయంలో ఏం చేయలేకపోతున్నారనే విషయం తెలిసిందే. ఉద్యోగాల క్యాలెండర్ ఏమైందో తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటినే ఎంపీ రఘురామ హైలైట్ చేస్తున్నారు. మరి రానున్న మూడేళ్లలో ఈ హామీలని జగన్ అమలు చేస్తారేమో చూడాలి.    




జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై రఘురామ లేఖ‌ల‌యాత్ర

విక్రమ్ సింగ్ రాథోడ్ గా దుమ్మురేపిన రవితేజ..?

ఆ పార్లమెంట్ స్థానాల్లో సైకిల్ తోక్కేవాళ్లు కావాలి...!

అన్నంత పని చేసిన ఈటెల... ఈటెలతో పాటు చేరింది ఎవరు...?

మోదీని గద్దె దించే వ్యూహంలో దీదీ ?

నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసులో మరో భయంకరమైన ట్విస్ట్.. !

"పుష్ప-1" పది కేజీయఫ్‌లకు సమానమట.. ఆ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..?

వైసీపీలో చేర‌నందుకే క‌క్ష‌సాధింపు!

చంద్రబాబు చేసిన తప్పులనుంచి గుణపాఠాలు నేర్చుకోని జగన్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>