LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/aloo-manchuria-nu-eppudaina-ila-chesaradccbd8b8-c77d-448a-81a6-70543d4064aa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/aloo-manchuria-nu-eppudaina-ila-chesaradccbd8b8-c77d-448a-81a6-70543d4064aa-415x250-IndiaHerald.jpgఆలూ అంటే చాలా మందికి యమ ఇష్టం.. ఎందుకంటే స్వీట్, స్నాక్, ఫుడ్ దేనిలో అయిన వాడతారు.. ఒక్కో నెలలో ,ఒక్కో ప్రాంతంలో ఈ ఆలూ తో వెరైటీ వంటలను తయారు చేస్తారు.. ఇటీవల కాలంలో ఆలూ మంచురియా పేరు తెగ వినిపిస్తుంది.. ఆ ఐటమ్ టేస్ట్ అలాంటిది. ఎక్కడైనా రెస్టారెంట్ లో ఈ ఐటమ్ ను చాలా సింపుల్ గా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూద్దాం.. ఇక ఆలస్యం ఎందుకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒక్కసారి చూద్దాం..Aloo manchurian{#}Onion;garlic;Red chilly powder;Masala;oilఆలూ మంచూరియా ను ఎప్పుడైనా ఇలా చేసారా?ఆలూ మంచూరియా ను ఎప్పుడైనా ఇలా చేసారా?Aloo manchurian{#}Onion;garlic;Red chilly powder;Masala;oilSun, 13 Jun 2021 19:00:00 GMT
కావలసిన పదార్థాలు:

మైదా: అరకప్పు, 

మొక్కజొన్న పిండి: రెండు స్పూన్లు

ఉప్పు: తగినంత, 

ఉడికించిన బంగాళాదుంపలు: నాలుగు,

కారం: అరచెంచా, 

నూనె: వేయించేందుకుసరిపడా, 

ఉల్లిపాయలు: రెండు, 

వెల్లుల్లిరెబ్బలు: పది, 

క్యాప్సికం: రెండు, 

గరంమసాలా: పావుచెంచా, 

టొమాటో సాస్‌: రెండు చెంచాలు,

 చిల్లీసాస్‌: చెంచా, 

సోయా సాస్‌: అరచెంచా, 

నూనె: వేయించేందుకు సరిపడా.

ఫుడ్ కలర్ : కొద్దిగా

తయారీ విధానం: 

ఈ ఆలూ మంచూరియా తయారు చేయా లంటే ముందుగా ఒక గిన్నెలో  మైదా, మొక్కజొన్నపిండి, పావుచెంచా ఉప్పు, కారం వేసుకుని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఆ తరువాత నీళ్లు పోస్తూ బజ్జీలపిండిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద వెలిగించి పాన్ పెట్టి వేయించేందుకు సరిపడా నూనె వేయాలి. అది వేడయ్యాక ఆలూ ముక్కల్ని నాలుగైదు చొప్పున మైదా మిశ్రమంలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. స్టౌమీద మళ్లీ పాన్ పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలను వేసి దొరగా వేయించాలి. నిమిషం తరువాత క్యాప్సికం ముక్కలు, గరంమసాలా వేసి అన్నింటినీ వేయించుకోవాలి. అవి వేగాక పావుచెంచా ఉప్పు, సోయాసాస్‌, చిల్లీసాస్‌, టొమాటో సాస్‌, రెండు చెంచాల నీళ్లు పోసి ముందుగా వేయించుకున్న ఆలూ ముక్కలు వేసి స్టౌని సిమ్‌లో పెట్టి బాగా కలపాలి. వాటికి మసాలా పట్టాక స్టౌని ఆఫ్ చేయాలి.. అంతే ఎంతో రుచికరమైన మంచూరియా రెడీ.. మీకు ఈ ఐటమ్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి..



క‌ళాకారుల‌కు అండగా నిలిచిన దేవాదాయ‌శాఖ మంత్రి.. !

ఫేస్ ఆయిల్ వల్ల ఎన్ని లాభాలో తెలుసుకోండి..

ప్రతిరోజు తేనె, వెల్లుల్లి మిశ్రమం తింటే ఏమవుతుందో తెలుసా..?

బటర్ తో ఇలా రెసిపీ చేస్తే బెటర్.. !

చైనాను నమ్ముకున్నందుకు.. పాకిస్తాన్ కి భయం పట్టుకుంది?

కామెడీ సినిమాల్లో మేటి.. నువ్వు నాకు నచ్చావ్!

ఈ ఫేస్ ప్యాక్స్ తో ముఖం ముదురవ్వదు...

ఇంట్లో ఎలుకల బెడదా తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>