CrimeN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/murder-2cedafc4-b4e7-4d97-8d31-f360daff2a2f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/murder-2cedafc4-b4e7-4d97-8d31-f360daff2a2f-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలతో నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కోదాడలో ఇదే కోణంలో ఓ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోదాడకు చెందిన మన్నూరు వెంకన్నకు పదమూడు సంవత్సరాల క్రితం సైదమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారుmurder {#}Hyderabad;Smart phone;Sri Venkateswara swamy;gold;Arrest;Murder.;Husband;policeదేవుడా: భర్త హత్యకు బంగారం సుపారిగా ఇచ్చిన భార్య..!దేవుడా: భర్త హత్యకు బంగారం సుపారిగా ఇచ్చిన భార్య..!murder {#}Hyderabad;Smart phone;Sri Venkateswara swamy;gold;Arrest;Murder.;Husband;policeFri, 11 Jun 2021 21:00:00 GMTఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలతో నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కోదాడలో ఇదే కోణంలో ఓ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోదాడకు చెందిన మన్నూరు వెంకన్నకు పదమూడు సంవత్సరాల క్రితం సైదమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఇక బ్రతుకుతెరువు కోసం వెంకన్న మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే రెండెళ్ల క్రితం మిర్యాల గూడేనికి చెందిన సైదులుతో, సైదమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. సైదులు హైదరాబాద్ నగరంలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. అయితే కొద్దిరోజుల క్రితం వివాహేతర సంబంధం గురించి వెంకన్నకు తెలిసి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇక అక్రమ సంబంధంపై వెంకన్న భార్యను మందలించిన ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో వెంకన్న మిర్యాలగూడ నుండి ఇళ్లు కాళీ చేసి కోదాడకి మకాం మార్చాడు. కానీ సైదమ్మ, సైదయ్యల మధ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇక వెంకన్న భార్యను అదుపులో పెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే సైదమ్మ మాత్రం భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. వారి ఇద్దరి మధ్య అడ్డుగా వస్తుండటంతో ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఇక ఎలాగైనా భర్త ప్రాణాలు తీయాలనుకుంది. అయితే గతంలో మిర్యాలగూడలో ఉంటున్న కమాలాకర్ అనే తన పాత ఇంటి యజమానికి ఫోన్ చేసి హత్య ప్లాన్ గురించి చెప్పింది. ఇక అందుకోసం ఆమె  డబ్బుతో పాటు బంగారం ఇస్తానని అతడికి ఆశ చూపించింది.

దీంతో కమలాకర్‌ వెంకన్నను హత్య చేయడానికి ప్లాన్ చేశాడు. పథకం ప్రకారం.. కమలాకర్‌ తో వెంకన్నకు పాత పరిచయం ఉండటంతో  బయటకు పిలిపించాడు. ఇక ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఇక మలాకర్ ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం మత్తు ట్యాబెట్లను మద్యంలో కలిపి ఇచ్చాడు. అయితే వెంకన్న మత్తులో ఉండగానే కమలాకర్‌  రాయితో మోది చంపి అక్కడి నుండి పారిపోయాడు.  వెంకన్న తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి అసలు నిజాలు బయటికి రావడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.



వావివరసలు మరిచిన అన్న.. చెల్లి ఏం చేసిందో తెలుసా?

మీ ఆయన కూడా అదే చేస్తాడు.. అనసూయ భర్తపై కామెంట్ చేసిన రోజా?

ఈటల బాటలో మరికొందరా ? కేసీఆర్ తట్టుకోగలడా ?

సీరియల్ నటి కాకముందు వంటలక్క ఏం చేసేదో తెలుసా .. ?

మహేష్ తో మూవీ అంటే .... ఇక పై అంత సులువు కాదట .... ??

అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం..ఏడాది బాబును పొట్టన పెట్టుకున్న దుండగుడు !

హైదరాబాద్ సినిమా ఊపిరి పోతుంది.. చివరికి కన్నీరే మిగిలింది?

ఆంధ్రా హక్కుల పరిస్థితేంటి.. ఎవరూ పెదవిప్పరేం..

జిహెచ్ఎంసి అధికారుల తప్పులు.. వాహనదారులకు కింద పడి దెబ్బలు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>