PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pithanie49a17b7-ce13-48df-8b38-619447f1cd8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pithanie49a17b7-ce13-48df-8b38-619447f1cd8b-415x250-IndiaHerald.jpgపశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన సామాజికవర్గాల్లో శెట్టిబలిజ కూడా ఒకటి. జిల్లాలో రాజకీయాలని కాపులు, రాజులతో పాటు శెట్టిబలిజలు కూడా శాసిస్తారు. పలు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపోటములకు శెట్టిబలిజలు కీలకం అవుతారు. అలాంటి సామాజికవర్గంలో బలమైన నాయకుడుగా ఉన్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటం లేదు.pithani{#}Godavari River;ATCHANNAIDU KINJARAPU;Congress;TDP;Minister;Jagan;Andhra Pradesh;Party;CBN;Newsపితాని సైడ్ అయిపోయినట్లేనా!పితాని సైడ్ అయిపోయినట్లేనా!pithani{#}Godavari River;ATCHANNAIDU KINJARAPU;Congress;TDP;Minister;Jagan;Andhra Pradesh;Party;CBN;NewsFri, 11 Jun 2021 03:00:00 GMTపశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన సామాజికవర్గాల్లో శెట్టిబలిజ కూడా ఒకటి. జిల్లాలో రాజకీయాలని కాపులు, రాజులతో పాటు శెట్టిబలిజలు కూడా శాసిస్తారు. పలు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపోటములకు శెట్టిబలిజలు కీలకం అవుతారు. అలాంటి సామాజికవర్గంలో బలమైన నాయకుడుగా ఉన్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటం లేదు.


గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన పితాని 2009లో ఆచంట నుంచి గెలిచారు. ఇక రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. దీంతో పితాని టీడీపీలోకి వచ్చేశారు. మళ్ళీ 2014 ఎన్నికల్లో ఆచంట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా ఛాన్స్ కొట్టేశారు. ఇక అధికారం, పదవి ఉన్నన్ని రోజులు ఏపీ రాజకీయాల్లో పితాని బాగా హడావిడి చేసేవారు.


కానీ 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. మళ్ళీ టీడీపీ తరుపున ఆచంటలో పోటీ చేసిన పితాని, జగన్ వేవ్‌లో ఓటమి పాలయ్యారు. 12 వేల మెజారిటీతో చెరుకువాడ రంగనాథరాజుపై ఓడిపోయారు. ఓడిపోయాక పితాని ఏపీ రాజకీయాల్లో పెద్దగా సందడి చేయట్లేదు. అయితే పితాని సైలెంట్ అయిపోవడానికి కారణాలు లేకపోలేదు. ఈ‌ఎస్‌ఐ స్కామ్ విషయంలో పితానిపై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా కార్మిక మంత్రిగా అచ్చెన్నాయుడు ఒక టర్మ్, పితాని సత్యనారాయణ ఒక టర్మ్ పనిచేశారు.


అప్పుడు ఈ‌ఎస్‌ఐలో పలు అక్రమాలు జరిగాయని చెప్పి జగన్ ప్రభుత్వం అప్పుడు మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడుని జైలుకు కూడా పంపింది. దీంతో పితాని కూడా జైలుకు వెళ్ళడం ఖాయమని ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే పితాని వైసీపీలో వెళ్తారని వార్తలు కూడా వచ్చాయి. కానీ పితాని పార్టీ మారలేదు. అలా అని టీడీపీలో కనిపించడం లేదు. అచ్చెన్న జైలుకెళ్లి బయటకొచ్చేసిన సరే, పితాని టీడీపీలో యాక్టివ్ అవ్వలేదు. మరి చూడాలి పితాని టీడీపీ నుంచి సైడ్ అయిపోతారో లేక పార్టీలో కనిపిస్తారో?    




ఆ రాజుగారికి బెర్త్ ఖాయమేనట!

జగన్ బాటలో చినబాబు వెళ్తారా? సెట్ చేస్తారా?

కేశినేనికి పోటీగా దాసరి దిగాల్సిందేనా?

పుస్తకం పట్టడం, మక్కెలిరగ్గొట్టడం .... కాన్సెప్ట్ అదేనట .... ??

జగన్ ఏపీ సీఎం అయిన మొదట్లో విద్యుత్ ఒప్పందాలపై గట్టిపట్టు పట్టారు. అవసరమైతే ఆ ఒప్పందాలు సమీక్షిస్తామన్నారు. దీనిపై చాలా రచ్చ జరిగింది. ఇప్పుడు జగన్ అమిత్ షా భేటీ విషయంలో ఇది మరోసారి ప్రస్తావనకు వచ్చిందట.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ గురువారం రాత్రి దాదాపు గంటన్నర సేపు భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు అంశాలను సీఎం హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకు వచ్చారు.

అమిత్‌షాతో జగన్‌ గంటన్నరసేపు.. ఏం మాట్లాడారంటే..?

మొత్తానికి ఆర్ఆర్ఆర్ విషయంలో అదే జరిగేలా ఉందిగా  .... ??

రెండేళ్ళు డేటింగ్.. ఆ తప్పే ప్రాణాన్ని తీసిందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>