WomenN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant-e734ca1f-16a5-4877-a37f-27895fdadd3c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant-e734ca1f-16a5-4877-a37f-27895fdadd3c-415x250-IndiaHerald.jpgగర్భధారణ సమయంలో గర్భిణులు వైద్య పరీక్షల కోసం తరుచూ ఆసుపత్రికి వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా అసుపత్రులకు వెళ్ళడం కష్టం అవ్వడంతో గర్భిణులు ఆందోళనకు గురవుతున్నారు. గర్భిణులకు అనారోగ్య సమస్యలేవీ లేనప్పుడు, ప్రెగ్నెన్సీకీ, ప్రసవానికీ ప్రమాదం ఉందని గత పరీక్షల్లో నిర్ధారణ కానప్పుడూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. Pregnant {#}Ginger;Fish;Pregnantఅమ్మ: గర్భిణులు ఆ విషయంలో ఆందోళన వద్దు..!అమ్మ: గర్భిణులు ఆ విషయంలో ఆందోళన వద్దు..!Pregnant {#}Ginger;Fish;PregnantFri, 11 Jun 2021 15:06:37 GMTగర్భధారణ సమయంలో గర్భిణులు వైద్య పరీక్షల కోసం తరుచూ ఆసుపత్రికి వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా అసుపత్రులకు వెళ్ళడం కష్టం అవ్వడంతో గర్భిణులు ఆందోళనకు గురవుతున్నారు. గర్భిణులకు అనారోగ్య సమస్యలేవీ లేనప్పుడు, ప్రెగ్నెన్సీకీ, ప్రసవానికీ ప్రమాదం ఉందని గత పరీక్షల్లో నిర్ధారణ కానప్పుడూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మీకు శరీరంలో హఠాత్తుగా ఏవైనా మార్పులు వచ్చాయా అనేది గమనిస్తూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు, అంతేకాదు.. ఏమైనా అనుమానం కలిగితే ఫోన్‌ ద్వారానో, వీడియో కాల్‌ ద్వారానో వైద్యులను సంప్రదించాలన్నారు. ఇక గర్భంతో ఉన్నపుడు  బరువు పెరగడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటే వైద్యులతో ఇంట్లోనే వ్యాయామం చేయండి. ఇక గర్భిణులు తేలికపాటి వ్యాయామాలు, శరీరం అనుమతించే యోగాభ్యాసాలు చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇక ఇప్పుడు ఉన్న విపత్కర పరిస్థితుల్లో నడక కోసం బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు. ఇంట్లో గదుల్లోనూ, వరండాల్లోనూ, మేడపైనా నడవడం మంచిది. ఇక గర్భధారణ సమయంలో డైటింగ్‌ లాంటివి పొరపాటున కూడా చేయకూడదు. అంతేకాదు.. మీకు, మీ గర్భంలోని బిడ్డకూ అవసరమైన పోషకాలన్నీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇక ప్రతిరోజూ ఆహారంలో పండ్లూ, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్‌ ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి.

అయితే గర్భిణులు ఆహారంలో ముఖ్యంగా  అన్నం, రొట్టెలతో పాటు పాలు, పెరుగు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు దినుసులు, కోడి గుడ్లు, సోయాబీన్‌, చేపలు లాంటివి తీసుకోవాలి. గర్భిణీ మహిళలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ‘విటమిన్‌ - సి’ ఉన్న పండ్లు, పసుపు, తేనె, అల్లం వంటి ఆహారాలను తీసుకోండి. ఇక ఏప్పుడు ఆనందంగా గడపడానికి ట్రై చేయండి. గర్భిణులు ఒంటరిగా కంటే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం కేటాయించేలా చేసుకోవాలి మరి.



అమ్మ: పాలిచ్చే తల్లులు బరువు తగ్గాలంటే ఇలా చేయండి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>