MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood922de175-e15a-4492-bb04-6534e6a7b5f2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood922de175-e15a-4492-bb04-6534e6a7b5f2-415x250-IndiaHerald.jpgదిల్ రాజు ఈ పేరు తెలియని వారుండరు. హీరో కాకపోయినా నిర్మాతగా ఉంటూ కూడా ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఓ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడంటేనే ఆ సినిమాపై అంచనాలు నెలకొంటాయి. ఏ సినిమా పడితే ఆ సినిమాను ఓకే చేయడని, మంచి కథ, కథనాలు ఉండే సినిమాలనే ఓకే చేస్తాడన్న పేరును కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలకు, అగ్రహీరోల సినిమాలకు కూడా దిల్ రాజు..Tollywood{#}Athadu;king;Dil;dil raju;News;Hero;Cinemaస్టార్ హీరోలంటే భయపడుతున్న దిల్ రాజు.. కారణం అదేనట..?స్టార్ హీరోలంటే భయపడుతున్న దిల్ రాజు.. కారణం అదేనట..?Tollywood{#}Athadu;king;Dil;dil raju;News;Hero;CinemaFri, 11 Jun 2021 16:17:00 GMTదిల్ రాజు ఈ పేరు తెలియని వారుండరు. హీరో కాకపోయినా నిర్మాతగా ఉంటూ కూడా ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఓ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడంటేనే ఆ సినిమాపై అంచనాలు నెలకొంటాయి. ఏ సినిమా పడితే ఆ సినిమాను ఓకే చేయడని, మంచి కథ, కథనాలు ఉండే సినిమాలనే ఓకే చేస్తాడన్న పేరును కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలకు, అగ్రహీరోల సినిమాలకు కూడా దిల్ రాజు కేరాఫ్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు వరుస సినిమాలు నిర్మిస్తున్నాడు. వాటిలో శంకర్, చెర్రీ కాంబోలో రానున్న సినిమా కూడా ఒకటి.


1997లో విడుదలైన ‘పెళ్ళి పందిరి’ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా చిత్ర సీమలోకి వచ్చిన దిల్ రాజు 2003లో దిల్ సినిమాతో నిర్మాతగా మారాడు. ఆ సినిమా భారీ హిట్ కావడంతో దిల్ రాజుగా అందరూ అతడిని పిలిచారు. ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి, ప్రస్తుతం అగ్రనిర్మాతల్లో ఒకడిగా ఉన్నారు. అయితే తాజాగా దిల్ రాజు స్టార్ హీరోలతో సినిమా చేయాలంటే భయపడుతున్నాడంటూ టాక్ నడుస్తుంది. స్టార్ హీరోలు వద్దు చిన్న హీరోలే ముద్దు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోలు అడ్వాన్స్‌లు తీసుకుంటున్నారని, వారి సినిమాలు ఆలస్యం అవుతున్నాయని, అదే చిన్న హీరో అయితే ఫ్రీగా ఉండచ్చని దిల్ రాజు ఆలోచిస్తున్నాడట. ఈ మేరకు సినీ సర్కిల్స్‌లో వార్తలు తెగవినిపిస్తున్నాయి. అయితే వీటిలో ఎంత నిజముందనేది మాత్రం తెలియాల్సి ఉంది.


ఇదిలా ఉంటే ప్రస్తుతం దిల్ రాజు అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే దిల్ రాజు అమెరికాకు హాలిడే ట్రిప్ వెళ్లాడని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం శంకర్, చెర్రీ సినిమా లొకేషన్స్ కోసం, వాటి అనుమతుల కోసం వెళ్ళారని, అమెరికాకు వెళ్లే ముందు చెన్నైలోని తన ఆఫీస్‌లో శంకర్‌తో మాట్లాడింది కూడా అమెరికాలోని లొకేషన్స్ గురించేనని అంటున్నారు. అతడు తిరిగి రాగానే శంకర్, చెర్రీ సినిమా కూడా పట్టాలెక్కుతుందట. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.


టాలీవుడ్ లో ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన పరభాషా హీరోలు

మళ్ళీ 'జనతా గ్యారేజ్' కాంబోని రిపీట్ చేయనున్న కేజీఎఫ్ డైరెక్టర్..?

బెల్లంకొండ ను కన్ఫ్యూజన్ లో పెట్టిన వివి వినాయక్!!

గుడివాడలో ఆర్ఆర్ఆర్.. అందుకోసమే..?

రేప్ చేయబోయిన అజయ్.. బోరున ఏడ్చిన ఆ మోడల్?

అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం..ఏడాది బాబును పొట్టన పెట్టుకున్న దుండగుడు !

ఆ హీరో మరియు దర్శకుడి వల్ల కెరీర్ పోగొట్టుకున్న పార్వతి మెల్టన్

మహేష్ బాబు ఓటీటీ ప్లాట్ ఫాం.. ఓన్లీ ఫర్ కిడ్స్..?

"కేవలం దాని కోసమే జీవించం.." గట్టిగా బుద్ధిచెప్పిన సనూష..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>