MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevide29db64-8b5e-4cdd-baf2-e7593fc4c786-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevide29db64-8b5e-4cdd-baf2-e7593fc4c786-415x250-IndiaHerald.jpg సినిమాల్లో మెగాస్టార్గా పేరు తెచ్చుకున్న చిరంజీవి, తాను సామాజిక సేవలో సైతం ఏమాత్రం తక్కువ కాదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. దేశంలో మరెవరూ ఊహించని విధంగా బ్లడ్ బ్యాంకు తోపాటు ఐ బ్యాంకు కూడా స్థాపించిన ఆయన అవే కాక మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.. ఇప్పటికే 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఆక్సిజన్ కోసం కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం తెలుసుకుని ప్రతి జిల్లా కేంద్రంలోని ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు విషయంలో chiranjeevi{#}District;Audio;Telugu;oxygen;Chiranjeevi;Service;mediaమీడియా ఎఫెక్ట్ : దూకుడు పెంచిన చిరంజీవి..అవి కూడా?మీడియా ఎఫెక్ట్ : దూకుడు పెంచిన చిరంజీవి..అవి కూడా?chiranjeevi{#}District;Audio;Telugu;oxygen;Chiranjeevi;Service;mediaFri, 11 Jun 2021 07:00:00 GMT
సినిమాల్లో మెగాస్టార్గా పేరు తెచ్చుకున్న చిరంజీవి, తాను సామాజిక సేవలో సైతం ఏమాత్రం తక్కువ కాదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. దేశంలో మరెవరూ ఊహించని విధంగా బ్లడ్ బ్యాంకు తోపాటు ఐ బ్యాంకు కూడా స్థాపించిన ఆయన అవే కాక మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.. ఇప్పటికే 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఆక్సిజన్ కోసం కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం తెలుసుకుని ప్రతి జిల్లా కేంద్రంలోని ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు విషయంలో అలాగే తాను చేస్తున్న సేవా కార్యక్రమాల విషయంలో మీడియా పెద్దగా ఫోకస్ చేయడం లేదంటూ ఆయన మొన్న ఒక మీడియా సంస్థ అధినేతతో ఫోన్లో మాట్లాడుతున్న ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

చిరంజీవి ఆవేదన అర్థం చేసుకున్నారో లేక ఇప్పటికి కూడా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ప్రస్తావించక పోతే బాగోదు అని అనుకున్నా ఏదో తెలియదు కానీ మీడియా సంస్థలు ఒక్కొక్కటిగా చిరంజీవి చేస్తున్న సేవ గురించి ప్రశంసించడం మొదలుపెట్టాయి.. దీంతో చిరంజీవి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ఈ ప్రశంశలను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారని తెలుస్తోంది. జరుగుతున్న ప్రచారం మేరకు చిరంజీవి త్వరలోనే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అంబులెన్స్ సేవలు కూడా ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.

ఇప్పటికే కరోనా సహా అనేక విషయాల్లో అంబులెన్సులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవనే చెప్పాలి. ప్రభుత్వాలు ఎన్ని పైకి చెప్పుకుంటున్న సరే పూర్తిస్థాయిలో అంబులెన్సులు అందుబాటులో లేని కారణంగా చాలా మంది మరణిస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అంబులెన్సులను కూడా సమకూర్చే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అయితే వీటి నిర్వహణ బాధ్యత ప్రభుత్వానికి ఇస్తారా లేక సమాంతరంగా ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.
 



ఉపాసన కొణిదెల ఒక షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందుకోసమే గత మూడు వారాల నుంచి వారంలో మూడు రోజుల చొప్పున చిరంజీవి ఇంట్లోనే ఉంటున్నారట శర్వానంద్ .ఇక ఈ షార్ట్ ఫిలిం లో రామ్ చరణ్ అలాగే శర్వానంద్ ఇద్దరూ కలిసి నటించబోతున్నారు.

చిరంజీవి ఇంట్లోనే ఉంటున్న శర్వానంద్..అసలు ఏమైంది ?

వైష్ణవ్ తేజ్ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?

సోనుసూద్ ను కలవడానికి 700 కి.మీ నడక

స్మరణ : ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు అందుకున్న నటి సుజాత ..

జగన్.. అమిత్‌షా దగ్గర మరోసారి ఆ విషయం పట్టుబట్టారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ కమ్మ ఎమ్మెల్యేకు నెగిటివ్ పెరుగుతుందా?

విలేజ్ వంటలతో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న వృద్ధుడు..?

మొత్తానికి ఆర్ఆర్ఆర్ విషయంలో అదే జరిగేలా ఉందిగా  .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>