PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-coronavirus-updates25d0899e-f303-47fa-9e95-0b6c8faf03b6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-coronavirus-updates25d0899e-f303-47fa-9e95-0b6c8faf03b6-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ అంటే గడగడలాడిపోయే పరిస్థితి ఇప్పుడు మనకు ఉంది. ప్రపంచ దేశాలను వణికించిన కరోనా ఇండియాపై తన ప్రభావాన్ని మరింతగా చూపిస్తోంది. కానీ గత రెండు వారాలుగా కేసుల సంఖ్య మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాలలో సైతం రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో భాగంగా హైద్రాబాద్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ కొన్ని కీలక విషయాలను చెప్పారు. TELANGANA-CORONAVIRUS-UPDATES{#}srinivas;Telangana;Telugu;monday;media;Chicken;Coronavirus;Directorభేష్: లాక్ డౌన్ ముందు తెలంగాణ... తర్వాత తెలంగాణ...భేష్: లాక్ డౌన్ ముందు తెలంగాణ... తర్వాత తెలంగాణ...TELANGANA-CORONAVIRUS-UPDATES{#}srinivas;Telangana;Telugu;monday;media;Chicken;Coronavirus;DirectorMon, 14 Jun 2021 18:47:00 GMTకరోనా వైరస్ అంటే గడగడలాడిపోయే పరిస్థితి ఇప్పుడు మనకు ఉంది. ప్రపంచ దేశాలను వణికించిన కరోనా ఇండియాపై తన ప్రభావాన్ని మరింతగా చూపిస్తోంది. కానీ గత రెండు వారాలుగా కేసుల సంఖ్య మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాలలో సైతం రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో భాగంగా హైద్రాబాద్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ కొన్ని కీలక విషయాలను చెప్పారు. ఈ రోజు ఒక మీడియా సమావేశంలో భాగంగా ఏ క్రింది విషయాలను వెల్లడించారు. సోమవారం దాదాపు లక్షకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో కేవలం 1511 మాత్రమే పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం. ఒక్కరోజులో అత్యంత తక్కువ పాజిటివిటీ రేట్ 1.36% రావడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు. లాక్ డౌన్ ముందు ఉన్న పాజిటివిటీ రేట్ 6.74% తో పోల్చుకుంటే ఎంత వరకు తగ్గిందో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

కాగా ఈ రోజు కరోనా కాటుకు 12 మంది బలయినట్లు తెలిపారు. హాస్పిటల్స్ లో చేరే రోగుల శాతం కూడా భారీగా తగ్గిందని తెలిపారు. తద్వారా హాస్పిటల్స్ లో బెడ్ ఆక్యుపెన్సీ శాతం కూడా తగ్గిందని ఈ సందర్భంగా శ్రీనివాస్ తెలియచేశారు. అంతకు ముందు  52 శాతం ఉంటే, అది కాస్తా ఈ రోజుకి 16 శాతం గా ఉంది. ఇప్పటికిప్పుడు హాస్పిటల్స్ లో 55 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 350 హాస్పిటల్స్ పై కంప్లైంట్స్ వచ్చినట్లుగా తెలిపారు. ఈ హాస్పిటల్స్ అన్నింటిపైనా షోకాజ్ నోటీసులను ఇవ్వడం జరిగిందని తెలియచేశారు. ఈ శుభసూచికమైన ఫలితాలన్నీ తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేయడం మరియు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సజావుగా జరిపించడంతో ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు.  గత నెల ఆఖరులో నుండి మొదలు పెట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం నిన్నటి వరకు మొత్తంగా 16 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ ను వేయడం జరిగిందన్నారు.

ఇందులో దాదాపు 13 లక్షల మంది ఎక్కువ వయసున్న వారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారే కావడం గమనార్హం. కేవలం ఒక్క జిహెచ్ఎంసీ లో ఉన్న 5 లక్షల మంది రిస్క్ టేకర్స్ కు వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. ఇప్పటి వరకు 80 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు తెలిపారు. రానున్న అతి తక్కువ రోజుల్లోనే కోటి వ్యాక్సిన్ లను అందించే దిశగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు. ఇప్పటికి మా దగ్గర 9 లక్షల 20 వేల వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అంతే కాకుండా ముఖ్యంగా వర్షాకాలంలో వస్తున్న వర్గాలపైన కూడా ప్రత్యేక ద్రుష్టి సారించినట్లు ఈయన తెలిపారు. ఈ రోగాలలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఉన్నాయి. దాదాపు నాలుగు సంవత్సరాలుగా మలేరియా మరణాలు సంభవించలేదు. ఏదేమైనా ముందస్తుగా వర్షాకాలంలో వచ్చే రోగాలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు..








తమిళ రీమేక్ ని కొనేసిన అల్లు అర్జున్ ...?

ఆంధ్రాలో చాలా తక్కువ శాతానికి పడిపోయిన కేసులు...

'లక్ష్మీనరసింహా' గా అదరగొట్టిన బాలయ్య

కమెడియన్ ఇమేజ్ నుంచి బయటకు రావాలనుకుంటున్నా : ప్రియదర్శి

మూడో వేవ్ పిల్లలకు కాదా...? క్లారిటీ ఇచ్చేసిన కెసిఆర్ సర్కార్...?

ఆ సినిమాతో పోలీస్ రేంజ్ ఏంటో చూపించిన తారక్..

తస్మాత్ జాగ్రత్త.. వాటిని అస్సలు ముట్టుకోకండి?

ఆదిపురుష్ నెక్స్ట్ షెడ్యూల్ మొత్తం అతడిపైనే..?

అల్లు అర్జున్ తెలివిగా తప్పించుకుంటే పాపం తారక్ బలయ్యాడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>