PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagandfd0a4f9-eab3-46d2-ae34-692eefc595b1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagandfd0a4f9-eab3-46d2-ae34-692eefc595b1-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన క్రమంలో హైదరాబాద్‌ను 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవధిలోనే తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఆస్తులను, హక్కులను సరిచూసుకోవాలని తెలిపారు. అయితే వీటిపై ఇప్పటి వరకూ ఏ నాయకుడు స్పందించలేదు. గత ప్రభుత్వం హయాంలో కూడా దీనిని పట్టించుకోలేదు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఆంధ్రా రాజధాని అనడమే తప్ప తెలంగాణ..jagan{#}Capital;Government;Hyderabad;Jagan;CBN;CM;Telanganaఆంధ్రా హక్కుల పరిస్థితేంటి.. ఎవరూ పెదవిప్పరేం..ఆంధ్రా హక్కుల పరిస్థితేంటి.. ఎవరూ పెదవిప్పరేం..jagan{#}Capital;Government;Hyderabad;Jagan;CBN;CM;TelanganaFri, 11 Jun 2021 15:17:00 GMTఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన క్రమంలో హైదరాబాద్‌ను 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవధిలోనే తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఆస్తులను, హక్కులను సరిచూసుకోవాలని తెలిపారు. అయితే వీటిపై ఇప్పటి వరకూ ఏ నాయకుడు స్పందించలేదు. గత ప్రభుత్వం హయాంలో కూడా దీనిని పట్టించుకోలేదు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఆంధ్రా రాజధాని అనడమే తప్ప తెలంగాణలో ఆంధ్రా ఆస్తుల గురించికానీ, హక్కుల గురించి కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పాలించిన 5 ఏళ్లు కూడా ఈ విషయాలపై మౌనం పాటించారు.
చంద్రబాబును భారీ మెజార్టీతో ఓడించి ఆంధ్రా సీఎం పదవిని దక్కించుకున్న జగన్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు అయ్యాయి. ఆయన అయినా తెలంగాణలో ఆంధ్రాకు ఉన్న హక్కులు, ఆస్తుల గురించి పట్టించుకొని ఓ సమాధానాన్ని తీసుకువస్తారని అందరూ ఆశించారు. కానీ జగన్ గారు మాత్రం విభజన సమయంలో చేసుకున్న ఒప్పందాలను గురించి పట్టించుకోలేదు. కనీసం వాటి ఊసు కూడా ఎక్కడా ఎత్తలేదు. నిజానికి విభజన సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం సెక్షన్ 9, సెక్షన్ 10 ప్రకారం సంస్థల బదాలాయింపులు జరగాలి, ఒకవేళ స్థలాలు అక్కడే ఉంటే వాటి నుంచి కంపన్సేషన్ పొందాలి. వీటన్నింటి లెక్కలు చూస్తే రూ.20 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకు ఆంధ్రాకు రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా సచివాలయంలో కూడా ఆంధ్రాకు హక్కు ఉంది. కానీ దానిని పూర్తిగా వదులుకున్నాం. వీటితో పాటు తెలంగాణ నాన్ లోకల్ కోటాలో ఆంధ్రాకు రావాల్సిన కళాశాలల్లో సీట్లు, ఉద్యోగాల భర్తీలో ఉన్నటువంటి 15 శాతం హక్కుకు కూడా నీళ్లు వదిలేశాం.
అయితే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండనున్న కాలం తీరిపోవస్తుంది. ఇప్పటికే 7 ఏళ్లు గడిచిపోయాయి. ఇక 3 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడేళ్లలో అడగని వాటిని రానున్న మూడేళ్లలో ఏమైనా అడుగుతారా అన్నది చూడాలి.



కేసుల ఒత్తిడితోనే జగన్ ఢిల్లీ టూర్?

జిహెచ్ఎంసి అధికారుల తప్పులు.. వాహనదారులకు కింద పడి దెబ్బలు?

అల్లుళ్లని లేపుతున్న బాలయ్య...జూనియర్‌తో ఇబ్బంది ఏంటి?

రైతుల‌కు అన్యాయం చేస్తే ఊరుకోం...ష‌ర్మిల వార్నింగ్.. !

పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌ల పెంపుపై టీకాంగ్రెస్ ఆందోళ‌న‌

మాస్క్ పెట్టుకోమని జగన్‌కి కేంద్ర మంత్రి సలహా...?

ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

ఆ విషయాలు బాబు ఎందుకు చెప్పలేదు యనమల?

రంజుగా ఉత్తర ప్రదేశ్ రాజకీయం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>