MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/best-comedy-movies-a80e22d0-5c5b-48f4-88e3-6c87552e749d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/best-comedy-movies-a80e22d0-5c5b-48f4-88e3-6c87552e749d-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది అభిమానులు మహేష్ సొంతం. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక మహేష్ తన కెరీర్లో హీరోగా మొత్తం 26 సినిమాలు చేశాడు. అందులో వైవిధ్యమైన సినిమాలు, కమర్షియల్ సినిమాలు, కామెడీ సినిమాలు, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు వున్నాయి. అయితే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కామెడీ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాంbest-comedy-movies {#}Trisha Krishnan;ali;mahesh babu;Brahmanandam;Nijam;Khaleja;Athidhi;krishna;Manam;Tollywood;m s narayana;sunil;Comedy;Cinemaప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన మహేష్ సినిమాలు ఇవే..ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన మహేష్ సినిమాలు ఇవే..best-comedy-movies {#}Trisha Krishnan;ali;mahesh babu;Brahmanandam;Nijam;Khaleja;Athidhi;krishna;Manam;Tollywood;m s narayana;sunil;Comedy;CinemaSat, 12 Jun 2021 18:39:25 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది అభిమానులు మహేష్ సొంతం. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక మహేష్ తన కెరీర్లో హీరోగా మొత్తం 26 సినిమాలు చేశాడు. అందులో వైవిధ్యమైన సినిమాలు, కమర్షియల్ సినిమాలు, కామెడీ సినిమాలు, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు వున్నాయి. అయితే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కామెడీ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మహేష్ చేసిన సినిమాలలో ఇప్పటికి ఎంతగానో నవ్వించే సినిమా అతడు అనే చెప్పాలి. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో స్వచ్ఛమైన కామెడీని మనం చూడవచ్చు. ముఖ్యంగా బ్రహ్మానందం, త్రిష కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తాయి.బ్రహ్మానందం హేమాతో చేసే సీన్స్ అలాగే మహేష్ బాబుతో చేసిన పంచ్ సీన్ అయితే సినిమాకే హైలెట్ అసలు..ఆ సీన్లో మహేష్ ని బ్రహ్మానందం కడుపు మీద గుద్దమని చెప్తాడు. మహేష్ గుద్దగానే బ్రహ్మానందం ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ అయితే చాలా సహజంగా నవ్వు తెప్పిస్తుంది. అలాగే చాలా కామెడీ సీన్స్ ఈ సినిమాలో మనం చూడవచ్చు.

" style="height: 206px;">




ఇక అలాగే అతిధి సినిమాలో మహేష్ బ్రహ్మానందం, సునీల్ తో కలిసి సిట్టింగ్ వేసే సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తాయి. ఈ సినిమాలో ఒక సీన్ లో మహేష్ తో నిజం చెప్పించడానికి సునీల్ బ్రహ్మానందం సిట్టింగ్ ప్లాన్ చేస్తారు. ఆ సీన్ లో పండిన కామెడీ అంతా ఇంతా కాదనే చెప్పాలి.తాగిన మైకంలో మహేష్ చేసిన కామెడీ ఇంకా దెబ్బలు తింటున్నప్పుడు సునీల్, బ్రహ్మానందం ఆర్తనాదాలు ఎంతో నవ్వు పుట్టిస్తాయి. ఇక వేణుమాధవ్ కామెడీ ట్రాక్ కూడా చాలా వినోదంగా ఉంటుంది.

" style="height: 206px;">




ఇక ఖలేజా సినిమాలో మహేష్ ని మనం కంప్లీట్ గా కామెడీ యాంగిల్ లో చూడొచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మహేష్ టైమింగ్ సూపర్ అనే చెప్పాలి. ఇక అలాగే అనుష్క, సునీల్, బ్రహ్మానందం ముఖ్యంగా అలీ ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఆద్యంతం నవ్వుని తెప్పిస్తుంటాయి.రాజస్థాన్ లో సీన్స్ అలాగే ఒక ఫైట్ లో మహేష్ బ్రహ్మానందంని తిట్టే సీన్స్ చాలా నవ్వు తెప్పిస్తాయి.

" style="height: 206px;">




ఇక మహేష్ కెరీర్ లో ఫ్యాన్స్ ని ఎంతగానో మెప్పించిన సినిమా దూకుడు అనే చెప్పాలి. ఈ సినిమాని ఫ్యాన్స్ ఎంతలా ఎంజాయ్ చేశారంటే అది మాటల్లో చెప్పలేం. ఇందులో ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు వున్నాయి. ముఖ్యంగా కామెడీ. ఇక ఈ సినిమాలో ఎమ్మెస్ నారాయణ ఎపిసోడ్, బ్రహ్మానందం ఎపిసోడ్, ఇక క్లైమాక్స్ అయితే ప్రేక్షకులను తనివితీరా నవ్విస్తాయి.బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణని మహేష్ బకరా చేసే సీన్స్ చాలా కామెడీగా ఉంటాయి.


" style="height: 206px;">




ఫుల్ కామెడీ: "మతిమరుపు" కాన్సెప్ట్ తో హిట్ అయిన మూవీ ఇదే ?

బన్నీ వాసు ని గీత ఆర్ట్స్ ఇంతలా ప్రోత్సహిస్తుందా.. ?

నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్న స్టార్ హీరోల ఫొటో.. ఇండియా హెరాల్డ్మూవీస్ క్యాటగిరి లో చూడండి.

నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్న స్టార్ హీరోల ఫొటో

అన్ని సినిమా లు ఓకే.. ఈ సినిమా చేస్తున్నావా బన్నీ!!

టాలీవుడ్ రంగాన్ని ఏలుతున్న ఫ్యామిలీలు ఇవే..?

ఆ ఇద్దరు స్టార్ హీరోల వెంట పడుతున్న 'ఉప్పెన దర్శకుడు'..?

ఒత్తిడిని దూరం చేసే చక్కటి కామెడీ సినిమా సొంతం..

నువ్ చల్లగా ఉండాలమ్మా.. కరోనా విధుల్లో నిండు గర్భిణీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>