MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli79996fec-b87c-4dae-9625-4954c5ca5f7c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli79996fec-b87c-4dae-9625-4954c5ca5f7c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌లోని యంగ్ అండ్ డైనమిక్ హీరోల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు తప్పక ఉంటుంది. అల్లుడుశ్రీను సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ ఆతరువాత వరుస సినిమాలతో దూసుకెళ్లాడు. తన డాన్స్, నటనలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీనివాస్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని..rajamouli{#}bellamkonda sai sreenivas;Rajamouli;srinivas;bollywood;Cinemaఛత్రపతి షూటింగ్‌కు సిద్దమట..?ఛత్రపతి షూటింగ్‌కు సిద్దమట..?rajamouli{#}bellamkonda sai sreenivas;Rajamouli;srinivas;bollywood;CinemaMon, 14 Jun 2021 18:30:38 GMTటాలీవుడ్‌లోని యంగ్ అండ్ డైనమిక్ హీరోల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు తప్పక ఉంటుంది. అల్లుడుశ్రీను సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ ఆతరువాత వరుస సినిమాలతో దూసుకెళ్లాడు. తన డాన్స్, నటనలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీనివాస్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం ప్రణాళిక కూడా సిద్దమయింది. తెలుగులో బంపర్ హిట్ అందుకున్న ‘ఛత్రపతి’ సినిమా రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని బెల్లంకొండ పిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా రాజమౌళి దగ్గర ఆ సినిమా హక్కులను అందుకున్నాడు.

అయితే ఈ సినిమా కేవలం బెల్లం కొండే కాదండోయ్.. టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలకు కేరాస్ అనిపించుకున్న వివి వినాయక్‌ కూడా ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడంట. అందులో భాగంగానే ఈ సినిమా హిందీ రీమేక్‌ను వినాయక్ డైరెక్ట్ చేస్తుండగా బెల్లం కొండ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాను జయంతిలాల్ గద నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటికే పట్టాలెక్కాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇటీవల ఈ సినిమాను చిత్రీకరించేందుకు ఓ విలేజ్ సెట్ కూడా వేశారట. కానీ ఇటీవల వచ్చిన వర్షాల కారణంగా ఆ సెట్ పాడయిపోయింది.

 దాంతో కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే సినిమా షూటింగ్ ప్రారంభించాలని ఫిక్స్ అయిపోయారు. ఇందుకు కావలసిన అనుమతుల కోసం చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుందట. కావలసిన అనుమతులు వచ్చిన వెంటనే ‘ఛత్రపతి’ రంగంలోకి దూకుతాడట. కుదిరితే వచ్చేనెల మొదటి వారంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావచ్చని అంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణను హైదరాబాద్, ముంబై, బంగ్లాదేశ్‌లలో చేయనున్నారని సమాచారం. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.



ఇది అరాచకం: లాక్ డౌన్ ముందు తెలంగాణ... తర్వాత తెలంగాణ... ఇదీ లెక్క ?

బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి సినిమా ‘ఛత్రపతి’ చిత్రీకరణకు సిద్దమయిందట.

రాజశేఖర్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే సినిమా అదే..?

తెలంగాణలో రాత్రి క‌ర్ఫ్యూ..?

అనన్య ఆ పాత్ర కోసం చాలా హోమ్ వర్క్ చేసిందట!!

హీరోయిన్ 'రాశి' సీరియల్స్ లో నటిస్తూ.. వారానికి ఎంత సంపాదిస్తుందో తెలుసా..??

మళ్ళీ గొంతు సవరిస్తున్న పవర్ స్టార్

'సమంతకు' నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్.. సినిమాకి మించిన రెమ్యూనరేషన్..?

ఇతిహాసాలపై బాలీవుడ్ చూపు.. ఎన్ని సినిమా లు తెరకెక్కుతున్నాయంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>