ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-news-3cdfe794-83a6-4429-a3a0-b0609112d37b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral-news-3cdfe794-83a6-4429-a3a0-b0609112d37b-415x250-IndiaHerald.jpgసాధార‌ణంగా ఏ కోడి గుడ్డు అయినా బ‌య‌ట ఉంటే ఓ ప‌ది రోజుల వ‌ర‌కు మురిగిపోతుంది. అదే గుడ్డును ఫ్రిజ్‌లో పెడితే ఒక నెల రోజుల వ‌ర‌కు పాడ‌వ‌కుండా ఉంటుంది. అలాగే కోడిగుడ్డును బాగా గడ్డకట్టే మంచు ప్రాంతంలో పెడితే ఓ ఏడాది పాటు పాడ‌వ‌కుండా నాణ్యంగా ఉంటుంది కావొచ్చు. కానీ ఇజ్రాయెల్‌లో మాత్రం ఓ వింత ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ కోడిగుడ్డు వెయ్యి ఏళ్లుగా పాడ‌వ‌కుండా అలాగే ఉంది. ఆ దేశానికి చెందిన ఓ ఆర్కియాలజిస్టుకు దాదాపు వెయ్యేళ్ల కిందటి కోడి పెట్టిన గుడ్డు క‌నిపించింది. కాక‌పోతే ఆ గుడ్డు మనుషుల మల, మూత్రాల‌తో నింviral news {#}Israel;Egg;Turmericవైరల్ : వెయ్యేళ్ల కింద‌టి కోడిగుడ్డు.. కానీ ఇంకా పాడ‌వ్వ‌లేదు..!వైరల్ : వెయ్యేళ్ల కింద‌టి కోడిగుడ్డు.. కానీ ఇంకా పాడ‌వ్వ‌లేదు..!viral news {#}Israel;Egg;TurmericFri, 11 Jun 2021 18:21:14 GMTసాధార‌ణంగా ఏ కోడి గుడ్డు అయినా బ‌య‌ట ఉంటే ఓ ప‌ది రోజుల వ‌ర‌కు మురిగిపోతుంది. అదే గుడ్డును ఫ్రిజ్‌లో పెడితే ఒక నెల రోజుల వ‌ర‌కు పాడ‌వ‌కుండా ఉంటుంది. అలాగే కోడిగుడ్డును బాగా గడ్డకట్టే మంచు ప్రాంతంలో పెడితే ఓ ఏడాది పాటు పాడ‌వ‌కుండా నాణ్యంగా ఉంటుంది కావొచ్చు. కానీ ఇజ్రాయెల్‌లో మాత్రం ఓ వింత ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ కోడిగుడ్డు వెయ్యి ఏళ్లుగా పాడ‌వ‌కుండా అలాగే ఉంది.

ఆ దేశానికి చెందిన ఓ ఆర్కియాలజిస్టుకు దాదాపు వెయ్యేళ్ల కిందటి కోడి పెట్టిన గుడ్డు క‌నిపించింది. కాక‌పోతే ఆ గుడ్డు మనుషుల మల, మూత్రాల‌తో నింపి ఉన్న గొయ్యిలో దొర‌క‌డ‌మే ఇక్క‌డ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ రాసిన స‌మాచారం ప్రకారం.. స్థానికంగా ఉన్న యావ్నేలో ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ వారు తవ్వకాలు జ‌రిపారు.

అయితే ఈ త‌వ్వ‌కాల్లో వారికి క్రేజీ గుడ్డు లభించింది. వారు తవ్వకాలు చేస్తుండ‌గా మొద‌ట మ‌నిషి మలాన్ని నింపే గొయ్యి కనిపించింది వారికి. దీంతో ఇంకాస్త లోతుగా త‌వ్వ‌కాలు జ‌ర‌ప‌గా.. ఆ మలంతో నింపే గొయ్యిలో అప్పటికే ఉన్న కోడి గుడ్డును గ‌మ‌నించారు. అయితే ఆ కోడిగుడ్డును కావాలనే మలంలో నిల్వ ఉంచార‌ని వారి ప‌రిశోధ‌న‌లో తేలింది. కామ‌న్‌గా అయితే గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కాబ‌ట్టి ఇలా చేశారు.

కాక‌పోతే ఈ గుడ్డు వెయ్యేళ్లు ఇలా నిల్వ ఉండటం నిజంగా అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఈ విష‌యాన్ని ఐఏఏ ఆర్కియాలజిస్ట్ అల్లా నగోరస్కే మీడియాకు వివ‌రించారు. పలుచగా ఉన్న మలంలో గుడ్డును ఉంచడం వల్లే ఇన్నేళ్లు గ‌డిచినా.. పాడ‌వ్వ‌కుండా ఉంద‌న్నారు. పైగా ఆ క్రేజీ గుడ్డు పైన ఉన్న పెంకు చాలా స్ట్రాంగ్‌గా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే గుడ్డు మీద చిన్నగా బీటలు ఏర్పడటాన్ని చూస్తుంటే.. లోప‌ల ఉన్న తెల్ల సొన లీకై ఉండొచ్చ‌ని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. కాగా గుడ్డులోని పసుపు సొన మాత్రం అలాగే ఉంద‌న్నారు.



మంచిమాట : ముఖ్యంగా స్త్రీలు చేయకూడని పనులు ఏంటో తెలుసా ?

పోషకాహారం, వ్యాయామంతో కరోనాను ఎదుర్కొందాం!

మామిడిపండుతో ఈ రెసిపీ ఎప్పుడన్నా ట్రై చేసారా..?

మీ ఇంటికి పట్టిన దారిద్య్రం పోవాలంటే ఇలా చేయండి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>