
ఏపీలో కొత్తగా 8239 కరోనా కేసులు, 61 మరణాలు
తాజాగా నమోదైన 8239 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,96,122కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 61 మంది మృతి చెందారు.
చిత్తూరులో అత్యధికంగా 10 మంది మరణించగా, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కడప, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 11,824కు చేరింది.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 96వేలకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 11,135 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 16,88,198కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం 96,100 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,02,39,490 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1396 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలులో 201 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 698, చిత్తూరులో 1396, తూర్పుగోదావరిలో 1271, గుంటూరులో 488, కడపలో 693, కృష్ణాలో 462, కర్నూలులో 201, నెల్లూరులో 407, ప్రకాశంలో 561, శ్రీకాకుళంలో 421, విశాఖపట్నంలో 500, విజయనగరంలో 254, పశ్చిమగోదావరిలో 887 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,45,481, చిత్తూరులో 2,05,951 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో లక్షకు మించిపొయాయి.