MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp0151ae8f-dace-441a-8dee-3df217cb6907-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp0151ae8f-dace-441a-8dee-3df217cb6907-415x250-IndiaHerald.jpgగుంటూరు జిల్లా రాజకీయాల్లో కమ్మ సామాజివర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. జిల్లాలో సగం నియోజకవర్గాల్లో కమ్మ నేతల హవానే ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కమ్మ వర్గం ఆధిపత్యం ఎక్కువ. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీలోని కమ్మ నేతలకు చెక్ పెట్టడానికి 2019 ఎన్నికల్లో జగన్ వైసీపీలో కమ్మ నేతలని నిలబెట్టారు.ysrcp{#}shankar;Telugu Desam Party;Krishna River;Kamma;Jagan;Guntur;Hanu Raghavapudi;District;Capital;MLA;Cheque;TDP;local language;YCP;Pedakurapaduహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ కమ్మ ఎమ్మెల్యేకు కమ్మ నేత చెక్ పెట్టగలరా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ కమ్మ ఎమ్మెల్యేకు కమ్మ నేత చెక్ పెట్టగలరా?ysrcp{#}shankar;Telugu Desam Party;Krishna River;Kamma;Jagan;Guntur;Hanu Raghavapudi;District;Capital;MLA;Cheque;TDP;local language;YCP;PedakurapaduSun, 13 Jun 2021 05:00:00 GMTగుంటూరు జిల్లా రాజకీయాల్లో కమ్మ సామాజివర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. జిల్లాలో సగం నియోజకవర్గాల్లో కమ్మ నేతల హవానే ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కమ్మ వర్గం ఆధిపత్యం ఎక్కువ. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీలోని కమ్మ నేతలకు చెక్ పెట్టడానికి 2019 ఎన్నికల్లో జగన్ వైసీపీలో కమ్మ నేతలని నిలబెట్టారు.


అలా పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్‌పై నంబూరు శంకర్ రావుని నిలబెట్టారు. జగన్ వేవ్‌లో నంబూరు విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నంబూరు సైలెంట్‌గా పనిచేసుకుంటూ వెళుతున్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ, సాధ్యమైన మేర వాళ్ళ సమస్యలని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేకు ప్లస్ అవుతున్నాయి. అయితే అన్నీ వర్గాల ప్రజలకు అండగా ఉండటంలో ఎమ్మెల్యే సక్సెస్ కాలేదని తెలుస్తోంది.


అటు పథకాల విషయంలో కొన్ని వర్గాల వారికే అనుకూలంగా ఉంటున్నారని తెలిసింది. అలాగే నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. అమరలింగేశ్వరస్వామి దేవాలయం ఉన్న అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు. అచ్చంపేట, మాదిపాడులు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు కృష్ణా నది దాటాలంటే నానా కష్టాలు పడుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై బ్రడ్జి నిర్మించాలసిన అవసరముంది. అటు నియోజకవర్గంలో రైతుల పంటలని నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్ అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేవు.


ఇక రాజకీయంగా వైసీపీ బలంగా ఉంది కాబట్టి నంబూరు కూడా బలంగానే ఉన్నారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. అయితే టీడీపీ నేత కొమ్మాలపాటిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. పైగా రాజధాని అంశం కలిసొచ్చే అవకాశముంది. ఈ రెండేళ్లలో కొమ్మాలపాటి కాస్త పుంజుకున్నారు. ఇక ఎన్నికల సమయానికి పూర్తిగా పుంజుకుని నంబూరుకు చెక్ పెడతారేమో చూడాలి.   





నల్లారి సోదరుడు సెట్ అయిపోయినట్లేనా!

టీడీపీలో ఆ ఎమ్మెల్యేలు ఇంకా డౌటే....!

కొడాలి ప్రత్యర్ధిని మార్చాల్సిందేనా!

డిప్యూటీ సీఎంలకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా?

అటు నుంచి వస్తున్న రాజుగారు..హైలైట్ అయితే కష్టమేనా

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌రిస్థితి తీవ్ర ఇర‌కాటంగా మారింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన `మాట‌`లే ఆయ‌న‌కు ఇప్పుడు రాజ‌కీయంగా తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు విప‌రీత‌మైన హామీలు గుప్పించారు జ‌గ‌న్‌. అదే స‌మ‌యంలో పార్టీ నేత‌ల‌కు కూడా అనేక హామీలు ఇచ్చారు. కొంద‌రిని పోటీ నుంచి త‌ప్పించేందుకు ప‌ద‌వుల ఆశ చూపించారు. మ‌రికొంద‌రికి పార్టీ ప‌ద‌వుల హామీలు ఇచ్చారు.

గుంటూరు జిల్లా రాజకీయాల్లో కమ్మ సామాజివర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. జిల్లాలో సగం నియోజకవర్గాల్లో కమ్మ నేతల హవానే ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కమ్మ వర్గం ఆధిపత్యం ఎక్కువ. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీలోని కమ్మ నేతలకు చెక్ పెట్టడానికి 2019 ఎన్నికల్లో జగన్ వైసీపీలో కమ్మ నేతలని నిలబెట్టారు.

రాజకీయాల్లో నాయకులు జంపింగులు సర్వ సాధారణమే. అధికారమే లక్ష్యంగా నేతల వలసలు ఉంటాయి. అలాగే ప్రత్యర్ధులని వీక్ చేయడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వలసలని ప్రోత్సహిస్తాయి. గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఇలాగే ముందుకు నడిచింది. వరుసపెట్టి వైసీపీ నేతలని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీలని చేర్చుకుంది. అటు అధికారం కోసం వైసీపీ వాళ్ళు కూడా టీడీపీలోకి జంప్ కొట్టారు.

ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్న అది పెద్ద సంచలనమే అని చెప్పాలి. ఈ రెండేళ్ల కాలంలో జగన్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఐదుగురుకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం అనేది కూడా ఒకటి. గతంలో చంద్రబాబు, ఇద్దరికి మాత్రమే డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. ఓసీ వర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పకు, బీసీ వర్గానికి చెందిన కే‌ఈ కృష్ణమూర్తిలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అలాగే వారు మంత్రులు కూడా ఉన్నారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>