
ఢిల్లీలో కామాంధుడు
ఢిల్లీలో 48 ఏళ్ల వయసు ఉన్న రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. టైక్స్ టైల్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాజేష్ కు భార్య, 22 ఏళ్ల కుమార్తె ఉంది. ఇంతకాలం రాజేష్ అతని భార్య, కుమార్తెతో సంతోషంగా గడిపాడు. రాజేష్ కుమార్తె ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగం చెయ్యాలని ప్రయత్నాలు చేస్తోంది.

ప్రముఖ కంపెనీలో ఇంటర్వ్యూ
తల్లిదండ్రులు కష్టపడి తనను చదివించారని, మంచి ఉద్యోగం చేసి వాళ్లను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలని కూతురు నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీకి 52 కిలోమీటర్ల దూరంలోని ఐటీ హబ్ గురుగ్రామ్ లోని ప్రముఖ కంపెనీలోఇంటర్వ్యూకు హాజరుకావాలని రాజేష్ కుమార్తెకు సమాచారం అందింది. జూన్ 7వ తేదీన కుమార్తెను పిలుచుకుని రాజేష్ గురుగ్రామ్ వెళ్లాడు.

కూతురితో హోటల్ కు వెళ్లిన తండ్రి
ప్రముఖ కంపెనీలో ఇంటర్వ్యూకు హాజరైన యువతి ఫైనల్ రౌండ్ వరకు వెళ్లి హెచ్ ఆర్ తో ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని ఎలాగైనా ఉద్యోగం సంపాధించాలని నిర్ణయించింది. తండ్రితో కలిసి రాత్రి గురుగ్రామ్ లోని డీఎల్ ఎఫ్ ఫేస్ 3 లోని ఓ హోటల్ లో బసచేసింది. రాత్రి తండ్రి రాజేష్ తో కలిసి భోజనం చేసిన కుమార్తె రూమ్ లో నిద్రపోయింది.

తండ్రి కాదు….. నరరూప రాక్షసుడు
అర్దరాత్రి నిద్రపోతున్న కూతురిని చూసి కామంతో తట్టుకోలేని రాజేష్ ముందుగా ప్లాన్ ప్రకారం బ్యాగ్ లో పెట్టుకున్న టేప్ తీసుకుని కుమార్తె కేకలు వెయ్యకుండా ఆమె నోటికి ప్లాస్టర్ వేశాడు. వెంటనే క్షణాల్లో అదే టేపుతో ఆమె కాళ్లు, చేతులు చుట్టేశాడు. మానవమృగంలా రెచ్చిపోయిన రాజేష్ కన్నకూతురి మీద అత్యాచారం చేసి కామం తీర్చుకున్నాడు.

రేప్ వీడియో తీసి బ్లాక్ మెయిల్
రేప్ చేసే సమయంలో రాజేష్ సీక్రెట్ గా వీడియో తీశాడు. కన్నతండ్రి రేప్ చెయ్యడంతో కూతురు కుమిలిపోయి అదే హోటల్ లో కేకలు వెయ్యడానికి ప్రయత్నించింది. నువ్వు కేకలు వేసినా, పోలీసు కేసు పెట్టినా, ఈ విషయం అమ్మకు చెప్పినా ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, నీకు ఎక్కడా ఉద్యోగం రాదని, పెళ్లి కూడా జరగదని తండ్రి రాజేష్ కూతురిని బ్లాక్ మెయిల్ చేశాడు.

ఇంటికి సైలెంట్ గా వెళ్లిన కూతురు
మరుసటి రోజు ఇంటర్వ్యూకు కూడా హాజరుకాని కుమార్తె తండ్రితో కలిసి సైలెంట్ గా ఢిల్లీలోని ఇంటికి వెళ్లిపోయింది. మరుసటి రోజు కూరగాయలు తీసుకురావడానికి తల్లీ కూతురు బయటకు వెళ్లారు. ఆ సమయంలో హోటల్ లో నాన్న తనమీద అత్యాచారం చేశాడని ఆ అమ్మాయి తల్లికి విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లి ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా కూతురిని వెంటపెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్త మీద కేసు పెట్టింది.

నరాలు మొత్తం పిండేశారు
కేసు నమోదు చేసిన పోలీసులు కన్నకూతురి మీద అత్యాారం చేసిన కామాంధుడిని అరెస్టు చేసి అతని శరీరంలో ఉన్న ప్రతినరం లెక్కపెట్టి పిండేస్తున్నారు. కూతురి మీద అత్యాచారం చేసిన తండ్రిని విచారణ చేస్తున్నామని గురుగ్రామ్ డీఎల్ ఎఫ్ ఫేస్ -3 పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ వినిత్ స్థానిక మీడియాకు చెప్పారు. కన్నకూతురి మీద అత్యాచారం చెయ్యడమే కాకుండా దానిని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చెయ్యడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.