PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/modi-amit-shah-bjp-govt-jaganca344072-4c57-4293-bfc8-c55601be3c82-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/modi-amit-shah-bjp-govt-jaganca344072-4c57-4293-bfc8-c55601be3c82-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుత భార‌త ప్ర‌భుత్వానికి ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోడీ, హోంమంత్రిగా అమిత్ షా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ధానిగా మోడీ ఏడు సంవ‌త్స‌రాల కాలాన్ని పూర్తిచేసుకోగా, అమిత్ షా రెండు సంవ‌త్స‌రాల ప‌ద‌వీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. ఏ ప‌నిమీదైనా, ఎవ‌రైనా ప్ర‌ధాన‌మంత్రిని క‌లిసిన‌ప్పుడు అమిత్ షాను క‌ల‌వాల్సిందిగా సూచిస్తుంటారు. అన్ని ప‌నులు షా చూస్తుంటార‌నా? లేదంటే ప‌ని ఒత్తిడివ‌ల్ల బాధ్య‌త‌లు అప్ప‌జెపుతున్నారా? అనేది ప్ర‌భుత్వ వ‌ర్గాల‌కు, భార‌తీయ జ‌న‌తాపార్టీలోని నేత‌ల‌కు మాత్ర‌మే తెలియాలి. రాష్ట్రాల నmodi, amit shah, bjp, govt, jagan{#}Amith Shah;Amit Shah;Delhi;central government;Andhra Pradeshపేరుకే ప్ర‌ధాన‌మంత్రి!! అంతా హోంమంత్రేనా?పేరుకే ప్ర‌ధాన‌మంత్రి!! అంతా హోంమంత్రేనా?modi, amit shah, bjp, govt, jagan{#}Amith Shah;Amit Shah;Delhi;central government;Andhra PradeshFri, 11 Jun 2021 14:50:48 GMT
ప్ర‌స్తుత భార‌త ప్ర‌భుత్వానికి ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోడీ, హోంమంత్రిగా అమిత్ షా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ధానిగా మోడీ ఏడు సంవ‌త్స‌రాల కాలాన్ని పూర్తిచేసుకోగా, అమిత్ షా రెండు సంవ‌త్స‌రాల ప‌ద‌వీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. ఏ ప‌నిమీదైనా, ఎవ‌రైనా ప్ర‌ధాన‌మంత్రిని క‌లిసిన‌ప్పుడు అమిత్ షాను క‌ల‌వాల్సిందిగా సూచిస్తుంటారు. అన్ని ప‌నులు షా చూస్తుంటార‌నా?  లేదంటే ప‌ని ఒత్తిడివ‌ల్ల బాధ్య‌త‌లు అప్ప‌జెపుతున్నారా? అనేది ప్ర‌భుత్వ వ‌ర్గాల‌కు, భార‌తీయ జ‌న‌తాపార్టీలోని నేత‌ల‌కు మాత్ర‌మే తెలియాలి. రాష్ట్రాల నుంచి ముఖ్య‌మంత్రులు వెళ్లినా ప్ర‌ధాన‌మంత్రి ఇదే స‌మాధానం ఇస్తుంటారు. దీంతో వారంతా ప్ర‌ధాన‌మంత్రిని క‌ల‌వ‌డంక‌న్నా హోంమంత్రి అమిత్ షాను క‌ల‌వ‌డానికే ఇష్ట‌ప‌డుతున్నారు.. వారి స‌మ‌స్య‌లు ఏక‌రువు పెట్టి ప‌రిష్క‌రించాల‌ని కోరుతున్నారు.

కేంద్ర హోంమంత్రిని క‌ల‌వ‌డానికే ప్రాధాన్యం?
తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షాతోపాటు ఇత‌ర కేంద్ర మంత్రుల‌ను కూడా క‌లిశారు. ఒక‌వేళ అమిత్‌షా అపాయింట్‌మెంట్ దొర‌క్క‌పోతే మిగ‌తా మంత్రుల‌ను క‌ల‌వ‌డం వాయిదా వేసుకునేవారు. గ‌తంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని క‌లిసిన స‌మ‌యంలో ఆయ‌న హోంమంత్రిని క‌ల‌వాల్సిందిగా జ‌గ‌న్‌కు సూచించిన‌ట్లు స‌మాచారం. దీంతో జ‌గ‌న్ ప్ర‌ధానిక‌న్నా హోంమంత్రిని క‌ల‌వ‌డానికే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ఏపీ ప్ర‌భుత్వ వ‌ర్గాలు అంటున్నాయి. ప్ర‌ధాన‌మంత్రి అపాయింట్‌మెంట్ అయినా దొరుకుతుందేమోకానీ హోంమంత్రి అపాయింట్ మెంట్ మాత్రం దొర‌క‌డంలేద‌నే వ్యాఖ్య‌లు రాష్ట్రాల్లోని పాల‌క‌వ‌ర్గాల నుంచి విన‌ప‌డుతుంటాయి. తాజాగా నిన్న జ‌గ‌న్‌కు కూడా హోంమంత్రి అపాయింట్ మెంట్ దొర‌క‌డం క‌ష్ట‌మ‌ని, భేటీ ర‌ద్ద‌వుతుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి కానీ జ‌గ‌న్ చివ‌రి నిముషంలో షాను క‌లిసి రాష్ట్ర స‌మ‌స్య‌లు ఏక‌రువుపెట్టి సాయం చేయ‌మ‌ని అడిగిన‌ట్లు మీడియాకు తెలిపారు. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వ్య‌క్తులు బీజేపీవారైనా, ఇత‌ర పార్టీవారైనా ప్ర‌ధాన‌మంత్రిని క‌ల‌వ‌డంక‌న్నా షాను క‌లిస్తేనే కొంత ప్ర‌యోజ‌న‌ముంటుంద‌నే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ షా ప‌ర‌ప‌తిని పెంచుతున్నారా?  లేదంటే షా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న ప‌ర‌ప‌తిని తానే పెంచుకుంటున్నారా? అనేది తెలియాల్సి ఉంద‌ని, దీనిపై కొంత స్ప‌ష్ట‌త రావాలంటే కొద్దికాలం ఆగాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.





రాజీనామాకు మూహుర్తం ఫిక్స్ చేసిన ఈట‌ల‌

మాస్క్ పెట్టుకోమని జగన్‌కి కేంద్ర మంత్రి సలహా...?

ఒకప్పుడు స్టార్స్.. నేడు బిచ్చగాళ్లుగా

ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

ఆ విషయాలు బాబు ఎందుకు చెప్పలేదు యనమల?

ప‌రువంతా గంగ‌పాలైంది?

రంజుగా ఉత్తర ప్రదేశ్ రాజకీయం!

సోనూకి పద్మ విభూషణ్ ఇవ్వాలి!

ఏపీ : బ్యాంకుల ప‌నివేళ‌ల్లో మార్పులు..కొత్త టైమింగ్స్ ఇవే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>