PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china7acd5eb8-cae0-402a-9753-7071cf2df235-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china7acd5eb8-cae0-402a-9753-7071cf2df235-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టంతా ‘చైనా’పైనే ఉంది. కరోనా మూలాల విషయం కాని, దాని దుందుడుకు చర్యలతోకాని చైనా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో తనపై నుండి ఇతర దేశాల దృష్టి తప్పించేందుకు చైనా ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు దేశాలతో కయ్యానికి కాలు దువ్విన సంగతి తెలిసిందే. ఇందులో మొదటగా భారత్ సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులను నెలకొల్పి ప్రపంచాన్ని పక్కమార్గం పట్టించి, ఆ తరువాత..china{#}Japan;Indiaతైవాన్ జోలికి రావద్దు.. నడ్డి విరుస్తాం..తైవాన్ జోలికి రావద్దు.. నడ్డి విరుస్తాం..china{#}Japan;IndiaFri, 11 Jun 2021 20:43:36 GMTప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టంతా ‘చైనా’పైనే ఉంది. కరోనా మూలాల విషయం కాని, దాని దుందుడుకు చర్యలతోకాని చైనా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో తనపై నుండి ఇతర దేశాల దృష్టి తప్పించేందుకు చైనా ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు దేశాలతో కయ్యానికి కాలు దువ్విన సంగతి తెలిసిందే. ఇందులో మొదటగా భారత్ సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులను నెలకొల్పి ప్రపంచాన్ని పక్కమార్గం పట్టించి, ఆ తరువాత మరి కొన్ని దేశాలతోనూ గొడవకు సై అన్న విధంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల తైవాన్‌ను తమ దేశంలో భాగంగా ప్రచారం చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఏ దేశమైనా తైవాన్‌ను ప్రత్యేక దేశంగా సంభోదిస్తే వారికి వార్నింగులు కూడా ఇచ్చింది.
 

ఈ క్రమంలోనే ఇటీవల జపాన్ అధ్యక్షుడు తైవాన్‌‌ను దేశంగా పరిగణించినందుకు గానూ జపాన్‌కు వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య ఉన్న సత్సబంధాలు చెడే అవకాశాలు ఉన్నాయని, తమ విషయాలలో జోక్యం చేసుకోవద్దంటూ చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై జపాన్ అధ్యక్షుడు ఏమీ మాట్లాడక పోయినా, ఆ సందర్భంలో చైనా మాట్లాడిన మాటలు పలు దేశాలకు ఆగ్రహం తెప్పించాయి. వాటిలో యూఎస్ కూడా ఒకటి. దాంతో తాజాగా యూఎస్ ఈ విషయంపై స్పందించింది. అంతేకాకుండా తైవాన్ జోలికి పోవద్దంటూ చైనాకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది.


తైవాన్ ఆక్రమణ అంత సులభం కాదు, దుర్లభమని యూఎస్ చైర్మన్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మిల్లీ అన్నారు. ‘ తైవాన్‌ను ఆక్రమించడం అనేది సరైనది కాదు. అది జరుగుతూ ఉంటే ఇక్కడెవరూ చూస్తూ కూర్చోరు. చైనా తన అక్రమాలను కొనసాగిస్తుంటే ఊరుకునే పరిస్థితే లేదు. తైవాన్ విషయంలో అవసరమయితే మా బలం, బలగం అడ్డు వేసేనా చైనా నడ్డి విరుస్తామ’ని మిల్లీ అన్నారు. అయితే చైనాకు యూఎస్ డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం అనేది ప్రస్తుతం ప్రపంచమంతా చర్చనీయాంశం అయింది. మరి మిల్లీ వ్యాఖ్యలకు చైనా ఏమని రిప్లై ఇస్తుందో వేచి చూడాలి.



ఆ హీరో దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన బన్నీ..

కోహ్లీ అందుకే తడబడుతున్నాడేమో?

ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు : రాహుల్ ద్రవిడ్

'పూరీ - పవన్' ల హ్యాట్రిక్ కాంబో సెట్టవుతుందా..?

మళ్ళీ 'జనతా గ్యారేజ్' కాంబోని రిపీట్ చేయనున్న కేజీఎఫ్ డైరెక్టర్..?

ఓ వైపు ఆనందం.. మరో వైపు ఆందోళన.. తడిసి ముద్దవుతున్న భారత్?

అదే జరిగితే పుష్ప-2 సినిమా ఫ్లాప్ అవుతుందా..?

పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌ల పెంపుపై టీకాంగ్రెస్ ఆందోళ‌న‌

బాక్సాఫీస్ బరిలో చరణ్ - అర్జున్ .... ఇక యుద్ధమే .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>