MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vikram-kumar1c842f9e-3a73-4746-80c5-4fb000dc00e4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vikram-kumar1c842f9e-3a73-4746-80c5-4fb000dc00e4-415x250-IndiaHerald.jpgఏదైనా సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమా పై ఇతర భాషల దర్శకనిర్మాతలకు కన్ను పడడం సహజమే. ఆ సినిమాను తమ భాషల్లో రీమేక్ చేసి తాము కూడా ఆ సినిమా ద్వారా మంచి పేరు డబ్బు సంపాదించుకోవడానికి చూస్తారు. మన దర్శక నిర్మాతలు కూడా ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను కొన్నిటిని ఇక్కడ రీమేక్ చేసి విజయం సాధించారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే తెలుగులో ఫ్లాప్ అయిన ఓ చిత్రాన్ని ఇతర భాషల వాళ్ళు మోజు పడి మరీ రీమేక్ చేస్తున్నారు. vikram kumar{#}Gang Leader;Vikram Kumar;vikram;Audience;Chitram;Hero;Remake;Tamil;Nani;Telugu;Cinemaఫ్లాప్ సినిమా కు ఎందుకంత డిమాండ్..అన్ని రీమేక్ లా?ఫ్లాప్ సినిమా కు ఎందుకంత డిమాండ్..అన్ని రీమేక్ లా?vikram kumar{#}Gang Leader;Vikram Kumar;vikram;Audience;Chitram;Hero;Remake;Tamil;Nani;Telugu;CinemaFri, 11 Jun 2021 13:00:00 GMTఏదైనా సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమా పై ఇతర భాషల దర్శకనిర్మాతలకు కన్ను  పడడం సహజమే. ఆ సినిమాను తమ భాషల్లో రీమేక్ చేసి తాము కూడా ఆ సినిమా ద్వారా మంచి పేరు డబ్బు సంపాదించుకోవడానికి చూస్తారు. మన దర్శక నిర్మాతలు కూడా ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను కొన్నిటిని ఇక్కడ రీమేక్ చేసి విజయం సాధించారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే తెలుగులో ఫ్లాప్ అయిన ఓ చిత్రాన్ని ఇతర భాషల వాళ్ళు మోజు పడి మరీ రీమేక్ చేస్తున్నారు. 

సినిమా నే నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమా. విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నా విడుదలైన తర్వాత సినిమా భారీ ఫ్లాప్ అయ్యింది. విక్రమ్ మార్క్ వైవిధ్యం, నాని మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉన్నట్లు కనిపించినా ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేక పోయింది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమవడంతో పాటు సినిమా బాలేదు అనే కామెంట్ లను కూడా సొంతం చేసుకుంది.

అయితే ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా బాగానే అలరించింది అని చెబుతున్నారు. ఓ మోస్తరు టాక్ తో మొదలైన గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గానే నిలిచినా ఈ సినిమా ఫలితం పట్ల విక్రమ్ కు ఎలాంటి నిరాశ లేదని ఆయన చెప్తున్నారు. ఈ సినిమా చేసేటప్పుడు తాను ఎంతో నవ్వుకుంటూ పని చేశానని హీరో నాని కి  కూడా ఈ సినిమా అంటే ఎంతో ఇష్టమని, తనది కాకుండా వేరే వ్యక్తుల ప్రతీకారాన్ని తీసుకుని విలన్   మీదికి  హీరో వెళ్లడం అనేది యూనిక్ పాయింట్ అని విక్రమ్ అన్నాడు. అంతే కాకుండా ఈ సినిమా హిందీతో పాటు తమిళ మలయాళ భాషల్లో రీమేక్ అవుతుంది అని కూడా చెప్పారు. ఒక ఫ్లాప్ అయిన తెలుగు సినిమాని ఇన్ని భాషల్లో రీమేక్ చేయడం ఏంటా అని సినీ విశ్లేషకులు ఆశ్చర్యపడుతున్నారు. 



పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకఘట్టం ఆవిష్కృతం

ఆ సినిమా ప్రక్కన పెట్టేసినట్లే : కుండబద్దలు కొట్టిన బాలయ్య .... !!

యువ హీరోకి ఫుల్ సపోర్ట్ గా నిలుస్తున్న అల్లుఅరవింద్..?

యాంకర్ రవి లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా.. ?

పాపం రామ్ చరణ్ లో భయం మొదలైందా?

బాల‌య్య హీరోయిజానికి వ‌ర‌ల‌క్ష్మి విల‌నిజం తోడైతే?

ఆదిత్య 369 సీక్వెల్ పై బాలయ్య క్లారిటీ ..... !!

నాని సినిమాకి సాయిప‌ల్ల‌వి నెగ‌టివ్ సెంటిమెంట్..!

సక్సెస్ కోసం పాకులాడుతున్న తెలుగు దర్శకులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>