PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nanie21fae83-a713-4c4c-bdae-87a6600d5313-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nanie21fae83-a713-4c4c-bdae-87a6600d5313-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం....మంత్రి కొడాలి నానికి కంచుకోట. అయితే ఇప్పుడు కొడాలి నానికి కంచుకోటగా ఉన్న గుడివాడ నియోజకవర్గం 2009 వరకు టీడీపీకి కంచుకోట. ఇక్కడ టీడీపీ తిరుగులేని విజయాలు సాధించింది. ఎన్టీఆర్ సైతం ఇక్కడ ఒకసారి పోటీ చేసి విజయం సాధించారు. ఇక కొడాలి నాని సైతం టీడీపీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున విజయం సాధించారు.kodali nani{#}CBN;NTR;Nani;Kodali Nani;Amarnath Cave Temple;Jagan;Vijayawada;Y. S. Rajasekhara Reddy;devineni avinash;Hanu Raghavapudi;District;krishna district;TDP;Pinnamaneni Babjiకొడాలి ప్రత్యర్ధిని మార్చాల్సిందేనా!కొడాలి ప్రత్యర్ధిని మార్చాల్సిందేనా!kodali nani{#}CBN;NTR;Nani;Kodali Nani;Amarnath Cave Temple;Jagan;Vijayawada;Y. S. Rajasekhara Reddy;devineni avinash;Hanu Raghavapudi;District;krishna district;TDP;Pinnamaneni BabjiSun, 13 Jun 2021 02:00:00 GMTకృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం....మంత్రి కొడాలి నానికి కంచుకోట. అయితే ఇప్పుడు కొడాలి నానికి కంచుకోటగా ఉన్న గుడివాడ నియోజకవర్గం 2009 వరకు టీడీపీకి కంచుకోట. ఇక్కడ టీడీపీ తిరుగులేని విజయాలు సాధించింది. ఎన్టీఆర్ సైతం ఇక్కడ ఒకసారి పోటీ చేసి విజయం సాధించారు. ఇక కొడాలి నాని సైతం టీడీపీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున విజయం సాధించారు.


కానీ రెండుసార్లు టీడీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఈ క్రమంలోనే 2009 ఎన్నికల తర్వాత వైఎస్సార్ మరణించడం, జగన్ వైసీపీ పెట్టడంతో నాని అటు వెళ్ళిపోయారు. పైగా కృష్ణా జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు ఇబ్బందిగా మారడంతో నాని పార్టీ మారిపోయారు. వైసీపీలోకి వెళ్ళి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచేశారు. ఇప్పుడు మంత్రిగా దూకుడుగా ఉన్నారు. నాని వైసీపీలోకి వెళ్లడంతో గుడివాడలో టీడీపీకి సరైన నాయకుడు లేకుండా పోయాడు.


2014లో నాని మీద రావి వెంకటేశ్వరరావు టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయి, ఆ తర్వాత ఆయన కూడా వైసీపీలోకి వెళ్ళి, ఇప్పుడు విజయవాడ తూర్పు ఇన్‌చార్జ్‌గా సెటిల్ అయ్యారు. అవినాష్ వైసీపీలోకి వెళ్లడంతో చంద్రబాబు మళ్ళీ రావిని ఇన్‌చార్జ్‌గా పెట్టారు. ఇక పేరుకే రావి ఇన్‌చార్జ్ గానీ, పని మాత్రం చేయడం లేదు. అసలు పార్టీలో కనిపించడం లేదు. నాని దెబ్బకు రావి సైలెంట్ అయిపోయారు. దీంతో గుడివాడలో టీడీపీ జెండా కనిపించడం తగ్గిపోయింది.


ఈ క్రమంలోనే నాని ప్రత్యర్ధిగా రావి పనికిరారని, ఆయన స్థానంలో బలమైన నాయకుడుని పెట్టాలని కొంతమంది టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ గుడివాడలో టీడీపీకి గట్టి నాయకులు ఉన్నారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ, యలవర్తి శ్రీనివాసరావులు గుడివాడ రాజకీయాల్లో ఉన్నారు. ఇక రావి బదులు వీరిలో ఒకరికి టిక్కెట్ ఇస్తే బెటర్ అని చెబుతున్నారు. మరి చూడాలి గుడివాడలో కొడాలి ప్రత్యర్ధిని మారుస్తారో లేదో?




డిప్యూటీ సీఎంలకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా?

అటు నుంచి వస్తున్న రాజుగారు..హైలైట్ అయితే కష్టమేనా

భార్యకి మత్తుమందిచ్చి స్నేహితులతో పాడు పనిచేయించిన భర్త.. చివరికి?

బంపర్ ఆఫర్ కొట్టేసిన అనసూయ..

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌రిస్థితి తీవ్ర ఇర‌కాటంగా మారింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన `మాట‌`లే ఆయ‌న‌కు ఇప్పుడు రాజ‌కీయంగా తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు విప‌రీత‌మైన హామీలు గుప్పించారు జ‌గ‌న్‌. అదే స‌మ‌యంలో పార్టీ నేత‌ల‌కు కూడా అనేక హామీలు ఇచ్చారు. కొంద‌రిని పోటీ నుంచి త‌ప్పించేందుకు ప‌ద‌వుల ఆశ చూపించారు. మ‌రికొంద‌రికి పార్టీ ప‌ద‌వుల హామీలు ఇచ్చారు.

రాజకీయాల్లో నాయకులు జంపింగులు సర్వ సాధారణమే. అధికారమే లక్ష్యంగా నేతల వలసలు ఉంటాయి. అలాగే ప్రత్యర్ధులని వీక్ చేయడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వలసలని ప్రోత్సహిస్తాయి. గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఇలాగే ముందుకు నడిచింది. వరుసపెట్టి వైసీపీ నేతలని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీలని చేర్చుకుంది. అటు అధికారం కోసం వైసీపీ వాళ్ళు కూడా టీడీపీలోకి జంప్ కొట్టారు.

ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్న అది పెద్ద సంచలనమే అని చెప్పాలి. ఈ రెండేళ్ల కాలంలో జగన్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఐదుగురుకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం అనేది కూడా ఒకటి. గతంలో చంద్రబాబు, ఇద్దరికి మాత్రమే డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. ఓసీ వర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పకు, బీసీ వర్గానికి చెందిన కే‌ఈ కృష్ణమూర్తిలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అలాగే వారు మంత్రులు కూడా ఉన్నారు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు....జగన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచే అదే పార్టీకి వ్యతిరేకంగా రాజుగారు ఎప్పటినుంచో ముందుకెళుతున్నారు. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ చేయని విధంగా రఘురామ, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే రఘురామ కేవలం చంద్రబాబు డైరక్షన్‌లో నడుస్తూ, జగన్‌ని నెగిటివ్ చేయాలని చూస్తున్నారని వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. అలాగే ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు.

పై నుంచి ఇబ్బంది లేకుండా చూస్తా..! బిల్లులు చెల్లించు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>