బస్సు కండెక్టర్
తమిళనాడులోని సేలం జిల్లాలోని మల్లమూపమట్టి ప్రాంతానికి చెందిన సుబ్రమణియన్ (49) అనే వ్యక్తి ప్రైవేటు బస్సు కండెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కండెక్టర్ సుబ్రమణియన్ రసికుడు. పరాయి స్త్రీలతో ఇతను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. సుబ్రమణియన్ అక్రమ సంబంధాలు తెలుసుకున్న అతని భార్య పుష్ప విసిగిపోయి 20 సంవత్సరాల క్రితమే భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.
భర్తను వదిలేసిన సర్వేశ్వరి
భార్య పుష్ప పుట్టింటికి వెళ్లిపోయినప్పటి నుంచి సుబ్రమణియన్ కనపడిన మహిళలతో ఎంజాయ్ చేస్తూ జీవిస్తున్నాడు. విల్లుపురానికి చెందిన చిత్ర అనే మహిళ సేలంలోని తలావైపట్టిలో నివాసం ఉంటున్నది. చిత్రా రెండో కుమార్తె సర్వేశ్వరి (35) అనే మహిళ భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేసింది. తల్లి చిత్రాతో నివాసం ఉంటున్న సర్వేశ్వరి సేలం ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నది.
ప్రియుడితో కాపురం పెట్టేసింది
కండెక్టర్ సుబ్రమణియన్, సర్వేశ్వరికి పరిచయం అయ్యింది. ఇద్దరూ కలిసి రెండు సంవత్సరాలు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. తరువాత సేలంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న సుబ్రమణియన్, సర్వేశ్వరి అక్కడ కాపురం పెట్టారు. తల్లి చిత్రా ఇంటికి అప్పుడప్పుడు వెళ్లి వస్తున్న సర్వేశ్వరి ప్రియుడు సుబ్రమణియన్ ను పెళ్లి చేసుకోకుండానే అతనితో కాపురం చేస్తూ అతనితోనే ఉండిపోయింది.
ప్రియురాలి అక్కను తగులుకున్న ప్రియుడు
సర్వేశ్వరికి అక్క ఉమామహేశ్వరి (38) ఉంది. భర్తతో తెగతెంపులు చేసుకున్న ఉమామహేశ్వరి 17 ఏళ్ల కుమార్తెను పిలుచుకుని సేలంలోని తల్లి చిత్రా ఇంటికి వచ్చేసింది. తల్లి చిత్రా ఇంటిలో ఉంటున్న ఉమామహేశ్వరి అప్పుడప్పుడు చెల్లెలు సర్వేశ్వరి ఇంటికి వెళ్లేది. అదే సమయంలో తన ప్రియురాలు సర్వేశ్వరి అక్క ఉమామహేశ్వరిని లైన్ లో పెట్టిన సుబ్రమణియన్ ఆమెను లొంగదీసుకున్నాడు.
చెల్లెలు పోతే అక్క చిక్కింది
ప్రియురాలు సర్వేశ్వరికి తెలీకుండా సుబ్రమణియన్ ఆమె అక్క ఉమామహేశ్వరితో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లిన సర్వేశ్వరి అనుకోకుండా ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంటి తలుపులు తీసేసి డోర్ లాక్ కూడా చెయ్యకుండా బెడ్ రూమ్ లో తన అక్క ఉమామహేశ్వరి, తన ప్రియుడు సుబ్రమణియన్ ఒంటి మీద నూలుపోగుకూడా లేకుండా ఎంజాయ్ చేస్తున్న విషయం చూసి షాక్ అయ్యింది. అంతే ప్రియుడు సుబ్రమణియన్ ను వదిలేసిన సర్వేశ్వరి ఆమె తల్లి చిత్రా ఇంటికి వెళ్లిపోయింది.
అక్కకు డైలీ మూడు పెగ్గులు, కొత్త ప్రియుడు ఉండాల్సిందే!
చెల్లెలు సర్వేశ్వరిని వదిలేసిన సుబ్రమణియన్ ఫుల్ టైమ్ గా ఆమె అక్క ఉమామహేశ్వరితో ఉండిపోయాడు. ఇదే సమయంలో సుబ్రమణియన్ కు షాకింగ్ విషయాలు తెలిశాయి. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఉమామహేశ్వరికి రోజు మూడు పెగ్గుల మందు, పరాయి మగాడు కావాలని సుబ్రమణియన్ తెలుసుకున్నాడు. తనతో ఉంటే సక్రమంగా ఉండాలని, లేదంటే నిన్ను చంపేస్తానని ప్రియుడు సుబ్రమణియన్ అతని ప్రియురాలు ఉమామహేశ్వరికి వార్నింగ్ ఇచ్చాడు.
డ్రామాలు ఆడిన ఆంటీ
తనతో అక్రమ సంబంధం పెట్టున్న సుబ్రమణియన్ బతికుంటే తన జల్సాలకు అడ్డువస్తాడని ఉమామహేశ్వరి భయపడింది. శనివారం ఉదయం సుబ్రమణియన్ ఇంట్లో శవమైనాడు. తన ప్రియుడు సుబ్రమణియన్ ఊపిరిఆడకుండా చనిపోయాడని, కరోనా వచ్చి ఉంటుందని ఉమామహేశ్వరి సేలంలోని ఇరుంబలై పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు పరిశీలించగా సుబ్రమణియన్ గొంత మీద, శరీరంలో అక్కడక్కడ గాయాలైన విషయం గుర్తించారు. సుబ్రమణియన్ ను హత్య చేశారని పోలీసులకు అనుమానం మొదలైయ్యింది.
సీసీటీవీ కెమెరాల్లో ఆంటీ కొత్త ప్రియులు
పోలీసులు సుబ్రమణియన్ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. శుక్రవారం రాత్రి ప్రియురాలు ఉమామహేశ్వరితో కలిసి ఇద్దరు మగాళ్లు సుబ్రమణియన్ ఇంటికి వచ్చారని గుర్తించారు. ఉమామహేశ్వరిని బెండ్ తియ్యడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తనకు నాగరాజన్, కన్నన్ అనే ఇద్దరితో అక్రమ సంబంధం ఉందని ఉమామహేశ్వరి అంగీకరించింది. తన జల్సాలకు అడ్డు వస్తున్న సుబ్రమణియన్ కు జ్యూస్ లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చామని, అతను గాఢంగా నిద్రపోతున్న సమయంలో తలదిండులతో అతని ముఖం మీద వేసి ఊపిరిరాకుండా చేసి చంపేశామని ఉమామహేశ్వరి అంగీకరించింది.
ఆల్ ఔట్…. ఆంటీ అండ్ కో అరెస్టు
ప్రియుడు సుబ్రమణియన్ ను హత్య చేసిన ఆమె ప్రియురాలు ఉమామహేశ్వరి, ఆమె బాయ్ ఫ్రెండ్స్ కన్నన్, నాగరాజ్ ను అరెస్టు చేశామని సేలం పోలీసులు తెలిపారు. భర్తను వదిలేసిన ఉమామహేశ్వరి మరో ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి అక్రమ సంబంధం పెట్టుకున్న కండెక్టర్ ను హత్య చెయ్యడం సేలంలో కలకలం రేపింది.