HealthMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kidsd7763ae5-642d-44e8-868c-a6a2dbcb9f2f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kidsd7763ae5-642d-44e8-868c-a6a2dbcb9f2f-415x250-IndiaHerald.jpgక‌రోనా సెకండ్ వేవ్ మ‌హ‌మ్మారి ఇంకా విజృంభిస్తుండ‌గానే థ‌ర్డ్ వేవ్ టెన్ష‌న్ మొద‌లైంది. అంతే కాకుండా ఇది పిల్ల‌ల్లో ఎక్కువ ప్ర‌భావం చూపిస్తుంద‌ని నిపుణులు చెబుతుండ‌టంతో త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న మొద‌లైంది. కాగా తాజాగా థ‌ర్డ్ వేవ్ చిన్న‌పిల్ల‌లపై చూపించే ప్ర‌భావం గురించి....త‌ల్లి దండ్రులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్తల గురించి పిల్ల‌ల వైద్య నిపుణులు ష‌ర్మిల అనేక సూచ‌న‌లు.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్తలు వివ‌రించారు. చిన్న పిల్లల్లో థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగానే వుంటుందని.. కానీ సరైన సమయానికి గుర్తించి వైద్యం kids{#}Brazil;Singapore;Doctorథ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం ఆ పిల్ల‌లపైనే ఎక్కువ‌.. !థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం ఆ పిల్ల‌లపైనే ఎక్కువ‌.. !kids{#}Brazil;Singapore;DoctorFri, 11 Jun 2021 19:35:56 GMT
ఇప్ప‌డివరకు వ‌చ్చిన మ్యుటేషన్ పిల్లల పై ప్రభావం తక్కువ చూపిస్తుందని అన్నారు. హాస్పిటల్ లో 2 వ వేవ్ లో చాలా తక్కువ మంది పిల్ల‌లు  అడ్మిట్ అయ్యారని అన్నారు. సెకండ్  వేవ్ లో పిల్లలలో స్పష్టంగా లక్షణాలు కనిపించాయని తెలిపారు. అంతే కాకుండా ఫ‌స్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో ఎక్కువ మంది పిల్ల‌లు చ‌నిపోయార‌ని అన్నారు. సింగపూర్ లాంటి ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్ల‌ల్లో కేసులు పెరుగుతున్నాయ‌ని తెలిపారు. బ్రెజిల్ దేశంలో అనేక కేసులు నమోదు అవుతున్నాయన్నారు. చిన్న పిల్లలకి ఇప్పుడు మానసిక ఒత్తిడి అధికంగా ఉందన్నారు. డ‌బ్ల్యూ హెచ్ వో గైడ్ లైన్స్ ప్రకారం ఐదు సవత్సరాల పిల్లలకి మాస్క్ అవసరం లేదన్నారు.

ముఖ్యంగా ఊబ‌కాయం వున్న పిల్లల‌లో కేసుల నమోదు ఎక్కువగా వుంటుందన్నారు. అంతే కాకుండా వారికి రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంద‌న్నారు. లాక్ డౌన్ ప్రభావంతో తల్లి తండ్రులు పిల్లల‌కు అతిగా తినిపిస్తారని కానీ వారికి అవసరం అయిన డైట్ మాత్రమే ఇవ్వాలన్నారు. కరోనా వచ్చి తగ్గిన పిల్లల్లో కొంత మందికి మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరి సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. అలాంటి వారిని వెంటనే గుర్తించి వైద్యం అందించాలన్నారు. సెల్ఫ్ మెడికేషన్ ఎవరూ తీసుకోవద్దని... స్టెరాయిడ్స్ వాడకం కూడా తగ్గించాలని తెలిపారు. పిల్లలకు సిటీ స్కాన్ వంటి పలు రకాల టెస్టుల‌ను డాక్టర్ సూచించినప్పుడు మాత్ర‌మే చేయించాల‌ని అన్నారు.



సీరియల్ నటి కాకముందు వంటలక్క ఏం చేసేదో తెలుసా .. ?

కరోనా ముత్తాత వైరస్.. అసలు విషయం కనుగొన్న శాస్త్రవేత్తలు?

ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. మీ అకౌంట్లో సొమ్ములు భద్రం..?

భర్త ప్రైవేట్ పార్ట్ కోసేసిన భార్య.. దాన్నేం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...

హ్యాట్సాఫ్ డాక్టర్

మేజర్ ఓవర్సీస్ రైట్స్ చాలా హై గురూ ?

పిల్లలకు ఆ ఇంజెక్షన్ లు వద్దు.. హెచ్చరిస్తున్న నిపుణులు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>